ఎస్… జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించాల్సిన పనేమీ లేదు… నిజానికి విమర్శ అనేది లేకపోతేనే ప్రభుత్వానికి నష్టం… కాకపోతే అది నిజమైన విమర్శ అయి ఉండాలి, రాజకీయ దురుద్దేశాలతో కూడి ఉండకపోతే చాలు… అలాగే జగన్ క్రిస్టియన్ కాబట్టి, తన ప్రతి అడుగునూ హిందూ వ్యతిరేక కోణంలో చూడాల్సిన పనికూడా లేదు… హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే విమర్శించొచ్చు, విరుచుకుపడొచ్చు కానీ అబద్ధాల మీద ఆధారపడి విమర్శలు చేస్తే, ఆనక అభాసుపాలే… అదేసమయంలో…. ప్రచారకండూతిలో చంద్రబాబును మించి ఎన్నో మైళ్లదూరం ముందున్న జగన్ తన పబ్లిసిటీ ఖర్చును, తీరును ఓసారి సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది… ఒక తాజా ఉదాహరణ చెప్పుకుందాం… ఎవడో టీవీ వాడు ఈ వార్తను మొదలుపెట్టినట్టున్నాడు… అదేమిటంటే..? రాష్ట్రంలోని 11 ప్రధాన ఆలయాలను, ప్లస్ ఇతర గుళ్లను ప్రభుత్వ కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది అనేది ఆ వార్త సారాంశం… జగన్ ఎప్పుడు దొరుకుతాడా, తిట్టేద్దామా అని కాచుక్కూర్చునే బ్యాచ్ ఉంటుంది కదా, సోషల్ మీడియాలో ఎడాపెడా పోస్టులు పెట్టేయడం స్టార్ట్ చేసింది… ఇతర టీవీలు, సైట్లు కూడా… వేయి పడకలు సిద్ధం, చిన్న గుళ్లలో 25 చొప్పున, పెద్ద గుళ్లయితే 100, 200 చొప్పున కేర్ సెంటర్లు రెడీ అని వార్తల్ని దంచిపారేశాయి… ఓ ప్రభుత్వ ప్రకటన కూడా ఇలాగే కనిపించింది…
ఇది 16 నాటి ప్రభుత్వ ప్రకటనే… ఆల్ రెడీ 11 గుళ్లలో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేశాం, చిన్న గుళ్లలోనూ చేసేస్తాం అని చెబుతోంది… అంటే జనానికి అర్థమయ్యేది ఏమిటి..? ఇవి ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు కాబట్టి అందరికీ చికిత్సకు చాన్స్ ఉంటుంది అని…! మతం కోణంలో జగన్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూసే బ్యాచుకు కొబ్బరిచిప్ప దొరికింది… ఏం..? నీకు హిందూ గుళ్లే దొరికాయా నాయనా..? ఇతర మతకేంద్రాల్ని ఎందుకు వదిలేశావ్..? స్కూళ్లు, కాలేజీలు, ఇతరత్రా బోలెడు భవనాలు ఉండగా హిందూ గుళ్ల మీదే నీ కన్నుపడిందా..? ఇలా ప్రచారం స్టార్టయిపోయింది ఫేస్బుక్, వాట్సప్ వేదికల్లో…! బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాడు… నిజానికి వైసీపీ భక్తుల్లోనే కొందరికి ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించింది… ఏమిటి ఈ నిర్ణయం..? ఏమని డిఫెండ్ చేయాలి..? అనుకుని డైలమాలో పడ్డట్టుంది… ఈలోపు సోషల్ మీడియా బాగా నెగెటివ్‌గా రియాక్ట్ అయిపోయింది… తరువాత దేవాదాయ మంత్రి తెర మీదకు వచ్చాడు… కన్నా లక్ష్మినారాయణ ప్రకటన తప్పు, నిజాలు తెలియవు అంటూ ఆకులు పట్టుకోవడం స్టార్ట్ చేశాడు… ఇక ఈ ప్రకటన కనిపించింది…
Ads
Share this Article