.
మజ్లిస్ అక్బరుద్దీన్ ఒవైసీ అంటేనే నోటి దురుసు… గతంలో కూడా చూశాం కదా… ఇప్పుడు మరోసారి మంత్రి సీతక్క మీద నోరు పారేసుకున్నాడు…
ఆ ఆరేడు నియోజకవర్గాలు వాళ్ల సొంత సామ్రాజ్యం… అక్కడ ప్రభుత్వం అంటే వాళ్లదే,., పన్నులకు అతీతులు… ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లతో దోస్తీ నటన… వాళ్లకు అధికార పార్టీలు దాసోహం…
Ads
మొన్నమొన్నటిదాకా కేసీయార్ నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు… పాత బస్తీ రాజ్యం జోలికి పోలేదు… దానికి దాదాపు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్టే వ్యవహరించాడు… ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ సేమ్… ఎగ్జాంపుల్ కావాలా..? నడి చెరువులో భారీ భవనం జోలికి హైడ్రా వెళ్లనిది అందుకే కదా…
అందుకే సీతక్క పట్ల అక్బరుద్దీన్ ఏదేదో మాట్లాడినా కాంగ్రెస్ నుంచి ఎవరూ కిక్కుమనలేదు… చివరకు సీతక్క కూడా నా మాతృభాష తెలుగు, మారుమూల ప్రాంతాల్లో పుట్టి పెరిగాను అని చెప్పుకున్నదే తప్ప అక్బరుద్దీన్ మాటల్లోని అనౌచిత్యాన్ని కౌంటర్ చేయలేకపోయింది…
ఒక మంత్రిని డిఫెండ్ చేసుకోలేని దురవస్థ కాంగ్రెస్ పార్టీది… ‘‘ఆమెకు ఉర్దూ రాదు, ఇంగ్లిష్ అర్థం కాదు, నాకేమో తెలుగు రాదు, మరెలా..?’’ అంటాడు అక్బరుద్దీన్… ఉర్దూ, ఇంగ్లిషు రాకపోతే ఏమిటట..? అవి ఆమెకు అనర్హతలు అయితే, తెలుగు రాని నువ్వెలా అర్హుడివి ప్రజాజీవితానికి..? ఈ ప్రశ్న ఒక్క కాంగ్రెస్ గొంతూ వేయలేదు…
ఇంకా నయం.., ఉర్దూ, ఇంగ్లిషు రాకపోతే అసలు పోటీకే అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేయలేదు, సంతోషం… కేంద్ర సర్వీసు అధికారులకు కూడా స్థానిక భాష నేర్చుకోవడం తప్పనిసరి… మరి ఒవైసీ తెలుగు ఎందుకు నేర్చుకోలేదు..? తెలుగు రాకుండా సభలో ఏం జరుగుతున్నదో ఎలా అర్థమవుతుంది..?
అవును, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఒక్కడే ధైర్యంగా ఈ ప్రశ్న వేశాడు ఎక్స్ వేదికగా… ‘‘ఇక్కడే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు..? ఎందుకు నేర్చుకోలేదు..? అది నీ సామాజిక బాధ్యత కాదా..? ఉర్దూ, ఇంగ్లిష్ రాకపోతే చిన్నచూపా..? ఇదేం పొగరు..?
సభలో తెలుగులో వ్యవహారాలు నడుస్తుంటే మరి నువ్వేం అర్థం చేసుకుంటున్నట్టు..? సభలో ప్రసంగాలు దంచి వెళ్లగానే సరిపోతుందా..? తెలుగు రాకపోతే నీకు రాష్ట్రంలోని సమస్యలు ఏం అర్థమవుతాయి..?’’ అని కౌంటర్ చేశాడు…
ఇదంతా సరే, మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ లేరా పొలిటికల్‌గా సేమ్ కౌంటర్ ఇవ్వడానికి..? మజ్లిస్ అంటే భయమా..? ప్రేమా..? కేసీయార్‌కూ రేవంత్ రెడ్డికీ తేడా ఏమున్నట్టు మరి..? పాత బస్తీ అంటే అదొక స్వతంత్ర రాజ్యం, దానికి మజ్లిస్ పాలకులు, వాళ్లు ఈ కాంగ్రెస్ చక్రవర్తులకు దోస్తులు… అందుకే వాళ్లు ఏమన్నా సరే, భరించాలా..? ఫాఫం, కాంగ్రెస్..!!
Share this Article