.
ఓ పేద్ద ప్రశ్న… ఉత్తర కొరియా అనబడే ఓ సూడో కమ్యూనిస్టు దేశంలో…. నిజానికి కమ్యూనిజం అంటేనే ఓరకమైన నియంతృత్వం… పేరుకు మాత్రం ఎన్నికలు, ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పు అనబడే ఓ ఫేక్ తంతు నిర్వహించబడుతుంది…
ఈమధ్య ఎన్నికలు జరిగాయి… వాటిని ఎన్నికలు అనొచ్చా లేదా అర్థం చేసుకోవడానికి దిగువన ఓ లింక్ ఇచ్చాను, చదివి నవ్వుకొండి మనసారా… ప్రపంచంలో ఇలాంటి దిక్కుమాలిన దేశాలు కూడా ఉంటాయా అని హాశ్చర్యపోవద్దు… ఉంటాయని గుర్తించండి,…
Ads
సరే, 100 శాతం పోలింగు, 100 శాతం అధికార పార్టీకే వోట్లు… అదీ ఓపెన్ వోటింగు, వ్యతిరేక వోటు వేస్తే శిక్షలు అనే ఆ విచిత్రమైన ప్రపంచంలో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్… అదొక ప్రహసనం…
ఐతే రిజల్ట్స్ వచ్చాయి… కిమ్ గాడికి… (పర్లేదు, వాడు అనే అందాం)… 99.97 శాతం వోట్లు వచ్చాయి… కానీ 100 శాతం రావాలి కదా… మరి ఈ 0.03 శాతం వ్యతిరేక వోట్లు ఏమిటి..? వ్యతిరేక వోటు వేసి బతుకుతారా ఆ దేశంలో..? ఇదీ మిస్టరీ…
పైన లింకు చదివితే మీకు కొరియా ఎన్నికలు ఎంత ఫార్సో, ఎంత ఫేకో అర్థమవుతాయి… సరే, ఈ 0.,03 శాతం వ్యతిరేక వోటు ఏమిటనేది అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది… కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార పార్టీకి 99.97 శాతం ఓట్లు రాగా, మిగిలిన 0.03 శాతం ఓట్లు ఎటు వెళ్లాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…
ఓటు వేయని ఆ ‘తృటి’ శాతం ఎవరు? సాధారణంగా ఉత్తర కొరియాలో ఓటు వేయకపోవడం అనేది దేశద్రోహంతో సమానం… కానీ, ఈసారి అధికారిక గణాంకాల ప్రకారం 99.99 శాతం పోలింగ్ నమోదైంది… అంటే 0.01 శాతం మంది ఓటు వేయలేదు… దీనికి గల కారణాలను విశ్లేషిస్తే, ఇది ప్రజల వ్యతిరేకత కంటే సాంకేతిక కారణాల వల్ల జరిగిందని తెలుస్తోంది…
-
విదేశీ ప్రయాణాలు…: ఉత్తర కొరియా నుండి విదేశాల్లో దౌత్యపరమైన విధులు నిర్వహిస్తున్న వారు, అక్కడ కార్మికులుగా పని చేస్తున్న వారు సమయానికి ఓటు వేయలేకపోయారు…
-
సముద్ర విధులు..: సముద్రంపై సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న సైనికులు, చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఓటింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోవడం వల్ల ఆ స్వల్ప శాతం పోలింగ్ తగ్గింది…
వ్యతిరేక ఓటు.. కిమ్ వ్యూహమేనా? పోలింగ్ శాతం పక్కన పెడితే, పోలైన ఓట్లలో కిమ్ అభ్యర్థులకు 99.97 శాతం మాత్రమే మద్దతు లభించింది… మిగిలిన 0.03 శాతం మంది అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేశారు… దశాబ్దాల కాలంలో ఉత్తర కొరియా ఎన్నికల చరిత్రలో ‘వ్యతిరేక ఓటు’ (Against Vote) నమోదు కావడం ఇదే తొలిసారి…
అయితే, ఇది కిమ్ పాలనపై తిరుగుబాటు అని అనుకుంటే పొరపాటే… తమ దేశంలో కూడా ‘ప్రజాస్వామ్యం’ ఉందని, భిన్నమైన అభిప్రాయాలకు తాము విలువ ఇస్తామని ప్రపంచ దేశాలకు కలరింగ్ ఇవ్వడానికే కిమ్ ఈ చిన్నపాటి మార్పును అనుమతించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు… రెండు రంగుల బాక్సులను (సమర్థనకు ఆకుపచ్చ, వ్యతిరేకతకు ఎరుపు) ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం… ఎన్నికల ప్రక్రియలో ‘పారదర్శకత’ ఉందని నమ్మించడమే…
విశ్లేషణ: ఏది ఏమైనా, 0.03 శాతం వ్యతిరేకతను కూడా లెక్కించి చెప్పడం ద్వారా.. ఉత్తర కొరియా తన పాత పద్ధతులను మార్చుకుంటున్నట్లు నటిస్తోంది… కానీ, ఎరుపు బాక్సులో ఓటు వేసే ధైర్యం సామాన్య పౌరుడు చేయలేడని, అది కేవలం ప్రభుత్వమే ప్లాన్ చేసిన ‘షో’ అని అంతర్జాతీయ మీడియా కొట్టిపారేస్తోంది… ఏది ఏమైనా కిమ్ రాజ్యంలో ఈ 0.03 శాతం ఇప్పుడు ఒక ‘గ్లోబల్ సర్ ప్రైజ్’…
Share this Article