తెలంగాణ జానపదానికీ, యాసకు, ఆటకు, కంటెంటుకు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిరాకీ… ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు… ఐతే తెలంగాణతనాన్ని అరువు తెచ్చుకునే ప్రయాసలో కొందరు పిల్లిమొగ్గలేస్తున్నారు… సన్నబియ్యం అన్నంలో ఉడకని మెరిగల్లా పంటికింద కలుక్కుమంటున్నాయి…
భగవంత్ కేసరి రేపోమాపో రిలీజ్ కాబోతోంది కదా… బాలకృష్ణ హీరో… శ్రీలీల తన బిడ్డ పాత్ర… ఇద్దరికీ ఓ పాట… రాసిన అనంత శ్రీరామ్, పాడిన ఎస్పీ చరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నటించిన బాలకృష్ణ, శ్రీలీల, సంగీతం కూర్చిన థమన్… ఎవరికీ, ఎంత అరువు తెచ్చుకున్నా సరే ఆ తెలంగాణతనం అంటడం లేదు… అంటదు కూడా… ఆ యాసలో విరుపు, ఆ పదాలు అందరికీ అంతుపట్టవు, అలవడవు… అదీ బాగా కృతకంగా ధ్వనిస్తూ పంటి కింద రాళ్లలా నొప్పిస్తున్నయ్…
ఇందులో శ్రీలీలను వదిలేయండి, ఆమె కన్నడిగ… కానీ తెలుగును బాగానే మాట్లాడుతుంది, కానీ తెలంగాణ భాష మాట్లాడలేదు, తప్పుపట్టలేం… పైగా ఆమె నటి, జస్ట్, నటిస్తే చాలు కాబట్టి వోకే… బాలకృష్ణ బ్లడ్డు, బ్రీడు మొదటి నుంచీ తెలంగాణ పట్ల తేలికభావంతోనే ఉన్నాయి కాబట్టి, పైగా తను జస్ట్, యాక్ట్ చేసేవాడే కాబట్టి వోకే… పాడిన ఎస్పీ చరణ్‌కూ అంతగా తెలంగాణ పదాలు తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్, రాసిచ్చింది పాడితే చాలు కాబట్టి వోకే… సంగీత దర్శకుడికి తెలుగే సరిగ్గా తెలియదు, ఇక తెలంగాణ యాస ఏం తెలుస్తుంది… కాబట్టి వోకే…
Ads
కొంతలో కొంత దర్శకుడినీ తప్పుపట్టలేం, రచయిత రాసిచ్చింది ఎలా తెరపై ప్రజెంట్ చేయాలో మాత్రమే ఆలోచిస్తాడు తను… ఎటొచ్చీ ఈ పాటలో కృతక తెలంగాణ పదాల్ని పేర్చిన అనంత శ్రీరామ్‌దే తప్పు… తెలియకపోతే పూర్తిగా తెలుసుకుని రాయాలి, లేదంటే తన వల్ల కాదని వదిలేయాలి… మధ్యలో తెలంగాణ భాషను ఖూనీ చేయడం దేనికి..? తెలంగాణ పాటలు పర్‌ఫెక్ట్ తెలంగాణ పదాలతోనే రాసేవాళ్లు బోలెడు మంది ఉన్నారుగా…
సప్పుడు చెయ్యకుర్రి, మస్తు ఉరుకుతాంది వరకు వోకే… మా చిట్టి చిన్నారి, గమ్మున కూసోర్రి, పొట్టి పొన్నారి అనే పదాల దగ్గర అనంత శ్రీరామ్ తప్పులో కాలేశాడు… గమ్మున అనే పదం యాణ్నుంచి వచ్చింది బ్రో..? ఆ పాటలో అక్కడ ఏదో పదం ఇరకాలి, టైమ్‌కు తెలంగాణ పదం దొరకలేదు, అలవాటైన తన రొటీన్ పదాల్లో ఒకటి పెట్టేశాడు… ఈ చిన్నారి, పొన్నారి పదాలు ఎక్కడి నుంచి అరువు తెచ్చావు సోదరా..? ఔ మల్ల, గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా వరకు వోకే… వెంటనే తుళ్లి పలకవే నా తల్లి… అంటూ తప్పుగా తుళ్లిపడ్డాడు…
పత్తి పువ్వయితా నీకు రైకనియ్యనీకి వరకు వోకే… వెంటనే పట్టు పురుగైతా నీకు పావడివ్వనీకి దగ్గర బోల్తా… పావడా తెలంగాణపదం కాదు… ఒప్పుల కుప్పా, వయ్యారి భామల్ని తెలంగాణలో ఎక్కడ పలుకుతారో ఆ కలానికే తెలియాలి… డియర్ అనంతం,
Share this Article