.
నిజానికి ఎన్డీటీవీ న్యూస్ వెబ్‌సైట్‌లో అంత అనాలోచితంగా ఎలా రాస్తార్రా బాబూ ఈ వార్తను అనుకున్నాను దాన్ని చదవగానే… కానీ కొద్ది గంటల్లోనే దానంతటదే ఆ న్యూస్ డిలిట్ కొట్టేసింది…
అంటే, సదరు సినిమాకు సంబంధించిన వాళ్లు బలంగా దాన్ని ఖండించి ఉండాలి… లేదా మేం తప్పు రాశాం అని లెంపలేసుకుని ఆ స్టోరీ డిలిట్ కొట్టి ఉండాలి… అప్పుడే అర్థమైంది వాళ్లు రాసిన మొదటి స్టోరీలో నిజం లేదని..!
Ads
విషయం ఏమిటంటే..? బాలయ్య నటించిన సినిమా డాకూ మహారాజ్ ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలు… అందరికీ ఎందుకు దానిపై కాస్త ఆసక్తి ఏర్పడిందీ అంటే… సినిమాలో ఊర్వశి రౌతేలా నటించిన సీన్లు కట్ చేశారు, పాటలు తీసేశారు, ఆ ఎడిటెడ్ వర్షనే ప్రసారం చేయబోతున్నారనే అనే వార్తల వల్ల…
అరె, ఓటీటీ ప్లాట్‌ఫాం తనంతట తాను సినిమాను ఎడిట్ చేస్తుందా..? చేయడానికి ఆ ఒప్పందాలు అంగీకరిస్తాయా..? ఎక్కడపడితే అక్కడ సీన్లు కట్ చేస్తే సినిమా ఫ్లో చెడిపోదా..? అది అంతిమంగా ఆ ఓటీటీకే నష్టం కాదా..? అంత మూర్ఖంగా ఎందుకు వ్యవహరిస్తారు అనే డౌటనుమానం వచ్చింది మొదటి స్టోరీలు చదివితే…
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఎడిటింగ్ మీద ఎప్పుడైతే నేషనల్ మీడియా వెబ్‌సైట్లలో వార్త వచ్చిందో మన తెలుగువాళ్లూ నమ్మేశారు, అదే రాసేశారు, సగం ప్రశ్నార్థకం, సగం ఆశ్చర్యార్థక్ం పెట్టేసి..! ఫాఫం, ఈ సినిమా టీం కూడా ఎన్డీటీవీ వార్తను నమ్మడం మరో ఆశ్చర్యం… నేషనల్ మీడియా అయితేనేం, వాళ్లూ ఈతరం జర్నలిస్టులే కదా అక్కడా పనిచేసేది… తప్పులు రాయొద్దని ఏముంది..?
ఈ వార్తలపై సినిమా టీం కూడా ఎక్కడా అధికారికంగా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయలేదు, అదొక ఆశ్చర్యం, అమ్మేశాం, ఇక వాడి చావు వాడు చావనీ అనుకున్నారేమో..! అదీ బాధ్యతారాహిత్యమే… నిజానికి జరిగింది ఏమిటీ..? ఏమీ లేదు, నెట్‌ఫ్లిక్స్ వాడు కత్తెర ఏమీ పట్టుకోలేదు, పట్టుకోలేడు, కుదరదు, యథాతథంగా సినిమా స్ట్రీమింగులో ఉంది…
వోకే, ఆమె… అనగా ఊర్వశి రౌతేలా బ్యాక్ మీద బాలయ్య చేతులతో బాదేస్తాడు ఓ పాటలో… ఆ వెగటు స్టెప్పుల మీద చాలా విమర్శలు వచ్చాయి… ఐనాసరే, నెట్‌ఫ్లిక్స్‌కు అవసరం లేదు ఆ విమర్శలు, వాడేమీ సొంత సెన్సారింగుకు పూనుకోకూడదు… నిర్మాత, దర్శకుడు, కొరియోగ్రాఫర్, హీరోల నీచాభిరుచి అది… సదరు నటి కూడా ఆనందంగా అంగీకరించింది…
సైఫ్ అలీ ఖాన్ మీద దాడి విషయంలో ఏవో పిచ్చి కూతలు కూసింది ఆమె… సో వాట్..? దానికీ సినిమాకు సంబంధం ఏమిటి..? ఆమెకూ నెట్‌ఫ్లిక్స్‌కూ ఏ గొడవలు లేవు… ఉండాల్సిన అవసరమూ లేదు, ఉన్నా సరే, సినిమా సెన్సారింగ్ నెట్‌ఫ్లిక్స్ పని కాదు… సో, బయటికి ఏ కారణాలు వినిపించినా సరే, అవేమీ హేతుబద్ధంగా లేవు… మూర్ఖంగా కూడా వినిపించాయి… తీరా చూస్తే అవన్నీ తూచ్… పిచ్చి కథనాలు… తిక్క వార్తలు… ఓటీటీ వెర్షన్‌లో ఆమె ఉంది, ఆ తలతిక్క బాదుడు అలియాస్ ‘వాయింపు’ స్టెప్పులు కూడా ఉన్నాయి..!!
Share this Article