Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ ఇప్పుడిక పూర్తి ఒంటరి సన్యాసి… ఆ ఒక్క పేగుబంధమూ తెగిపోయింది…

December 30, 2022 by M S R

తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ప్రధాని తన అధికార విధుల్లో మళ్లీ మునిగిపోయాడు అనే వార్త మరీ పెద్దగా కనెక్ట్ కాలేదు… ఆయన ఎప్పుడో వదిలేసిన భార్య జశోదాబెన్ తన అత్తగారి అంత్యక్రియల సందర్భంగా కనిపించిందా లేదా అనే అంశమూ పెద్దగా ఆసక్తిని కలిగించలేదు… అన్న, తమ్ముడు ఉండగా తనెందుకు చితికి నిప్పు పెట్టాడు అనేది కూడా ఆలోచనల్లోకి రాలేదు…

కానీ ఆమె మరణించిన వెంటనే ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లిపోవడం.., అత్యంత నిరాడంబరంగా, నిశ్చల చిత్తంతో, నిజంగా ఓ సన్యాసి తరహాలోనే, నిర్వేదంగానే ఆమె అంత్యక్రియల్ని జరిపించిన తీరు కనెక్టయింది…

ఆమె మృతదేహాన్ని అలాగే ఉంచితే ఇక బీజేపీ శ్రేణులు, నాయకులు గుజరాత్‌కు పయనమవుతారు… సందడి… అనవసర కోలాహలం… ప్లాస్టిక్ పరామర్శలు… అందుకని ఎవరూ గుజరాత్ రావద్దని, రాకపోవడమే ఆమెకు నిజమైన నివాళి అని ప్రకటించింది ఆ కుటుంబం… నిజం… ఓ మధ్యతరగతి కుటుంబీకురాలు మరణిస్తే ఎలా అంత్యక్రియలు జరుగుతాయో అలాగే… జస్ట్, ఓ సామాన్యురాలిగానే నిష్క్రమించింది ఆమె…

Ads

ప్రధాని ఓ తన తల్లి మరణ సమాచారాన్ని కూడా భిన్నంగా దేశప్రజలతో షేర్ చేసుకున్నాడు… ‘‘వందేళ్ల అమ్మ జీవితం ఇక దేవుడి పాదాల దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది… నిస్వార్థం, విలువలు, కర్మయోగం అనే త్రిమూర్తులను చూసేవాడిని అమ్మలో…’’ అన్నట్టుగా అందులో నివాళి అర్పించాడు…

modi

ఇక్కడ గమనించింది మోడీలోని ఓ విశిష్ట గుణాన్ని… మాజీ ప్రధాని వాజపేయి మరణించినప్పుడు, ఆ భౌతికదేహం వెంట, వీథుల్లో కిలోమీటర్ల కొద్దీ మౌనంగా నడుచుకుంటూ అంత్యక్రియల స్థలం దాకా వెళ్లాడు మోడీ… ఇప్పుడు అమ్మ మరణం… మొహంలో అదే నిర్వేదం… నిజానికి ఈ లోకంలో తనకు ఇప్పటిదాకా మిగిలి ఉన్న బంధం అమ్మ మాత్రమే… ఇప్పుడామె కూడా వెళ్లిపోయింది… అక్షరాలా ప్రధాని మోడీ ఇప్పుడు వ్యక్తిగా ఒంటరి…

చిన్నతనంలోనే సన్యాసిని అని ప్రకటించుకుని వైవాహిక బంధానికి స్వస్తి పలికాడు… సమాజసేవ తప్ప తనకు ఇతరత్రా బంధాలు ఏమీ లేవని నిష్కర్షగా చెప్పడమే కాదు… తను ఏ హోదాలో ఉన్నా సరే తన కుటుంబాన్ని తన అధికారానికి, తనకు దూరంగా ఉంచాడు… ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎప్పుడూ ఆ కుటుంబసభ్యుల మొహాలు కనిపించలేదు… వాళ్ల నుంచి చిన్న పైరవీ కూడా ఉండేది కాదు… ఎవరి బతుకు వాళ్లది… ఒక్కసారి మాత్రం ప్రధాని నివాసంలోకి అమ్మ వచ్చి కొన్నాళ్లు గడిపినట్టుంది… అంతే…

మోడీ తమ్ముడు పంకజ్ మోడీ గాంధీనగర్ దగ్గర రాయ్‌సన్‌లో ఉంటాడు… మోడీ తల్లి కూడా తనతోనే ఉండేది… ఎప్పుడైనా మోడీ వెళ్లి అక్కడే ఆమెతో గడిపేవాడు… ఎన్నిరకాల బంధాల్ని తెంచుకున్నా సరే, అమ్మ అనే పేగుబంధాన్ని ఎంతటి యోగి అయినా తెంచుకోవడం కష్టం… అమ్మ తరువాతే అన్నీ… అదొక్కటే మోడీకి ఇన్నాళ్లు తన కుటుంబంతో ఉన్న లింకు… ఇప్పుడదీ తెగిపోయింది… అందుకే మోడీ ఇప్పుడు నిజమైన ఒంటరి సన్యాసి…

తన రాజకీయ కార్యాచరణతో చాలామందికి చాలా విభేదాలు ఉండవచ్చుగాక… వ్యక్తిగా తనను వంక పెట్టేదేమీ ఉండదు… ఏవో తన డ్రెస్సులు, ఫోటోలపై వెటకారాలు తప్ప…! అవినీతి లేదు… ఆస్తుల కక్కుర్తి లేదు… కొందరు రాష్ట్ర స్థాయి నేతలతో పోల్చి చూడండి… ఏ దేశం వెళ్లినా సాత్వికాహారమే… కొన్నిసార్లు ఉపవాసం… క్రమం తప్పని యోగాభ్యాసం… మెచ్చుకునేచోట నిజంగానే మెచ్చుకోవాలి… ఈరోజుల్లో క్షుద్ర రాజకీయ నాయకులు సమాజానికి ఎంతటి శాపమో చూస్తున్నాం… పూర్తి కంట్రాస్టుగా బతికే మోడీని ఈ కోణంలో మెచ్చుకోవాలి… సన్యాసిగా మారిన స్వయంసేవకుడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions