.
ఇండి కూటమి… (అది అదే పేరుతో ఇంకా ఉందో లేదో తెలియదు)… తన యాంటీ బీజేపీ పోకడలతో వ్యవస్థలపై దాడిచేస్తోంది… వరుస వైఫల్యాల ఫ్రస్ట్రేషన్ కావచ్చు, నిజతత్వమో అది కావచ్చు… ప్రత్యేకించి రాహుల్ గాంధీ రాజకీయ ధోరణి దేశహితానికి మాత్రం మంచిది కాదు…
సర్… వద్దేవద్దని స్టాలిన్, మమత ఎట్సెట్రా బ్యాచ్ వీరంగాలు… బీహార్‌లో లొల్లి చేసినా, అది సుప్రీం సరైన వైఖరితో వీగిపోయింది… ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సర్ సాగుతోంది… జరగాల్సిందే అంటోంది సుప్రీం… లక్షల కొద్దీ ఫేక్ వోటర్లు బయటపడుతున్నారు… గుడ్ టు నేషన్…
Ads
ఈవీఎంలపై ఏడ్చీ ఏడ్చీ అలిసిపోయి, ఇక ఇప్పుడు వోట్ చోరీ అని తీసుకున్నాడు… ఏవేవో బాంబులు అన్నాడు… అవి మరీ తోకపటాకుల్లాగా కూడా పేలలేదు… సరికదా… బెంగాల్‌లో ఈ కూటమి స్నేహితురాలు నమ్మకం పెట్టుకున్న బంగ్లా అక్రమ వలసదారులు, రోహింగ్యాల వోట్లకే ఉల్టా గండిపడుతోంది…
ఎన్నికల సంఘం మీద విమర్శలతో… దాన్ని డిమోరల్ చేయడానికి మరో ప్రయత్నం… తప్పులున్నచోట విమర్శ మళ్లీ మాట్లాడకుండా బలంగా ఉండాలి… కానీ ఏమైంది..? ఈవీఎంల దగ్గర నుంచి వోట్ చోరీ దాకా నిరూపించండి అని సవాల్ విసిరింది ఎన్నికల సంఘం… చివరికి అదీ ఓ విఫలాస్త్రంగా మిగిలింది… ఆ అక్కసుతో ఈసీ బీజేపీ అనుబంధ విభాగంగా మారిందనే పేలవ విమర్శకు దిగింది ఇండి కూటమి…
గవర్నర్లకు, రాష్ట్రపతికి కూడా బిల్లుల ఆమోదానికి గడువు ఉండాలని గగ్గోలు పెట్టారు, సుప్రీంకోర్టునూ లాగారు… చివరకు ఏమైంది..? గడువు రాజ్యాంగంలోనే లేదు, మేమెలా కాలపరిమితి పెట్టగలం అని సుప్రీమే వెనక్కి తగ్గింది… ఇలా బోలెడు.., ప్రతిపక్షం బలంగా ఉండాలి కానీ మరీ ఇలా సిస్టమ్స్ మీద దాడి కాదు…
విదేశాల్లోకి వెళ్లి దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు కూడా జాతివ్యతిరేకమే… తాజాగా తమిళనాడులోని ఓ హైకోర్టు జడ్జి మీద పడింది ఇండి కూటమి… జస్టిస్ బీఆర్ స్వామినాథన్ చేసిన తప్పేమీ లేదు, తన మీద అవినీతి ఆరోపణల్లేవు, ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికినట్టు వందల కోట్ల నోట్ల కట్టలూ లేవు… సుప్రీమే తప్పుపడుతున్నా సరే ఆయన్ని అభిశంసించిందీ లేదు… ప్రతిపక్షం కూడా వదిలేసినట్టుంది…

దాదాపు 120 మంది ఎంపీలు, నాన్-బీజేపీ ఎంపీలు అభిశంసన తీర్మానానికై లోకసభ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చారు… చట్టప్రకారం వ్యవహరించి, సరైన తీర్పు ఇవ్వడమే ఆ జస్టిస్ చేసిన తప్పు… ఒక జడ్జి తీర్పుపై అభిశంసనకు దిగడం బహుశా ప్రపంచంలోనే తొలిసారి కావచ్చు…

ఇది అంతిమంగా మేం హిందూ వ్యతిరేక పార్టీలం, మేం న్యాయవ్యవస్థను కూడా డిమోరల్ చేయగలం అని చెప్పడం… జడ్జిలు కూడా సరైన తీర్పులు చెప్పడానికి భయపడేలా వెనక్కి నెట్టడం ఇది… ఈ జస్టిస్ చెప్పిన తీర్పు, ఆ వివాదం పూర్వాపరాలపై ‘ముచ్చట’ కథనం దిగువన…
నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!
బీజేపీ వేరు… హిందూ ధర్మం వేరు… ఈ ధర్మంపై బీజేపీకి ఏమీ పేటెంట్స్ లేవు… కాకపోతే యాంటీ బీజేపీ అనే పేరుతో ఈ సోకాల్డ్ హిందూ వ్యతిరేక పార్టీలు పదే పదే హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నాయి… అనివార్యంగా హిందువుల్ని బీజేపీ వైపు నెట్టేస్తున్నాయి… ఇప్పుడిక ఈ పార్టీలు ఇక న్యాయవ్యవస్థ మీద పడ్డాయి… ఈ ధోరణి మీద సమాజంలో కూడా జరగాల్సినంత చర్చ జరగడం లేదు… అది మరో ట్రాజెడీ..!!
ప్రస్తుత ఇండికూటమి అభిశంసన ప్రయత్నం ఏమీ ఫలించదు... కానీ మేమెప్పుడూ హిందూ ధర్మానికి వ్యతిరేకులమే అని జాతికి ఈ పార్టీలు స్పష్టతనిస్తున్నాయి..!!
Share this Article