Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నీ హిట్ పాటలే… సినిమా కూడా హిట్టే… ఎన్టీయార్‌కే ఒక్క పాటా లేదు…

July 25, 2024 by M S R

హిందీలో బ్లాక్ బస్టర్ యాదోం కి బారాత్ ఆధారంగా 1975 లో తెలుగులో వచ్చిన ఈ అన్నదమ్ముల అనుబంధం సినిమా కూడా బ్లాక్ బస్టరే . కమర్షియల్ గా వీర సక్సెస్ అయింది . నేనయితే హిందీ సినిమా కూడా రెండు సార్లు చూసా .

మన తెలుగు సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం పాటలే . హిందీ ట్యూన్లనే ఉపయోగించుకోవటం వలన పాటలు సూపర్ హిట్టయ్యాయి . ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే , గులాబి పువ్వై నవ్వాలి వయసు , కౌగిలిలో ఉయ్యాలా , అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది , ఆనాడు తొలిసారి నిన్ను చూసి మురిసాను నేను పాటలు సూపర్ హిట్ . చక్రవర్తి సంగీత దర్శకులు .

యస్ డి లాల్ దర్శకత్వంలో సినిమా అంతా స్పీడు స్పీడుగా సాగిపోతుంది . NTR , మురళీమోహన్ , బాలకృష్ణ , కాంచన , లత , జయమాలిని , రాజబాబు , ప్రభాకరరెడ్డి , త్యాగరాజు , పుష్పలత ప్రభృతులు నటించారు .

Ads

హిందీలో ధర్మేంద్ర , విజయ అరోరా , తారిఖ్ ఖాన్ , జీనత్ అమన్ , నీతూ సింగ్ , అజిత్ ప్రభృతులు నటించారు . మన తెలుగు సినిమా వంద రోజుల ఉత్సవానికి MGR , శివాజీ గణేశన్ , హిందీ హీరో రాజకుమార్ అతిధులుగా విచ్చేసారు .

(ఇన్ని హిట్ పాటలున్నాయి కదా, ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఎన్టీఆర్‌కు ఒక్క పాట లేకపోవడం, అఫ్‌కోర్స్, హిందీ సినిమాలో ధర్మేంద్రకూ అంతే… (వికీ సమాచారం ఆధారంగా…)

మాతరంలో అందరూ చూసే ఉంటారు . ఈతరంలో చూడనివారు ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . NTR , బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది . బాలకృష్ణకు ఈ సినిమా వలన మంచి పేరు వచ్చింది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. ( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…
  • ఆమె కథలో బోలెడు నాటకీయత… కానీ ‘క్రియేటివ్ ఫ్రీడమ్‌’పైనే భయం…
  • ప్చ్… చిరంజీవి, రాఘవేంద్రరావు, విజయశాంతి లెవల్‌లో ఆడలేదు…
  • కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions