Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీకప్పు మీద కూడా ట్రోలింగ్… ఇదెక్కడి సోషల్ పైత్యంరా బాబూ…

July 10, 2022 by M S R

మన మీడియాకు కొన్ని పరిమితులు ఉన్నాయేమో…. సోషల్ మీడియాకు పరిమితులేమున్నయ్…? ఎవడికిష్టం వచ్చింది వాడు రాసేసుకోవడం, నచ్చకపోతే తెలుగు కొత్త బూతు భాషలో ఒరే పువ్వా, నీ గువ్వా అని ట్రోలింగ్ చేసే ఎదవలు… మోడీ, జిన్‌పింగ్, బైడెన్… ఎవడైతేనేం..? నోటికొచ్చినట్టు తిట్టడమే… అసలు ప్రపంచానికి అతిపెద్ద శాపం సోషల్ మీడియా… ఇండియాకు కూడా… కాకపోతే మోడీకి ఇంకా అర్థం కావడం లేదు… బహుశా తన వాట్సప్ యూనివర్శిటీకి కూడా అదే పంథా నిర్దేశించాడు కాబట్టేమో…

విషయం ఏమిటంటే..? బ్రిటన్ ప్రధానిగా ఒకాయన ఉద్దరించి, తన నిజరూపం బయటపడేసరికి ఇక దిగిపోయే దురవస్థ… దిగిపోయాడు… తన స్థానంలో రిషి సునాక్ వచ్చే చాన్సుంది… ఇండియన్ రూట్స్… అవన్నీ వదిలేసి సోషల్ మీడియా దేన్ని పట్టుకుందో తెలుసా..? ఆయన భార్య అక్షిత మూర్తి… అదేనండీ ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, బొచ్చెడు నీతికథల సుధామూర్తి బిడ్డ అక్షిత వాడే టీసెట్ గురించి…

ఈమధ్య ఏదో పాత్రికేయులకో, ఎవరో వీవీఐపీలకో ఆమె ఖరీదైన టీ సెట్‌లో చాయ్ ఆఫర్ చేసిందట… ఆమె స్వయంగా ఆ కప్పుల్లో తీసుకురావడమే విశేషం… తీరా ఇప్పుడు ట్రోలర్స్ సబ్జెక్టు ఏమిటయ్యా అంటే… 3500 రూపాయల ఖరీదైన కప్పులట అవి… ట్రోల్ చేస్తున్నారు… సిగ్గులేని తంతు కాకపోతే… ఆమె ఆస్తి, ఆమె టేస్ట్ పరిగణనలోకి తీసుకోకపోవడం…

Ads

akshata murthi

ఒక్కసారి అమెజాన్‌లో చెక్ చేయండి… లక్ష రూపాయలు దాటిన టీసెట్ కనిపిస్తుంది… వెండి, బంగారు కప్పుల్లో టీ ఆఫర్ చేసేవాళ్లు ఇండియాలోనే కోకొల్లలు… అంతేకాదు, వెండి, బంగారు పళ్లేల్లో భోజనాలు పెట్టే వాళ్లు వేలల్లో కనిపిస్తారు… అవి రెగ్యులర్‌గా వాడేవి కావు… బాగా మర్యాద చేయాల్సినవాళ్లు వచ్చినప్పుడో, ప్రత్యేక సందర్భాల్లోనో వాడేవి… మరి 3500 టీ కప్పు అనేది పెద్ద ఖరీదైన అవలక్షణం ఎలా అయ్యింది..?

అదంతా ఆలోచిస్తే సోషల్ మీడియా ట్రోలర్స్ కుత్సిత బుద్ది బయటపడుతోంది… ఓ ఇండియన్ రూట్స్ వ్యక్తి ఏకంగా బ్రిటన్ ప్రధాని కుర్చీ కోసం ప్రయత్నిస్తున్నాడు… అది వదిలేసి, ఆయన భార్య తీసుకొచ్చిన టీసెట్ ఖరీదేంటి..? ఆమె వేసుకున్న డ్రెస్ ధర ఎంత..? అనే అంశాలపై చర్చ సాగుతోంది… ఆమెకు ఏవేవో వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఆస్తులు అక్కర్లేదు… తనకు ఇన్‌ఫోసిస్‌లో ఉన్న వాటాలతోనే… మస్తు లావిష్‌గా బతకగలదు… ఆఫ్టరాల్ 3500 టీకప్పు… ఈమాత్రం సోయి లేదా..? మరీ ఇండియన్ మీడియాలాగా తయారయ్యారేంట్రా…! ఆమె నారాయణమూర్తి బిడ్డరా బాబూ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…
  • జైషా నిశ్శబ్ద దరహాసం..? మొత్తం ఆ వైరల్ ఫోటోలో ఉన్నట్టుగానే…?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions