.
జబర్దస్త్ రేటింగ్స్ ఇంకా ఇంకా పడిపోతుండటంతో… ఏవో మార్పులు పేరిట, డబుల్ కామెడీ, డబుల్ వినోదం అంటూ ప్రచారం చేశారు… చివరకు డబుల్ యాంకర్స్ అనీ అన్నారు… ఆల్రెడీ డబుల్ జడ్జిలు కాదు, నలుగురిని చేయలేదు, సంతోషం…
ఐతే సుడిగాలి సుధీర్ రేంజులో ఎంట్రీ ఇచ్చిన మానస్ యాంకరింగ్ అంతగా ఆకట్టుకోలేదు… మరీ రష్మి పక్కన పేలవంగా తేలిపోయాడు… అఫ్‌కోర్స్, యాంకరింగ్ కొత్త కదా, క్రమేపీ అలవాటవుతాడేమో గానీ ప్రస్తుతానికి వెలవెలే… యాంకర్ల నడుమ పోటీ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు గానీ రష్మియే షోలో హైలైట్…
Ads
రష్మిది పదేళ్ల సీనియారిటీ… ఆ జబర్దస్త్ సెట్లోనే తెలుగు నేర్చుకుంది, యాంకరింగుకు పదును పెట్టుకుంది… వేరే చానెళ్ల షోలు చేయదు… జస్ట్, ఈటీవీ… దొరికితే సినిమా చాన్స్ లేదంటే ఈటీవీ, అంతే… వేరే పరుగు ఉండదు… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ… సో, అలవోకగా చేసేస్తుంది…
నిజం చెప్పాలంటే… శ్రీముఖి తరువాత ప్లేసు ఆమెదే ఫిమేల్ యాంకరింగులో ప్లేసు… సరే, శ్రీముఖి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది… స్పాంటేనిటీ, ఎనర్జీ ఫుల్ జోష్… కాకపోతే హైపిచ్ అరుపులొక్కటే చికాకు… మొన్నమొన్నటిదాకా సుమ… కానీ ఆమె సుమ అడ్డా అట్టర్ ఫ్లాప్… మొనాటనీ వచ్చేసింది జనానికి…
అదేదో మాస్టర్ చెఫ్ ఏదో చేసింది ఫన్నీగా కానీ ఆకట్టుకోలేదు… విచిత్రంగా తనతో ఈక్వల్ టాప్ యాంకర్ స్టేటస్ అనుభవించిన ప్రదీప్ ప్రస్తుతం యాంకరింగులో లేడు… ఈమధ్య ఏదో సినిమా చేశాడు, తన్నేసింది… మళ్లీ బుల్లితెరకు వచ్చేయాలి, కానీ రాలేదు ఎందుకో మరి…
మేల్ యాంకర్లలో సుడిగాలి సుధీర్ బాగా క్లిక్కయ్యాడు… ఆహాలో సర్కార్, డ్రామా జూనియర్స్, ఫ్యామిలీ స్టార్… ఇప్పుడు తనే టాప్… సో, అటు ఫిమేల్ యాంకరింగులో రష్మి, ఇటు మేల్ యాంకరింగులో సుధీర్ (పదేళ్ల ప్రేమజంట- తెర ప్రేమికులు) వాళ్ల ప్రొఫెషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు… రవి, నందు వంటి యాంకర్లూ ఉన్నా షైన్ కాలేకపోతున్నట్టు అనిపిస్తుంది…
యాంకరింగులో చెప్పుకోదగిన మరో పేరు అనసూయ… కానీ సినిమా చాన్సులు పెరిగి, పూర్తిగా బుల్లితెరను వదిలేసింది… సహజం… కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ జడ్జి శేఖర్ మాస్టర్‌తో కలిసి…!!
Share this Article