Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాయిగత్తర లేదు, అగ్గి లేదు… తన పరిమితులేమిటో కేసీయారే చెప్పేశాడు…

April 28, 2022 by M S R

ఓ డిజిటల్ పత్రికయితే నేరుగా రాసేసింది… కేసీయార్ జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని… అంటే భారతీయ రాష్ట్ర సమితి అట… అబద్ధం… తను ఆ మాట చెప్పలేదు… చెప్పాలనే ఉద్దేశం కూడా తనకు లేదు… పార్టీ ఎమ్మెల్యే నుంచి వచ్చిన ప్రతిపాదన మాత్రమే అని స్పష్టంగానే చెప్పాడు… నిజానికి పరోక్షంగా తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఉన్న పరిమితులేమిటో కూడా కేసీయార్ తన ప్లీనరీ ప్రసంగంలో చెప్పాడు…

ఎస్, ఒక రాజకీయ పార్టీకి జాతీయ రాజకీయాల మీద ధ్యాస, ఆసక్తి ఉండటం తప్పు కాదు… నిజానికి జాతీయ అంశాల మీద ఓ దృక్పథం, లైన్ లేకపోవడమే తప్పు… ఆ కోణంలో కేసీయార్ చెబుతున్నదాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… ఇప్పుడే కాదు, గత లోకసభ ఎన్నికల ముందు నుంచీ తను జాతీయ రాజకీయాల గురించి చెబుతూనే ఉన్నాడు… ఒక్కముక్కలో చెప్పాలంటే ఆ దిశలో ఈరోజుకు పడిన ముందడుగు ఏమీ లేదు…

కాంగ్రసేతర- బీజేపీయేతర ఫ్రంట్ అన్నాడు… ప్రాంతీయ పార్టీల సమాఖ్య అనుకున్నాడు… మమత, స్టాలిన్, ఠాక్రే వంటి కొందరు లీడర్లను తనే వెళ్లి కలిశాడు… తేజస్వి వంటి కొందరు లీడర్లు హైదరాబాద్ వచ్చి మరీ కేసీయార్‌ను కలిశారు… కానీ అంతిమంగా జరిగింది ఏమిటి..? ఏమీ లేదు… కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేసీయార్‌ను రానివ్వడం లేదు… మొన్న ఆ కూటమి బహిరంగ లేఖ విడుదల చేసినప్పుడు కూడా కేసీయార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు…

Ads

సో, తను కోరుకున్న కాంగ్రెసేతర యాంటీ-బీజేపీ ఫ్రంటు అంత సులభ సాధ్యం కాదు… కాంగ్రెస్ కూటమి తనను రానివ్వడం లేదు… అయితే నిన్నటి ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించండి… ‘ఇద్దరు ముగ్గురు సీఎంలను గుంపు చేయడం, నాలుగు పార్టీలను ఒక్కటి చేయడం, దోస్తానా కట్టడం వల్ల ప్రయోజనం లేదు, అవి చిల్లర మల్లర రాజకీయాలు’’ అన్నాడు తను… అంటే ఈ ఫ్రంట్లకు సంబంధించి టీఆర్ఎస్ పరిమితి ఏమిటో కేసీయార్‌కు తత్వం బోధపడినట్టే…

kcr

అంతేకాదు, బీజేపీ అంతుచూస్తాం, ఢిల్లీలో గాయిగత్తర లేపుతా, అగ్గిపెడుతా అనే భాష కూడా లేదిప్పుడు… ‘‘బీజేపీని గద్దె దించాలని, అదే మన లక్ష్యం కావాలని కొందరు లీడర్లు చెప్పిన్రు… అది చెత్త ఎజెండా… ఎవరినో గద్దె దింపడానికి లేదా గద్దె ఎక్కించడానికి వేరే పార్టీలతో కలవాలా..? గద్దె దించాల్సింది పార్టీలను కాదు, ఎక్కించాల్సింది దేశప్రజలను…’’ అంటున్నాడు… బీజేపీ మీద ఆ ఫైర్ లేదు… (గద్దె ఎవరు ఎక్కినా ఈ దేశ ప్రజలే సారూ… అది రాహుల్ అయినా సరే, మోడీ అయినా సరే… వాళ్లు కూడా ఈ దేశ ప్రజలే…)

ధాన్యం విషయంలో పోరాటం, తాటతీస్తా అన్నట్టు మాట్లాడాడు కదా… ఏం జరిగింది..? ఢిల్లీలో స్వయంగా నిరసనకు కూర్చుంటే… తనతో ఉన్నది ఎవరు…? కేవలం టికాయిట్… తను చేసిన రైతాంగ పోరాటాల వెనుక కూడా పొలిటికల్ ఎజెండా ఉందని యోగేంద్ర యాదవ్ వంటి సహచరులు చెబుతూనే ఉన్నారు… కేసీయార్ నిరసనకు ఏ ఒక్క పార్టీ సంఘీభావం ప్రకటించలేదు… ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? ఫోర్టిఫైడ్ రా రైస్, బాయిల్డ్ రైస్ విషయంలో ఎఫ్సీఐ చెప్పినట్టే తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటోంది…

ఇక ప్రత్నామ్నాయ ఎజెండా గురించి..! అదొక బ్రహ్మపదార్థం… తను గతంలోనూ చెప్పాడు… మాజీ బ్యూరోక్రాట్లతో భేటీ పెడతాను అన్నాడు… తనే గతంలో సీఎంల భేటీ గురించీ మాట్లాడాడు… అవేవీ జరగలేదు… అసలు ఈ దేశంలో బ్యూరోక్రాట్ల ఆలోచనలే లోపభూయిష్టాలు… వాళ్లతో భేటీ వేసి ఖరారు చేసే ఎజెండాతో ఒరిగేదేమిటి..? నిజంగానే దేశాన్ని ఉద్దరించే ఓ ప్రత్యామ్నాయ ఎజెండాను కేసీయార్ చర్చకు పెడితే మంచిదే… అలాంటి చర్చలు అవసరం కూడా… కానీ ఆ దిశలోనూ జరిగిందేమీ లేదు కదా… ‘‘ఆ దారులు వెతకాలి’’ అంటున్నాడు తను… అవును, వెతకాల్సి ఉంది… ఇప్పటికైతే ఏమీలేదు…

సరే, బీఆర్ఎస్ పెడతారు అనుకుందాం… రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్, జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్ సాధ్యమేనా..? సాధ్యమే అనుకుందాం… టీఆర్ఎస్‌ను కేటీయార్‌కు అప్పగించి, కేసీయార్ బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకుంటాడు అనుకుందాం… కానీ వేరే రాష్ట్రాల్లో కలిసొచ్చే రాజకీయ శక్తులేమున్నాయి..? సో, జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలతో సత్సంబంధాలున్న ప్రశాంత్ కిషోర్‌‌ను అలా టచ్‌లో ఉంచుకోవడం, రేప్పొద్దున ఎన్నికల ముందో, తరువాతో అవసరాన్ని బట్టి అడుగులు వేయడం… అదే కేసీయార్ ప్రస్తుత పంథా… అంతే… ఏమో, నాలుగు రోజులకు ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ప్రకాష్ రాజ్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అక్కరలేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions