Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాజోల్ మీదొట్టు… రామోజీ ఫిలిమ్ సిటీ దెయ్యాలన్నీ పారిపోయాయ్..!!

June 23, 2025 by M S R

.

మనం మొన్న అపర ఆధునిక సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి భగాళాముఖి పూజలు, దశమహావిద్య రహస్య పూజలు, రాజశ్యామల యాగాలు రామోజీ ఫిలిమ్ సిటీలో దయ్యాలు అని ఓ స్టోరీ చెప్పుకున్నాం కదా… గుర్తుందా..?

ఏమీ లేదు… అక్కడ చాలామంది నెగెటివ్ వైబ్స్‌ ఫీలవుతున్నారు కదా… మొన్నటికి మొన్న బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కాజోల్ కూడా ఓ అనుభవం చెప్పింది కదా… ఏమనీ అంటే..?

Ads

‘‘మస్తు నెగెటివ్ వైబ్స్ ఫీలయ్యాను, దేవుడా నన్ను రక్షించు అని వేడుకున్నాను ఈ ఫిలిమ్ సిటీలో… నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తే చాలు అని ప్రార్థించాను’’ అని ఓపెన్‌గానే భయంభయంగా చెప్పింది… దేశంలోని ప్రతి మీడియా కవర్ చేసింది…

అవును, గతంలోనూ చాలామందికి ఆ నెగెటివ్ వైబ్స్ ఉన్నాయి అని కదా మనమూ రాసింది… అబ్బే, ఆ ఫిలిమ్ సిటీ, ఆ ఈనాడు, ఈ వ్యవస్థలేవీ దేవుడిని, దెయ్యాలను నమ్మవు  అని కదా చెప్పుకుంది, మరెలా కాజోల్ వంటి నటి కామెంట్స్‌ను కౌంటర్ చేస్తారు అని కదాని సందేహించింది…

ఫాఫం, ఏ వేణుస్వామితోనే ఏ భగాలాముఖి లేదా ఏ రాజశ్యామల యాగమో చేయించొచ్చు కదాని చెప్పింది… చివరాఖరుకు సదరు ఫిలిమ్ సిటీ స్పందించింది… ఇదిలా కాదులే, ఆ నటితోనే కౌంటర్ ఇప్పిస్తే బెటర్ అనుకుంది…

ఖర్చవుద్ది… పర్లేదు.,. రామోజీ ఫిలిమ్ సిటీకి అది పెద్ద ఇష్యూ కాదు కదా… పైగా అదేదో సినిమాలో నటిస్తుంది కదా, ఆ నిర్మాత ద్వారా కొట్టినట్టున్నారు… దెబ్బకు కాజోల్ దిగివచ్చింది… పూజలకు దెయ్యాలు, డబ్బులకు తారలు దిగిరావడం పెద్ద విశేషం కాదు కదా…

https://www.eenadu.net/telugu-news/movies/actress-kajol-clarify-about-remarks-on-ramoji-film-city/0210/125112567?fbclid=IwY2xjawLGSldleHRuA2FlbQIxMQBicmlkETFkOHlxRUJ0VjVvTWgwd2VqAR5dCN3jEvYHws6X1wUctJKqfUM7tiWvia0VcmrpdU1hyN6iLlbHylPknmrWbQ_aem_wLXQbDGlhpZJAFhsC4Y9UQ

గబగబా లెంపలేసుకుంది… ‘‘అబ్బే, నేనన్నది  నేను నటిస్తున్న కొత్త చిత్రం ‘మా’ ప్రమోషన్ కోసం, పబ్లిసిటీ కోసం ఆ వ్యాఖ్యలు చేశాను, అక్కడ చాలాసార్లు ఉన్నాను, సినిమా మేకింగుకు సూపర్ అడ్డా అది… పర్యాటకులకు అది గొప్ప స్థానము, ఫ్యామిలీతో గడపడానికి అదొక అద్భుత గమ్యము’’ అని ఆమెతో ఓ స్టేట్‌మెంట్ ఇప్పించారు…

అంతేకదా… నొక్కాల్సినచోట నొక్కితే కాజోల్ ఏం ఖర్మ..? ఆమెను మించిన దెయ్యాలూ దారికొస్తాయి… వచ్చాయి… ఇండస్ట్రీలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సినిమా ప్రపంచం, ప్రత్యేకించి రామోజీ ఫిలిమ్ సిటీ వంటి పతార (పలుకుబడి) ఉన్న వ్యవస్థలు ఊరుకుంటాయా ఏం..?

సో, ఎట్ లాస్ట్, అవన్నీ సినిమా ప్రమోషన్ కోసం చేసిన వ్యాఖ్యలుగా ముద్ర వేయబడ్డాయి… దెబ్బకు ఫిలిమ్ సిటీలో దెయ్యాలన్నీ పారిపోయి ఉంటాయి కూడా.,. అంతెందుకు..? ఇదే కాజోల్ అక్కడే ఎన్నిరోజులైనా భయం లేకుండా గడపగలదు తెలుసా..? ఫిలిమ్ సిటీ దెయ్యాల మీద ఒట్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ ఢిల్లీకి పోయేది లేదూ… పోయినా పలకరించే గొంతూ లేదు…
  • రీల్ హీరోలు కాదురా… ఇదుగో వీళ్లు రియల్ హీరోలు… మార్గదర్శులు…
  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…
  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions