.
విజయ్ మాల్యాని మన నోటితోనే తిట్టించారు. ఇప్పుడు గౌతం అదానీ వంతు వచ్చింది.
అదానీ 2 వేల కోట్లు భారత ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చి ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు అని అమెరికా ఆరోపణ. అదానీ కంపనీల్లో తమ దేశీయులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అదానీని తద్వారా ఇండియా మార్కెట్ ని కూలదోచి, మన వాళ్ళతోనే అదానీని తిట్టిస్తారు.
Ads
అయితే వాళ్ళ చేతులకి ఏమీ అంటుకోదు, మన దగ్గర అదానీ మీద, టాటాల మీద, బిర్లాల మీద ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కుక్కకి చెడ్డది అని పేరు పెడితే చాలు, జనాలే రాళ్ళు వేసి చంపుతారు అంటాడు ఒక రోమన్ తత్వవేత్త.
అదానీ గురించి తర్వాత పోస్ట్ లో చూద్దాం. విజయ్ మాల్యాని ఎలా నాశనం చేశారో ఒకసారి చూస్తే …!
యునైటెడ్ స్పిరిట్స్ అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆల్కహాలిక్ బీవరేజెస్ కంపనీ. బెంగుళూరులోని విట్టల్ మాల్యా రోడ్ లో విజయ్ మాల్యా టవర్స్ లో ఒక అంతస్థులో ఉంటుంది దాని హెడ్ క్వార్టర్స్.
దానికి గతంలో విజయ్ మాల్యా చైర్మన్ గా పనిచేశాడు. ప్రస్తుతం యునైటెడ్ బీవరేజ్ కి అతనే చైర్మన్. నాకు తెలిసి ఇండియన్ మార్కెట్ లో ఇప్పటికీ 40% బ్రీవింగ్ అతని కంపనీలదే. కింగ్ ఫిషర్ లాంటి బీర్లు, ఫేమస్ లిక్కర్ బ్రాండ్స్ 79 యునైటెడ్ బ్రీవరీస్ వారే తయారు చేస్తారు, అవి ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లోని 150 దేశాలకి పైగా అమ్ముడుపోతాయి. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకి ఎగుమతి అయ్యేవాటిల్లో అత్యంత నాణ్యమైనవి కింగ్ ఫిషర్ బీర్లే. వీటి అన్నిటికి అధిపతి విజయ్ మాల్యా గారు,
2007 ప్రాంతంలో మన దేశంలో 70% వరకు ఆల్కహాలిక్ వ్యాపారం మార్కెట్ షేర్ అతని ఆధీనంలోనే ఉండేది. బీర్లలో కింగ్ ఫిషర్ లైట్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ఆ రోజుల్లో నంబర్ వన్. నూతనంగా ఆలోచించి స్వదేశీ ఎయిర్ లైన్స్ ఉండాలి అనుకొని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించాడు. నాలుగు విమానాలతోనే ప్రారంభించాడు బొంబాయి నుంచి ఢిల్లీకి.
ఆ తర్వాత చిన్నగా విస్తరించుకుంటూ ఇంటర్నేషనల్ కింగ్ ఫిషర్ విమాన సేవలని కూడా ప్రారంభించాడు. ఒక అమెరికన్ వ్యాపారవేత్త దానిలో ప్రయాణించి ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఉన్న ఎయిర్ లైన్స్ నా జీవితంలో చూడలేదు, ఇది ఇండియన్ ఎయిర్ లైన్స్ అని నాకు తెలియదు, చాలా అద్భుతంగా ఉంది కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అని చెప్పటం నాకు ఇంకా గుర్తు.
2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన ఓడలు బండ్లు అయ్యాయి, బండ్లు ఓడలు అయ్యాయి (చైనా సూపర్ పవర్ అయ్యింది అప్పుడే). విజయ్ మాల్యా గారి నూతన ఆలోచనా విధానం వలన అంత పెద్దగా ఏమీ నష్టపోలేదు కానీ ప్రపంచ విమాన రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి,
విదేశీ శక్తుల చూపులు ఇండియా వైపు పడ్డాయి. ఇతిహాద్ అనే అరబ్బు విమాన సంస్థ మరియూ ఇతరులకి జరిగిన పోటీలో ఇంకా ఆర్ధిక మాంధ్య ఛాయలు వలన, ఎయిర్ పోర్ట్స్ ల్లో పెంచిన ట్యాక్స్ వలన, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగటం వలన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కొంత నష్టాల్లోకి పోయింది,
నాకు తెలిసి 6000 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు, అది వడ్డీతో 9000 కోట్లు అయ్యిందో లేక ఖచ్చితంగా ఎంత, ఎలా అప్పు తీసుకున్నాడో అతని లాయర్లకి, ఆడిటర్ల కి బ్యాంకులకి మాత్రమే తెలుసు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వెనక జరిగిన కుట్రలు తెలియాలి అంటే, ఆ రోజుల్లో మేము బార్ కి వెళ్ళి 4 కింగ్ ఫిషర్ బీర్లు తెమ్మని అంటే కింగ్ ఫిషర్ బీర్లు లేవు సార్, బడ్ వైజర్, కరోనా లైట్ ఉంది అన్నాడు. అవి అన్నీ పాశ్చాత్య బీర్లు. బయట దేశాల్లో తాగేవాళ్ళు అక్కడి వాతావరణానికి అనువుగా చాలా మైల్డ్ గా ఉంటై.
వాళ్ళు ప్రతిరోజూ లేదా వారం మనం మంచినీళ్ళు తాగేటట్లు వాళ్ళు బీర్లు తాగుతారు. అవి ఎందుకు మన దేశ మార్కెట్ లోకి వచ్చాయో నాకు తెలియదు, ఎలా వచ్చాయో నాకు తెలియదు. మన బీర్లు మాయమయ్యి పాశ్చాత్య బీర్లు భారత మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి.
మామూలు లిక్కర్ షాప్ వాళ్ళే కోటానుకోట్లు సంపాదిస్తుంటే 70% ఇండియన్ మార్కెట్ లో ఆల్కహాల్ ని తయారు చేసే విజయ్ మాల్యా గారు పాపం ఎందుకు బ్రిటన్ వెళ్ళాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆ తర్వాత 40% మాత్రమే మార్కెట్ ని ఏలటం, మిగతా 60% లో ఉచ్చ కంటే హీనంగా ఉండే పాశ్చాత్య లోక్వాలిటీ ఫారెన్ బీర్లు, బ్రాండ్స్ రావటం ఏందో ఎంత ఆలోచించినా నాకు దాని వెనక ఏమి జరిగిందో తెలియదు.
అమెరికాలో డెట్రాయిట్ నగరాన్ని మోటర్స్ నగరం అంటారు. ఎక్కువ కార్లు తయారు చేసే కంపనీస్ అక్కడ ఉంటై. ముఖ్యంగా జనరల్ మోటర్స్, అమెరికన్ బ్రాండ్స్ ఫోర్డ్స్ మొదలగునవి ఉంటై. అయితే 2008 లో వచ్చిన ఆర్ధిక మాంద్యం వలన దెబ్బతింటే అక్కడి ప్రభుత్వం జపాన్ టయోటా కార్లని ఎదుర్కోవాలన్నా, కొరియా కియా మోటర్స్ ని, హ్యాండయ్ ని ఎదుర్కోవాలన్నా స్వదేశీ వాటిని ప్రోత్సహించాలని కొన్ని మిలియన్స్, బిలియన్స్ సహాయం చేశారు. బ్రోతల్ కంపనీస్ నష్టాల్లో ఉంటే వాటికి కూడా కొంత సహాయం చేశారు అక్కడ.
మన దగ్గర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా పాశ్చ్యాత్య కియా మోటార్స్, అమెజాన్ లాంటివి వస్తుంటే అలాంటి వాళ్ళకి వేల కోట్ల భూములు, మిగతా సదుపాయాలు కల్పించటం మనం చూస్తూనే ఉన్నాం. మరి విజయ్ మాల్యా సొంత వాడు అవటం అతను చేసిన తప్పా..?
స్వదేశీ బీర్లని క్వాలిటీతో ప్రపంచం అంతా విస్తరింప చేయటం అతను చేసిన తప్పా..? అమెరికా, బ్రిటన్ అమ్మా మొగుడు లాంటి అత్యాధునిక ఇండియన్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ స్థాపించటం అతను చేసిన తప్పా..? అన్నిటికి మించి నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకి సహాయం చేయటం అతని తప్పా..?
బ్యాంకుల దగ్గర తీసుకున్న ఎమౌంట్ ఖచ్చితంగా అతను కట్టాల్సిందే; కానీ దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ఉంటే ఇప్పుడు భారతీయ బ్రాండ్ లక్షల కోట్లు సంపాదించి ఉండేది మరియూ ప్రపంచంలో అత్యాధునికమైన విమాన సంస్థల్లో మన కింగ్ ఫిషర్ ఉండేది.
ప్రస్తుతం కింగ్ ఫిషరే కాదు చాలా దేశీయ విమాన సంస్థలు మూసి వేయాల్సి వచ్చింది. ఆ స్థానంలో విదేశీ సంస్థలు ప్రవేశించాయి.
విజయ్ మాల్యా గారి తండ్రి విట్టల్ మాల్యా గారు కూడా పెద్ద వ్యాపార వేత్త. బెంగుళూరులో విట్టల్ మాల్యా రోడ్, UB సిటీ మాల్, UB టవర్స్, ఇంకా యునైటెడ్ బ్రీవరీస్ అన్నీ వాళ్ళవే. కలకత్తాలోని మంచి కాలేజ్ లో చదువుకున్నాడు విజయ్ మాల్యా. నాణ్యతకి మొదటి స్థానం ఇచ్చే మనిషి. మర్డర్లు చేయలేదు, మాన భంగాలు చేయలేదు. నాకు తెలిసిన విజయ్ మాల్యా దేశీయ క్వాలిటీ దేశీయ ప్రొడక్ట్స్ ని మాత్రమే తయారు చేశాడు.
అతని మీద కేసుల విషయంలో నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. అవి కోర్టుల్లో ఉన్నై… కానీ విదేశీయుల కుట్రల్లో మనం కూడా ఇరుక్కుపోయి దొంగ మల్లయ్య అని పేపర్లు, TV లు హెడ్డింగ్స్ పెడుతుంటే మనస్సుకి చాలా బాధ అనిపించింది, మన కంటిని మనమే పొడుచు కుంటున్నామన్న సోయి కొంచెమైనా ఉందా అనిపిస్తుంది.
ఏమైయితేనేం విజయ్ మాల్యాని విజయవంతంగా తొక్కేశారు. మన క్వాలిటీ బీర్ల స్థానంలో ఎందుకూ పనికి రాని ఫారిన్ బీర్లు, ప్రధానంగా అమెరికన్ బీర్లు ఇప్పుడు ప్రతి లిక్కర్ షాప్ లో అమ్ముడుపోతున్నై. అవే ఉంటున్నై కాబట్టి చచ్చినట్లు అవే తాగాలి. మన నాణ్యమైన ఎయిర్ లైన్స్ నాశనం అయ్యింది. కొందరు విజయ్ మాల్యా మీద అనునిత్యం ఏదో రకంగా ఏడుస్తూనే ఉంటారు.
ఇప్పుడు గౌతం అదానీ వంతు వచ్చింది. దీనమ్మా జీవితం, 2 వేల కోట్లు అంటే – కొండాపూర్ లో కుక్కని కొట్టినా వస్తై కదరా అయ్యా …! అయినా, కొట్టండ్రా డప్పులు, తిట్టండ్రా అదానీని …!
గౌతం అదానీ గారు 2 వేల కోట్లు లంచం ఇచ్చారు అని ఆరోపణ చేసి భారత మార్కెట్ కి 5 నుంచి 10 లక్షల కోట్ల నష్టం చేశారు. అది అంతా సామాన్య ప్రజల డబ్బే. భవిష్యత్ లో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ రాకుండా ఇంకో 50 లక్షల కోట్ల నష్టం. అయినా పర్వాలేదు, మనం ఒకరిమీద పడి ఏడ్వాలి అంటే గౌతం అదానీని తిట్టాల్సిందే, విజయ్ మాల్యాని తిట్టాల్సిందే…! …… జగన్నాథ్ గౌడ్ వ్యక్తిగత అభిప్రాయం
Share this Article