.
నిన్నటి ఓ వార్త ఇంట్రస్టింగు… యూపీ ప్రభుత్వం ఐఏఎస్‌ల బదిలీలు చేసింది… సహజమే… అందులో ఒకాయన ఉన్నాడు… పేరు అమిత్ గుప్తా… ఆయన బదిలీ ఎందుకు ఆశ్చర్యం అనిపించిందీ అంటే… అసలు తను ఎన్నిసార్లు బదిలీ అయ్యాడో తనకే లెక్క తెలియదు కాబట్టి…
అంతేకాదు, ఈయనకు 15 సంవత్సరాల కాలంలో 14 బదిలీలు జరిగాయి… అన్నీ కలెక్టర్ పోస్టులే… ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా ఎక్కాడు… అంటే, ఎక్కడా సరిగ్గా పనిచేయడం లేదా..? అందుకే అటూ ఇటూ బదిలీలతో తంతున్నారా అంటే అదీ కాదు… 14 జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేయడం అంటే మాటలు కాదు… ఇంత ఫీల్డ్ సర్వీస్ ఉన్న మొట్టమొదటి ఐఏఎస్ కావచ్చు బహుశా…
Ads
సీఎం ఆఫీసులో ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేసిన చీఫ్ సెక్రెటరీ కేడర్ అధికారి… కీలక విభాగాల్లో కూడా పనిచేశాడు, ప్రభుత్వాలు అవకాశాలు ఇచ్చాయి… ఇప్పుడు బదిలీ కూడా ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా …
మరెందుకు ఇన్ని బదిలీలు…? అదే అనూహ్యం… ఆరేళ్లు, అయిదు ప్రయత్నాలతో సివిల్స్ క్రాక్ చేసిన ఈయనది 2000 బ్యాచ్… నేటివ్ మధ్యప్రదేశ్, గ్వాలియర్… ఈసీఈలో బీటెక్ చేశాడు… ఫస్ట్ పోస్టింగు 2001లో మీరట్, అసిస్టెంట్ కలెక్టర్‌గా…
ఇక తరువాత ఆగ్రా, లక్కో… 2005లో కలెక్టర్‌గా ఫస్ట్ కొలువు… హమీర్‌పూర్, లలిత్‌పూర్, కన్నౌజ్, జలౌన్, ఫిరోజాబాద్, ప్రతాప్‌గఢ్, మహరాజ్‌గంజ్, ఇటావా, బదౌన్, పిలిభిత్, బిజ్నోర్, శ్రావస్తి, లఖింపూర్ ఖేరీ, రాయ్ బరేలీ… ఈ అన్ని జిల్లాలూ తిరిగాడు…
లలిత్‌పూర్‌లో కలెక్టర్‌గా పనిచేసింది జస్ట్, 8 రోజులు మాత్రమే… ఎక్కువకాలం, అంటే రెండున్నర ఏళ్లు బదౌన్ కలెక్టర్ (డీఎం, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటారు కలెక్టర్‌ను యూపీలో)… కీలకమైన విభాగాలనూ లీడ్ చేశాడు… సాంకేతిక విద్య, గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, వైద్య విద్య ఎట్సెట్రా…
మరెందుకు ఈయనకు పదే పదే బదిలీలు..? అదే ఎవరికీ అర్థం కాదు… తన పనితీరు మీద పెద్దగా అసంతృప్తీ లేదు… ఐఏఎస్ బదిలీలు సహజమే గానీ మరీ ఇన్నిసార్లు, ఈ రీతిలోనా..?!
Share this Article