మోడీ కెరీర్ మొత్తం ఏమైనా గానీ, ఎలా సర్ఫ్ తెల్లదనంతో ఉన్నట్టు చెప్పబడినా సరే గానీ…. వేక్సిన్ల దందా మీద తన అడుగులు మాత్రం అడుగడుగునా సందేహాస్పదమే…. ఈ విషయంలో ఈ దేశప్రజలకు చిన్న క్లారిటీ కూడా లేదు, ఈ మహా అడ్డగోలు ధరలేమిటో, ఈ మహా మహా అడ్డగోలు నిర్ణయాలేమిటో ఎవరికీ అర్థం కావు… మంచినీళ్ల సీసా టీకా వేలకువేల కోట్లు ఎలా సంపాదిస్తున్నదో…. ఇంకా ఇంకా బూస్టర్ డోసులు, ముక్కు టీకాలు, పోరగాళ్ల టీకాల పేరిట దందాను మరింత వ్యాప్తి చేసి, లక్షల కోట్ల ఆశల్లో ఎలా మునిగిపోతున్నదో మన బుర్రలకు అర్థం కాదు… అంతా ఆ రాజసన్యాసి దయ, మన ప్రాప్తం…
ఫస్ట్ డోస్ ఎందరికి, సెకండ్ డోస్ ఎందరికి పూర్తయ్యింది… వాటి ధరలెంత..? సైడ్ ఎఫెక్ట్స్ మీద పరిశోధనల్ని ఎందుకు విస్మరించాం అనేది వదిలేస్తే… జనం ఖర్మ, వాళ్లే అనుభవిస్తారు అనుకున్నా సరే… ఇప్పుడు బూస్టర్ డోస్ అంటున్నారు… అసలు రెండు వేక్సిన్ డోసులు వేసుకున్నా సరే, ఒమిక్రాన్ వచ్చి పట్టుకోవడాన్ని అది అడ్డుకోలేదు… సరే, ఎన్ని టీకాలు వేసుకున్నా సరే, కరోనా అటాక్‌ను అడ్డుకోలేం, కాకపోతే ఆసుపత్రి పాలు గాకుండా కాపాడుతుంది అనేదే నమ్ముదాం… మళ్లీ బూస్టర్ దేనికి..? ఎవరి దగ్గరా జవాబు లేదు సరిగ్గా…
సరే, అదీ వదిలేద్దాం… ఆరు నెలలకోసారి టీకాలు కుచ్చాల్సిందే అనేది ఈ ప్రభుత్వ నవీన మెడికల్ సూత్రం అనుకుందాం, ప్రపంచమంతా పాటిస్తున్నదే కదా అని నమ్మేద్దాం… మరి ఇప్పుడు తాజాగా ప్రికాషనరీ వేక్సిన్ ఏమిటి..? అప్పుడే 5 కోట్ల డోసులకు ఆర్డర్లు ఏమిటి..? సేమ్, బూస్టర్లు వేసుకునే ఆ వృద్ధులకే, ఇతరత్రా వ్యాధులున్న రోగులకే వేసేద్దాం అనే నిర్ణయం ఏమిటి..? బూస్టర్ మీదే ప్రికాషనరీ కుచ్చేస్తారా..? అసలు ఇంతకీ వేక్సిన్ సెకండ్ డోస్‌కూ బూస్టర్‌కూ నడుమ గ్యాప్ ఎంత ఉండాలో తేల్చలేదు… అప్పుడే 9 నెలలు అంటారు, ఎవరూ పట్టించుకోరు, దాన్ని తగ్గించాలని బేహారులు కోరుతుంటారు.., అలాంటప్పుడు ఇక బూస్టర్‌కూ ప్రికాషనరీ నడుమ గ్యాప్ ఏం తేలుస్తాం లెండి…
Ads
ఒమిక్రాన్ సోకితే అదిక దేవుడిచ్చిన నేచురల్ వేక్సిన్ అంటున్నారు… జలుబులాగే అంటుకుంటున్నదీ అనేది జనానుభవం… ఇక పాండెమిక్ వచ్చేసింది అంటున్నారు సైంటిస్టులు… మరికొంతకాలంపాటు అదే జగద్రక్ష అంటున్నారు… మళ్లీ ఈ బూస్టర్లు, ఈ ప్రికాషనరీలు దేనికి మహాప్రభూ..?! సరే, సరే… నాలుగు టీకాలు అదనంగా కుచ్చుకుంటే పోయేదేముంది..? యాంటీ బాడీలు అలా బాడీలో పడుంటాయ్ అంటారా..? వోకే సార్, మనదంతా ఉలిపికట్టె పంథా కదా… అలాగేనని అంగీకరిద్దాం… బయోలాజికల్-ఈ నుంచి 5 కోట్ల డోసుల కార్బెవాక్స్ కొంటున్నాం సరే, కోవావాక్స్, స్పుత్నిక్ ఎట్సెట్రా డోసుల మాటేమిటి..? డబుల్ ప్రికాషనరీ అని మార్కెట్‌లోకి వదిలేద్దాం సర్… లేదా మనమే కొని వేయించేద్దాం… ప్లీజ్ సార్… వాళ్లూ బతకాలి కదా ఫాఫం…
కానీ మళ్లీ కొన్నాళ్లకు సూపర్ ప్రికాషనరీ డోస్, రీబూస్టర్ డోస్, రెగ్యులర్ డోస్ అని కొత్త వేక్సిన్లు వస్తాయా సార్..? మార్కెట్‌లోకి రాగానే కుచ్చించుకోవాలా సార్..? లేక కాస్త గ్యాప్ ఇస్తే బెటర్ అంటారా..? ఏమో, మళ్లీ అప్పటికి ఇంకా కొత్తగా ఏమైనా టీకాలు వదులుతారేమో… ఈ గ్యాపులు గట్రా ఎందుకు సార్..? ఓ పనిచేయండి సార్, ఈ ముక్కులో టీకాలు గట్రా దేనికి గానీ టాబ్లెట్ ఫామ్‌లో ప్రవేశపెట్టండి సార్… డోలో మాత్రల్లాగే మింగుతాం… ధర మీ ఇష్టం… లక్షల కోట్ల టీకాల దందాను ఎవడు అడ్డుకోగలడు..?!
సార్, ఈసారి పద్మభూషణ్‌లు, విభూషణ్‌లు వద్దు సార్, ఏకంగా ఈ కంపెనీ ఓనర్లకు భారతరత్న ఇచ్చేద్దాం… సరేనా..?! ష్, ఎన్ని టీకాలు కుచ్చుకున్నా సరే, అదుగో కొత్త వేరియెంట్, ఇదుగో గబ్బిలాల్లో, అదుగదుగో బొద్దింకల్లో, మరీ డేంజర్, ఇంకో డోస్ కుచ్చుకొండి అర్జెంటుగా అనే మీడియా వార్తలు కూడా వస్తూనే ఉంటయ్… ఇవేవీ వైరస్ సోకకుండా ఆపలేవు… కాకపోతే తీవ్రత తగ్గుతుంది అంటారు… వీళ్లు చెప్పేదేంటి..? మ్యుటేషన్లతో స్పైకుల బలం తగ్గి అదే బలహీనపడింది ఒమిక్రాన్ తరహాలో… బలహీనపడటానికి అదేమైనా టీకాల దందా కాదు కదా… నిజాయితీ ఉన్న జీవనిర్జీవి…!!
Share this Article