NTR 266 వ సినిమా . రాఘవేంద్రరావు కాంబినేషన్లో మూడవ సినిమా . మాస్ మషాలా సినిమా . 16 కేంద్రాలలో యాభై రోజులు , ఆరు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . 1978 లో వచ్చిన ఈ కేడీ నెంబర్ 1 సినిమా 1976 లో హిందీలో బ్లాక్ బస్టర్ దస్ నంబరీ సినిమాకు రీమేక్ . హిందీ సినిమాలో మనోజ్ కుమార్ , హేమమాలిని , ప్రాణ్ , ప్రేమనాధ్ ప్రధాన పాత్రలలో నటించారు .
రొటీన్ కధే . దొంగ నోట్లు మార్చే ముఠా వలన హీరో కుటుంబం చెల్లాచెదురు కావటం , రాబిన్ హుడ్ లాగా పెరగటం , మధ్యలో హీరోయిన్ కలవటం , విలన్లను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పటం . టూకీగా ఇదీ ప్లాట్ . హుషారయిన వేటూరి , ఆత్రేయ పాటలు , కె వి మహదేవన్ శ్రావ్యమైన సంగీతం , రాఘవేంద్రరావు దర్శకత్వం సినిమాను కమర్షియల్ గా సక్సెస్ చేసింది . NTR సెకండ్ ఇన్నింగ్సులో వీర సక్సెస్ అయిన సినిమాలలో ఒకటిగా నిలిచింది .
ఆత్రేయ వ్రాసిన నేనే నెంబర్ వన్ పాట NTR అభిమానుల చేత రోడ్ల మీద కూడా డాన్స్ వేయించింది . వేటూరి వారి ఆకలుండదు దప్పికుండదు పాట ఇప్పటికీ ప్రేమికుల నోట్లల్లో నానుతుంటుంది . ఆయన వ్రాసిందే మరో పాట మళ్ళీ మళ్ళీ మళ్ళీ అంది కోడె వయసు పెళ్లి పెళ్లి అంది కూడా NTR అభిమానులను ఉర్రూతలూగించింది . వీటితో సమానంగా ప్రేక్షకులకు బాగా నచ్చిన డాన్స్ , పాట జయమాలిని మీద . మెరకీధి మల్లిని మద్రాసు లల్లిని . ఆత్రేయ వ్రాసారు . మిగిలిన పాటలు కూడా థియేటర్లో బాగానే ఉంటాయి .
Ads
దేవీ ఫిలింస్ బేనరుపై దేవీ వరప్రసాద్ నిర్మించారు . జగ్గయ్య రెండు పాత్రలు , జయసుధ రెండు పాత్రలు వేసారు . ఇతర పాత్రల్లో సత్యనారాయణ , పి జె శర్మ , అంజలీదేవి , మిక్కిలినేని , ప్రభాకరరెడ్డి , త్యాగరాజు ప్రభృతులు. నటించారు . ఈ సినిమాలో కూడా సత్యనారాయణ పాత్ర కీలకంగా ఉంటుంది . ఆయనా చాలా బాగా నటించారు .
సినిమా యూట్యూబులో ఉంది . NTR అభిమానుల్లో చూడనివారు ఉంటే చూడవచ్చు . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . A mass entertainer .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article