కాంతార సీజన్ ముగిసింది… అక్కడక్కడ థియేటర్లలో మార్నింగ్ షోలు మాత్రమే పడుతున్నయ్… ఇప్పుడు కంబాలా సీజన్ స్టార్టయింది… తమిళనాడులోని జల్లికట్టులాగా కర్నాటకలో రైతులు ఈ కంబాలా పోటీల్ని కాపాడుకుంటున్నారు… కేరళలో సంప్రదాయికంగా వల్లం కలి అని పిలిచే స్నేక్ బోట్ పోటీలను కూడా వాళ్లు కల్చర్‌లో భాగంగా పదిలంగా రక్షించుకుంటున్నారు… మరి తెలుగు రాష్ట్రాలు అనగానే గుర్తొచ్చేది ఏముంది..?
సరే, ఇక ఆ చర్చలోకి వెళ్తే ఇప్పట్లో బయటికి రాలేం… కానీ కంబాలా గురించి కాస్త చెప్పుకోవాలి… గత సంవత్సరం ఇదే సీజన్‌లో మనం కంబాలా పోటీల గురించి పదే పదే రాసుకోవాల్సి వచ్చింది, చెప్పుకోవాల్సి వచ్చింది… ఒక పోటీలో ఒక పోటీదారు ఏకంగా పరుగుల వీరుడు, ఒలింపిక్ లెజెండ్ ఉసేన్ బోల్ట్ రన్ రికార్డును కూడా బ్రేక్ చేశాడని వార్త… అయితే కంబాలాలో సరిగ్గా టైమ్‌ను లెక్కించే విధానం లేదంటూ ఆ ఘనతను కూడా కొందరు తోసిపుచ్చారు…
Ads
ఈసారి కంబాలాకు మళ్లీ పాపులారిటీ వచ్చిందంటే కారణం మాత్రం కాంతార… అందులో కథానాయకుడు కంబాలా ప్లేయర్… ఈ కంబాలా కూడా కర్నాటక మొత్తంలో కనిపించదు… కర్నాటక కోస్తా ప్రాంతాల్లోనే అధికం… కర్నాటక టూరిజం డిపార్ట్‌మెంట్ డిసెంబరు కంబాలా పోటీల షెడ్యూల్ అధికారికంగా రిలీజ్ చేసి, ఎక్కువ మంది టూరిస్టులను రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది…
పంటల కోతలు పూర్తయ్యాక, శీతాకాలం రైతులు పాల్గొని, సెలబ్రేట్ చేసుకునే పండుగలు ఇవి… రెండు సమాంతరంగా ట్రాక్స్ ఉంటయ్… బురద, నీళ్లు… ప్రతి పోటీదారు రెండు దున్నపోతులతో పోటీలో పార్టిసిపేట్ చేయాలి… తను జాకీ అన్నమాట… ట్రాక్‌లో వాటిని వేగంగా పరుగెత్తించడం, కంట్రోల్ చేసుకోవడం తన పని… రెండు దున్నపోతులనూ కంట్రోల్ చేయడానికి ఓ తాడు ఉంటుంది తన చేతిలో అంతే… ప్రతి నవంబరు నుంచి మార్చి దాకా పలు ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తుంటారు…
ఈ పోటీలకు కాస్త ఆధ్యాత్మికతను కూడా జోడిస్తారు… ప్రతిచోటా ఈ పండుగల్ని, ఈ పోటీల్ని శివుడి అవతారమైన కద్రి మంజునాథుడికి అంకితం చేస్తారు… కన్నడ కోస్తా రైతాంగానికి కంబాలా అతి పెద్ద ఆటవిడుపు… ఇన్నిరకాల జాతరలు, ఉత్సవాలు, సినిమాలు, నాటకాలను తట్టుకుని కంబాలా ఇంకా తన ఉనికిని చాటుకుంటున్న తీరు విశేషమే… ఈ పోటీలు కమర్షియలైజ్ కాలేదు… చిన్న స్థాయిల్లో జరిగే కంబాలా పోటీల్లో విన్నర్స్‌కు ఓ కొబ్బరికాయను, చిన్న చిన్న కానుకలను ప్రైజ్ మనీగా ఇచ్చిన సందర్భాలూ బోలెడు…
ఈ ఆట లేదా ఈ పోటీ పుట్టుక వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ… Karnataka.com ప్రకారం… వీటిని హొయసల రాజులు స్టార్ట్ చేశారు… ఈ పోటీల్లో దృఢంగా నిలిచి, గట్టిగా పరుగు తీయగల, స్టామినా ఉన్న దున్నపోతులను అవసరమైతే యుద్ధరంగంలో కూడా వాడుకోవాలనేది వాళ్ల ప్లాన్… అలాగే రాజ కుటుంబాలకు క్రీడావినోదం కూడా… ఆ రాజుల నుంచి ఫ్యూడల్ దొరల చేతుల్లో పడి… ఇప్పుడు సగటు రైతులు నిర్వహించుకుంటున్నారు… ఇదీ ఈ సీజన్‌కు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్…
Share this Article