ప్చ్… పాటల పోటీ అంటే ఏమైనా కాస్త సంగీత పోటీలా ఉంటుందనుకుని భ్రమపడిపోయా… స్వరాల సమరమేమో అనుకుని అపోహపడ్డా… హమ్మయ్య… ఇదీ ఓ సాదాసీదా టీవీ షో అని అర్థమైపోయింది తొలిరోజే… అచ్చం ఢీ షోలో డాన్సులాగే… ఇందులోనూ సంగీతమేమీ లేదు… జస్ట్, అందరూ పర్‌ఫామ్ చేయడానికి వచ్చారు… తెలుగు సినిమా హీరోకు నటనకన్నా బిల్డప్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ కూడా పాటలకన్నా ఎలివేషన్లు ఎక్కువైపోయాయి…
జీతెలుగులో సరిగమప కాస్త చూడబుల్ అనిపించేది… దాన్ని క్రమేపీ కమర్షియల్ ఎంటర్‌టెయినింగ్ షోగా మార్చేసి, పంచులు, జోకులు, ఇతరత్రా టీవీ మార్క్ అంశాలతో నింపేశారు… ఇప్పుడూ ఇంకాస్త ఓవరాక్షన్… ఎంత ఓవరాక్షన్ అంటే పఠాన్ సినిమాలో డ్రోన్లు కట్టుకుని షారూక్ ఖాన్ వస్తున్నట్టుగా… అనంత శ్రీరాం నిజంగానే గుర్రం స్వారీ చేశాడు… ఎస్పీ శైలజ పల్లకీలో… మనో రథం మీద వస్తారు… హేమిటో, పాపం ప్రదీప్ ఒక్కడే మామూలుగా వచ్చినట్టున్నాడు… నిజానికి ఈ షోకు గుండెకాయ ప్రదీప్ మాత్రమే…
తన స్పాంటేనియస్ పంచులు, అందరితోనూ బాగా కనెక్టయ్యేలా మాటతీరు… నిజంగా ప్రదీప్‌ను తెలుగు యాంకరింగులో కొట్టేవాళ్లు లేరు… ఇంత సీనియర్ అయినా సరే, ఒక్క పొల్లు మాట ఉండదు, అశ్లీల పదాలు పలకడు… ద్వంద్వార్థాల జోలికి పోడు… సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ షోను రక్తికట్టిస్తాడు… ఈ షో విషయానికొస్తే జడ్జిల సంగతి అలా ఉంటే… అసలు షో ఈసారి గతంలో ఛాంపియన్లుగా నిలిచిన వాళ్ల నడుమ పోటీ… అంటే కొత్త గాయకులెవరూ ఉండరు, ఆల్‌రెడీ ప్రూవ్ చేసుకున్నవారికే పోటీ… సంకల్పం ఇంట్రస్టింగే గానీ మరీ సీనియర్లకు, కుర్ర గళాలకు నడుమ పోటీ అంటే అసంబద్ధంగా ఉంది…
Ads
పైగా వీరిలో ఆల్‌రెడీ సినిమాలకు పాడుతున్నవాళ్లు ఉన్నారు… మరి కొత్తవాళ్లకు ఆడిషన్లు పెట్టి, కొత్త గళాలకు ఓ వేదికగా మారొచ్చు కదా… నాలుగు టీమ్స్… ఒకటి శ్రీకృష్ణ, రెండోది రమ్య బెహరా… మూడు పృథ్వి, నాలుగోది సాకేత్… రమ్య బెహరా కనిపించినంతసేపు అందంగా, తెర ఆహ్లాదంగా ఉంది…
ఇప్పుడు కంటెస్టెంట్టుగా వచ్చినవాళ్లలో రేణుకుమార్, ధరంశెట్టి ఆల్‌రెడీ ఆహా ఓటీటీలో వచ్చిన ఇండియన్ ఐడల్ షోలో పాల్గొన్నవాళ్లే… యశస్వి అందరికన్నా మెలోడియస్, మెరిటోరియస్ అనిపిస్తుంది… లాంచింగ్ ప్రోగ్రాంకు గెస్టుగా వచ్చిన విష్వక్సేన్ కాస్త ఆడ్‌గా అనిపించాడు… తను ఏదో సినిమాకు ప్రమోషన్ కోసం వచ్చినట్టున్నాడు… తనను చూడగానే తన యాటిట్యూడ్ గుర్తొస్తూ, ఆ షో మీద అభిప్రాయమే మారిపోతూ ఉంది…
అనంత శ్రీరాం ఎప్పుడూ టీవీల్లో హైపర్ ఆది షోలు చూడటం గానీ, తనను స్పూర్తిగా తీసుకోవడం గానీ చేయవద్దని సూచన… నేను పంచులు వేస్తూ ఉన్నాను, ఇక నాకు తిరుగులేదు అనే భావన వదిలించుకోవడం మంచిది… చికాకుగా అనిపించింది… అన్నింటికన్నా చిన్న సింగర్ వాగ్దేవి ముద్దుగా బాగుంది… బాగా పాడుతుండటమే కాదు, బంగారం అంటూ మిమిక్రీ చేయడం కూడా బాగుంది… మిగతా కంటెస్టెంట్లలో పార్వతి గురించి ఇదివరకే చాలా చాలా రాసేశారు అందరూ… పాటల సంగీతం పేరిట ఏమిటీ వికారాలు అని విసుక్కోకండి, నచ్చకపోతే పాత పాడుతా తీయగా వీడియోలు ఓపెన్ చేయండి… వంద రెట్లు బాగుంటయ్… అసలైన స్పూర్తితో…!!
Share this Article