వాడు… గలీజుగాడు… వాడొక యూట్యూబర్ అట… ఈ పరుషపదాల్ని వాడటానికి ఏమాత్రం సంకోచించడం లేదు… మరిన్ని బూతులకూ తను అర్హుడే… పేరు ప్రణీత్ హన్మంతు… ఆన్‌లైన్ రోస్టింగ్ అనబడే ఓ వెకిలి సోషల్ ఫార్మాట్‌లో తండ్రీకూతుళ్ల బంధం మీద వెగటు కూతలకు దిగిన తీరు ఖచ్చితంగా శిక్షార్హం… కఠిన శిక్షార్హం…
ఇదుగో ఇలాంటివే సొసైటీలో విషాన్ని, అశ్లీలాన్ని పంప్ చేస్తుంటాయి… అయ్యో, నేను తప్పు చేశాను, క్షమించండి అంటే వదిలేయాల్సిన కేసు కాదు ఇది… ఖచ్చితంగా ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసి, మిగతా వాళ్లందరికీ ఓ పాఠం నేర్పించాల్సిందే… తప్పు చేసింది నేను, నా ఫ్యామిలీ మెంబర్స్‌ను లాగకండి అట… మరి నువ్వు చేసిందేమిట్రా..?
ఒక చిన్నారి బిడ్డతో ఓ తండ్రి ప్రేమగా ఆడుకుంటుంటే ఎంత నీచంగా కామెంట్స్ చేశార్రా మీరు… ఆ ఆన్‌లైన్ వీడియోలో పాల్గొన్న ఇతరులనూ బుక్ చేయాల్సిందే… ‘రియల్ రోస్టింగ్’ అంటే ఏమిటో పోలీసులు టేస్ట్ చూపించాల్సిన కేసు ఇది…
Ads
అసలు ఏమిటీ రోస్టింగ్… ట్రోలింగులు, బూతు షోలు, అశ్లీల వీడియోలు పాత ట్రెండ్ అట… ఇప్పుడు ఏదైనా ఫోటో లేదా వీడియో పెట్టేసి… ఇక దానిపై కొందరు ఆన్‌లైన్‌లోనే ఇదుగో ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు, జోకులతో రెచ్చిపోతూ తమలోని జంతు ప్రవృత్తిని చాటుకుంటారన్నమాట… (సకల జంతుజాలానికీ క్షమాపణలతో…) ఆన్‌లైన్‌లో ప్రేక్షకులు ఇవన్నీ చూస్తూ ఆనందిస్తారట… ఇది ఖచ్చితంగా ఓ జాఢ్యం… మానవ బంధాలకు ఓ విపత్తు… ఒకరకంగా చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసే పైశాచికమే ఇది కూడా…
సాయిధరమ్‌తేజ ఓ డిఫరెంట్ కేరక్టర్… పెద్దగా మన హీరోలకు అలవాటైన సోది బిల్డప్పుల జోలికిపోడు… తను ఈ ఆన్‌లైన్ రోస్టింగ్ వీడియోపై ఇమీడియెట్‌గా స్పందించాడు… సీఎంలను, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేసి ట్వీటాడు… గుడ్, రియల్ హీరో… తరువాత మిగతా కొందరు స్పందించారు… మంచు మనోజ్, నారా రోహిత్, ఖుష్బూ (జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు), విష్వక్సేన్ కూడా స్పందించారు, ఖండించారు…
ఛీ, ఇలాంటి నీచుడికా నేను ఇంటర్వ్యూ ఇచ్చింది అంటూ హీరో కార్తికేయ లెంపలేసుకున్నాడు… వీడిని హరోంహర సినిమాలో భాగం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను అని సుధీర్ బాబు అంటున్నాడు… సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులూ స్పందించారు… డీజీపీ కూడా కఠినమైన కేసు పెడుతున్నట్టు ట్వీటాడు… గుడ్, ఈమాత్రం సమాజం స్పందిస్తేనే ఇతరులకూ ఓ లెసన్ నేర్పినట్టు… కానీ..?
పెద్ద పెద్ద బిల్డప్పుల తోపు హీరోలు, దిగ్దర్శకులు, ఆస్కార్లు ఏమయ్యారు..? ఆ గొంతులు కనీసం ఇలాంటి సమస్యల మీద కూడా స్పందించవా..? పెద్ద హీరోల గొంతులు పెగిలితే ఇలాంటి జాఢ్యాల మీద పబ్లిక్ రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది… ఇలాంటి చెత్త ఆన్‌లైన్ వీడియో వాగుళ్ల మీద వ్యతిరేకత పెరుగుతుంది… మరెవరూ ఎందుకు స్పందించరు..? ఏం బతుకులురా భయ్ మీవి..?! ఎంతసేపూ ఆ ఫేక్ ఇమేజీ బిల్డప్పులు, డబ్బులు, భజనలు తప్ప మరో ప్రపంచమే లేదారా మీకు..?!
అన్నట్టు … పొలిటికల్ బురదలో దొర్లే మీడియా కూడా దీనిపై సరిగ్గా స్పందించలేదు… ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రం ప్రయారిటీ ఇచ్చి పబ్లిష్ చేసింది… ఇవి డెయిలీ డిబేట్లలోకి ఎందుకు రావు..? నిజానికి అన్ని విషయాల్లో యాక్టివ్‌గా ఉండే సోషల్ మీడియాయే ఈ పెడ ధోరణులనూ చెరిగేయాల్సింది..!!
Share this Article