ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని ఏమిటి..? ‘మహిళల్ని అర్థం చేసుకోవడం, అందులోనూ భార్యల్ని అర్థం చేసుకోవడం…’ ఈ కాన్సెప్టుతో కొన్ని లక్షల జోకులు, కార్టూన్లు, మీమ్స్, కథలు గట్రా వచ్చి ఉంటాయి కదా… అందులో ఒకటి ఇదుగో ఈ కార్టూన్ కూడా… జస్ట్, ఓ ఉదాహరణ కోసం…
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ కాకా… ఫుట్‌బాల్ ప్లేయర్లలో చాలా అందగాడిగానే పేరు… లుక్స్ మాత్రమే కాదండోయ్… అటాకింగ్ మిడ్ ఫీల్డర్… వేగానికీ, చురుకుదనానికీ, డ్రిబ్లింగ్ సామర్థ్యానికీ మంచి పేరు… టాప్ యూరోపియన్ టీమ్స్ ఏసీ మిలన్, రియల్ మాడ్రిడ్ జట్లకు మాత్రమే కాదు, 2002 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడు… 2006 ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా ఆడాడు…
Ads
2005లో కాకా తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి కరోలిన్ సెలికోను సాల్ పోలోలో పెళ్లి చేసుకున్నాడు… అందమైన జంట అని అందరూ పొగిడారు… కానీ పదేళ్ల తరువాత వాళ్లు విడాకులు తీసుకున్నారు… తమ విడాకులకు కారణమేమిటో ఇన్నేళ్లూ ఏమీ చెప్పలేదు… ఇద్దరిలో ఎవరూ… మొన్న ఆమే పెదవి విప్పింది…
‘‘ప్రాబ్లం అంటే నిజానికి ఏమీ లేదు… నన్నెప్పుడూ మోసగించలేదు, అత్యంత నమ్మకస్తుడు… నన్ను బాగా చూసుకునేవాడు… నాకొక బ్రహ్మాండమైన కుటుంబాన్ని ఇచ్చాడు తను… అత్యంత పర్‌ఫెక్ట్ మొగడు తను…’’ అని చెప్పుకొచ్చింది…
మరెందుకు విడాకులు తీసుకున్నావమ్మా అనడిగితే… ‘విడిపోవాలనే నిర్ణయం నాదే, తనకు ఇష్టం లేదు, అంత బాగా ప్రేమించాడు నన్ను… కానీ అంతా బాగానే ఉన్నా సరే, నాలో ఏదో తెలియని అసంతృప్తి, ఏదో మిస్సవుతున్న ఫీలింగ్, ఇంకా నేరుగా చెప్పాలంటే, తను అంత పర్‌ఫెక్ట్ భర్త కాబట్టే విడాకులు అడిగానేమో…’ అని వివరించింది…
అసలు ఆమె చెప్పదలుచుకున్నది ఏమైనా తనకైనా అర్థమవుతోందా అనంటే… నిజమే, నేనే విడమరిచి చెప్పలేకపోతున్నాను అంటోంది…
చూశారుగా… భర్త సరిగ్గా లేకపోతేనేమో అదొక సమస్య… ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం… గొడవలు… అశాంతి… అసలు అవేమీ లేకపోతేనే ఏదో వెలితి ఫీలయ్యిందా ఆమె… సమస్య లేకపోవడమే ఓ సమస్యగా భావించిందా..? పెక్యూలియర్ కేరక్టర్…
Share this Article