అరె పడితె లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోతొస్తది
అరె ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
…. ఆమధ్య మ్యాడ్ అనే సినిమాలో ఈ పాట తెలుసు కదా… బాగా పాపులరైంది… ప్రత్యేకించి యువత నోళ్లల్లో బాగా నానింది… ఎందుకంటే..? ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి… ఒక వార్త చదివాక ఇదే గుర్తొచ్చింది… ఓయో హోటళ్లు ఎంత బాగా పాపులరయ్యాయో, ఎందుకు ఫేమసయ్యాయో క్లారిటీ వస్తుంది కాబట్టి…
Ads
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? అది చత్తీస్‌గఢ్‌లోని వైశాలినగర్… అక్కడి ఎమ్మెల్యే పేరు రికేశ్ సేన్… ఇటీవల తన నియోజకవర్గ పరిధిలోని ఓ పార్కుకు వెళ్లాడు… ఎటు చూసినా పొదల చాటున, బెంచీల మీద అన్నీ యువజంటలే… ముచ్చట్లు, హగ్గులు, ముద్దులు, మురిపాలు… సరే, అదేమిటి..? ఏ పార్కు చూసినా ఇదే కథ కదా…
ఒరేయ్, మీరంతా ఏం చేస్తున్నార్రా ఇక్కడ..? అని ప్రశ్నించాడు ఆయన… అక్కడికి ఏమీ తెలియనట్టు…! ఓయో రూమ్స్ బంద్ చేశారండీ, అందుకే ఇక్కడ మాట్లాడుకోవడానికి వచ్చామని ఓ జంట బదులిచ్చింది… తరువాత మరో జంట దగ్గరకు వెళ్లాడు ఆయన…
ఇదే అడిగాడు, ఎవరు ఆ అమ్మాయి అని… ఈమె నా గరల్ ఫ్రెండ్, కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఇంతకుముందు ఓయో రూమ్స్ సౌకర్యంగా ఉండేవి… అవేమో బంద్ చేశారు, మరేం చేయాలండీ అని బదులిచ్చాడు ఆ యువకుడు…
అందరూ దాదాపు అదే జవాబు… ఒరేయ్, మీవల్ల పార్కుల్లోకి రావడానికి మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, ఛల్, ఖాళీ చేయండి పార్కును, మళ్లీ ఇటువైపు రావద్దు అని అక్కడి నుంచి తరిమేశాడు… సహజంగానే వాళ్లు తిట్టుకుంటూ వెళ్లిపోయారు… ఇది వార్త…
నిజమే… ప్రేమజంటలకు ‘అన్ని రకాల కార్యక్రమాలకు’ ఓయో రూమ్స్ ఎలా అడ్డాలు అయ్యాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం… రూమ్ బుక్ చేసుకోవడం, అన్ని ఏర్పాట్లతో వెళ్లడం, తరువాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోవడం… పట్టణాలు, నగరాల్లో చాటు దొరకదు కదా, వాళ్లందరికీ ఓయో ఓ చీప్, బెటర్ సౌకర్యం అయిపోయింది… అక్కడా పోలీసులకు మామూళ్లు మన్నూమశానం అట…
స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారికీ ఓయో మంచి అడ్డాలైపోయినట్టున్నయ్… ప్రైవసీ ఉంటుంది, ఎవడో చూస్తున్నాడనే భయం ఉండదు… ఫాఫం, ఆ ఎమ్మెల్యే ఏదో అందరినీ అలా ఆ పార్కు నుంచి అదిలించి పంపించాడు గానీ తనకు మాత్రం తెలియదా ఏం..? పార్కులకు వెళ్లాలనుకునే మహిళలు, పిల్లలకు కూడా తెలుసు… అందుకే పార్కులకు జంటపక్షులు తప్ప పెద్దగా ఎవరూ పోవడం లేదు, ఇందుకే..!!
ఇక్కడ మరో సమస్య ఏమిటంటే..? ఏదైనా కొత్త ప్లేసులకు టూర్లు వెళ్లినప్పుడు… ఓయో ద్వారా హోటళ్లు బుక్ చేసుకోవడానికి టూరిస్టులు పడే ఇబ్బంది… ఏది సంసారపక్షమో తెలియదు… ఏవి ప్రేమికుల అడ్డాలో తెలియవు… ఆ యాప్స్‌లో ఇచ్చే ఫోటోలు కూడా మిస్ లీడింగే చాలాసార్లు..!!
Share this Article