Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎన్టీయార్ సమర్పించిన సినిమా… ఐనా సరే… జస్ట్, ఓ అతిథి పాత్రలో హుందాగా…

October 23, 2024 by M S R

.

దారి తప్పిన బాలల్లారా , దగాపడిన యువకుల్లారా ! చెడు అనవద్దు , చెడు వినవద్దు , చెడు కనవద్దు , ఇది బాపూజీ పిలుపు , ఇదే మేలుకొలుపు .

అద్భుతమైన సాహిత్యం , యస్ జానకి మెలోడియస్ వాయిస్ . సి నారాయణరెడ్డి విరచిత ఈ పాట 1978 జనవరి 13 వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజయిన ఈ మేలుకొలుపు సినిమా లోనిదే . విద్యా సంస్థల ఫంక్షన్సులో , ప్రజాహిత కార్యక్రమాలలో ఈ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది . సినిమాలో కె ఆర్ విజయ నటించిన బాల నేరస్థుల పాఠశాల ప్రిన్సిపాల్ పాత్ర పాడుతుంది . ఈ సినిమాకు గుండె కాయ కె ఆర్ విజయ పాత్రే . ఒక విధంగా చెప్పాలంటే ఆమే షీరో . టైటిల్సులో కూడా యన్టీఆర్ అతిధి పాత్రలో అనే వేస్తారు .

Ads

1977 లో హింందీలో వచ్చిన జాగృతి అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . హిందీలో వినోద్ మెహ్రా , నూతన్ , రీనారాయ్ , ప్రేమ చోప్రా ప్రభృతులు నటించారు . NTR భక్తుడు , బంధువు ఎ పుండరీకాక్షయ్య నిర్మాత , బి వి ప్రసాద్ దర్శకుడు . గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ రాజకీయ నాయకుల మీద , వారి నక్కజిత్తుల శైలి మీద ఫుల్ వ్యంగ్యంతో పదునుగా ఉంటాయి .

దారి తప్పిన వీధి బాలుర్ని దగ్గరకు తీసి జేబుదొంగలుగా , నేరస్థులుగా తయారు చేసే మాఫియాల నివారణకు గాంధేయ మార్గంలో బాల నేరస్థులను సంస్కరించే సందేశాన్ని ఇచ్చే సినిమా . వాళ్ళల్లో మార్పు తీసుకొని వచ్చి సమాజానికి మంచి పౌరులను అందించాలనేది ఈ సినిమా సందేశం . ఈ సినిమాలో సంస్కరణవాది పాత్రను కె ఆర్ విజయ చాలా గొప్పగా పోషించింది . సంస్కరించబడే బాల నేరస్థుడిగా మాస్టర్ రాజాకృష్ణ చక్కగా నటించాడు . నాట్యకత్తెగా జయప్రద , పోలీస్ ఆఫీసరుగా NTR , విలన్లుగా నాగభూషణం , ప్రభాకరరెడ్డి , పాఠశాల ప్రిన్సిపాలుగా పద్మనాభం , సంస్కరించబడే నేరస్థుడిగా చలం , డాన్సర్లుగా జయమాలిని , హలంలు నటించారు .

ntr

ఈ సినిమాలో సి నారాయణరెడ్డి , దాశరధి వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ జానకి , వసంతలు పాడారు . కనరాని నీవే కనిపించినావే అనే దాశరధి వ్రాసిన పాట NTR , జయప్రదల మీద చాలా శ్రావ్యంగా ఉంటుంది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు . ఈ పాటలో NTR కాస్ట్యూమ్స్ భలే అందంగా ఉంటాయి . ఈ పాటలో NTR , జయప్రదలను చూస్తే ఈ ఇద్దరేనా యమగోల సినిమాలో గోలగోల చేసింది అని అనిపిస్తుంది . అంత మర్యాదగా నటిస్తారు .

మరో చక్కటి పాట జయప్రద మీద . పలికే మువ్వలలో తెలుపలేని కధలెన్నో అనే పాట . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాటను సుశీలమ్మ పాడింది . జయప్రద నటన చాలా చాలా అందంగా ఉంటుంది . ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే పాట కూడా చాలా బాగుంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాటను సుశీలమ్మే పాడింది . పాఠశాల మాస్టారు పద్మనాభాన్ని పిల్లలు అల్లరి చేసే డియ్యాలో డియ్యాలో పాట కూడా బాగుంటుంది . దాశరథి వ్రాసిన ఈ పాటను వసంత , ఆమె బృందం పాడారు . మొత్తం మీద సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి .

jayaprada

NTR మార్క్ ఏక్షన్ ఉండదు ఆయనకు ఈ సినిమాలో . చాలా హుందాగా ఉండే పోలీసు ఆఫీసర్ పాత్ర . సాధారణంగా ఆయన నుండి ప్రేక్షకులు ఆశించే మారువేషాలు , హీరోయిన్ని అతలాకుతలం చేసే డాన్సులు ఉండవు . బహుశా అందువలనే ఏమో ఆయన లెవెల్లో ఆడలేదు . కె ఆర్ విజయ , జయప్రద అందంలో పోటీ పడతారు . NTR కూడా అందంగా కనిపిస్తారు .

మంచి సినిమా . గొప్ప సందేశం . శ్రావ్యమైన పాటలు . అయినా కమర్షియల్ గా రావలసినంత సక్సెస్ రాలేదు . చూడబుల్ సినిమా . యూట్యూబులో ఉంది . వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు . హిందీ సినిమా జాగృతి కూడా యూట్యూబులో ఉంది . హిందీ సినిమా వీడియో క్వాలిటీ బాగా లేదు . మన తెలుగు సినిమా , పాటల వీడియోల క్వాలిటీ బాగుంది . సినిమా చూసే టైం లేకపోతే పాటల వీడియోలు చూడండి . మాస్టర్ వేణు అందించిన మంచి సంగీతాన్ని , సినారె , దాశరధిల చక్కటి సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?
  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions