ప్రతిసారీ షూటింగు కాగానే బిగ్‌బాస్ హౌజులో ఏం జరిగిందో లీక్ అవుతోంది… ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా ముందే మీడియా రాసేస్తోంది… ఈ లీకుల యవ్వారం మొదటి నుంచీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఉన్నదే… ఇదేమీ కొత్త కాదు…
కానీ ఈ ముందస్తు వార్తలతో బిగ్‌బాస్ వీకెండ్ షోలు, ఎలిమినేషన్ల మీద ప్రేక్షకాసక్తి తగ్గిపోతుంది అనుకున్నట్టున్నాడు బిగ్‌బాస్… తెలివిగా ఈసారి మీడియాను బోల్తాకొట్టించాడు… (గతంలో కూడా ఇలా ఒకటీరెండుసార్లు జరిగినట్టు గుర్తు)… కావాలని ఆ టీమే ఓ తప్పుడు వార్తను లీకయ్యేలా చేయడం, తీరా అందరూ అది రాసుకోగానే, వేరే షూట్ చేసి, అందరినీ పిచ్చోళ్లను చేసి, భిన్నమైన ఎపిసోడ్ ప్రసారం చేయడం ఈ తెలివి…
అఫ్‌కోర్స్, ఇవే తెలివితేటల్ని ఆట రంజుగా నడపడంలో చూపిస్తే బాగుండేది… అది దిక్కులేదు… సరే, లీకేజీలను అరికట్టుకునే ఉద్దేశాన్ని మాత్రం తప్పుపట్టలేం… ఇక అసలు వార్తలోకి వస్తే… యావర్ తనకు దక్కిన ఎవిక్షన్ పాస్‌ను తిరిగి వాపస్ ఇచ్చేశాడనీ, రెండు వీడియోలు చూపించి నాగార్జున తను ఫౌల్ గేమ్ ఆడినట్టు ప్రూవ్ చేశాడనీ పెద్దగా సమాచారాన్ని ఎవరూ సంపాదించలేదు… కాగా బిగ్‌బాస్ కావాలని లీక్ చేసిన శోభాశెట్టి ఎలిమినేషన్ వార్తను మాత్రం అందరూ రాసేశారు…
Ads
ఎందుకు రాశారు అనే దానికి అర్థం లేదు… హౌజులో నడుస్తున్నదే గ్యాంగ్ వార్… ఒక గ్యాంగ్‌కు శివాజీ లీడర్… అందులో ప్రశాంత్, యావర్ ఉంటారు… దీనికి భిన్నంగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా టెంపర్‌మెంట్‌తో నిలిచింది శోభ గ్యాంగ్… అందులో ప్రియాంక, అమర్ ఉంటారు… మిగతావాళ్లు కాస్త సేఫ్ గేమ్ మీద దృష్టి పెడతారు… ఈసారి తొక్కలో లవ్ ట్రాకులు కూడా లేవు హౌజులో… కొత్త టాస్కుల్లేవు, గేముల్లేవు, వినోదం పాళ్లు తక్కువ…
పైగా అదే పాతచింతకాయ పచ్చడి… కొత్త సీసాలో పాతసారా… ఉల్టాపుల్టా అని పేరు పెట్టుకున్నా కొత్తదనం లేదు… అందుకే గత సీజన్‌కన్నా కాస్త మెరుగు రేటింగ్స్ వస్తున్నా సరే, మొదట్లో బిగ్‌బాస్ షో మీద ఉన్న ప్రేక్షకాసక్తి ఇప్పటికీ లేదు… ఆమధ్య ప్రసారం చేసిన ఓటీటీ 24 గంటల షో మరీ అట్టర్ ఫ్లాప్… సో, ఈ స్థితిలో కాస్తోకూస్తో శోభాశెట్టి తలవంచకుండా, సరెండర్ గాకుండా శివాాజీ వికృతాలకు దీటుగా ఆడుతున్న తీరు కాస్త రిలీఫ్…
సో, తాజా సమాచారం ఏమిటంటే… శోభాశెట్టి ఎలిమినేషన్ అనేది నిజం కాదు… ఆమె కూడా బయటికి పోతే షో దెబ్బతింటుందనే భావనతో మళ్లీ ఆమెను సేవ్ చేశాడు బిగ్‌బాస్… శోభ ఎలిమినేషన్ అనగానే శివాజీకి డప్పుకొడుతూ, శోభను బూతులు తిడుతున్న మీడియా బ్యాచ్ అంతా సంబరాలు చేసుకున్నారు… వాళ్లంతా షాక్ ఇప్పుడు… (అఫ్ కోర్స్, శోభ ఎలిమినేషన్ మీద ముచ్చట కూడా వార్త పబ్లిష్ చేసింది… )
ఇక వీకెండ్ షోకు వస్తే… మొన్న ఓ సైటు భలే రాసింది… శివాజీని సుతిమెత్తగా మళ్లీ నాగార్జున మందలించినట్టు నటిస్తాడు… అబ్బే, నేను సరదాగా అన్నాను, దురద్దేశం లేదని శివాజీ చెబుతాడు, నాగార్జున క్షమించేస్తాడు అని… నిజంగా అదే జరిగింది… అమర్‌ను ఉద్దేశించి శివాాజీ పిచ్చి పోహా అనే పదం వాడాడు… నిజానికి అది పచ్చి బూతు… ఎప్పటిలాగే శివాజీ తనను తాను సమర్థించుకోవడానికి పోహా అంటే అటుకులు బాబు గారూ అని చెప్పాడు… అక్కడ పోహా కాదు, మరో బూతు పదం గుర్తొచ్చేలా ఉచ్చరించడం… జస్ట్, ప్యూర్ సంస్కార రాహిత్యం…
అదేమంటే… మాది పల్నాడు అంటాడు… చిన్నప్పటి నుంచీ అవి అలవాటయ్యాడు అంటాడు శివాజీ… అంటే పల్నాడు ఏరియా అంతా బూతుల్లోనే మాట్లాడుకుంటారా..? నాన్సెన్స్… చిన్నప్పటి నుంచీ అలవాటైతే మాత్రం లక్షల మంది చూసే షోలో అలా మాటలు తూలతాడా..? గతంలో కూడా పలుసార్లు ఇలాగే మాట్లాడాడు… చాలా థర్డ్ గ్రేడ్ బిహేవియర్… ఐనా సరే, నాగార్జునకు కోపం రాదు… కారణం, శివాజీ కదా…
ఇలా శివాజీని వెనకేసుకొచ్చి, నెత్తిన మోసి నాగార్జునే తన ఇజ్జత్ పోగొట్టుకుంటున్నాడు… గేమ్స్ ఆడలేడు, డాన్స్ రాదు, వంట చేయడు, వర్క్ చేయడు… ఎప్పుడూ సోఫాలో కూర్చుని, మంచం మీద పడుకుని ఆర్డర్లు పాస్ చేస్తుంటాడు… లేదంటే శోభాశెట్టి వంటి కంటెస్టెంట్ల మీద బెదిరింపు దాడికి దిగుతాడు… మొన్నటి కెప్టెన్సీ టాస్క్ సమయంలో శివాజీ చేసిందదే… దాన్ని కూడా నాగార్జున సీరియస్‌గా తీసుకుని మందలించ లేకపోయాడు… ఒక దశలో శివాజీ ‘శోభ తన ఎలిమినేషన్‌కు తనే బాట వేసుకుంది’ అన్నాడు… అంటే, శివాజీ చెప్పినట్టు హౌజ్ నడుస్తున్నట్టా..?
అందుకే, శోభాశెట్టి ఎలిమినేషన్ అనే సమాచారం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది… ఇప్పటి సమాచారం మేరకు ఈసారి ఎవరూ ఎలిమినేట్ కాలేదు అనేది కూడా ఆశ్చర్యమే… నిజానికి రతిక, అశ్విని చాలా లీస్ట్ వోటింగుల్లో ఉంటున్నారు… మధ్యలో బయటికి వెళ్లివచ్చిన రతిక గానీ, మిడిల్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని గానీ హోప్‌లెస్… ఒకరినైనా ఎలిమినేట్ చేసి ఉండాల్సింది… ఏమాటకామాట హౌజులో ప్రియాంక ఆటతీరు బాగుంది… వంట చేస్తుంది, వర్క్ చేస్తుంది, పొల్లు మాటలు మాట్లాడదు, టాస్కుల్లో 100 పర్సెంట్ కష్టపడుతుంది… టాప్-5లో తప్పకుండా ఉండే పేరు…
Share this Article