ఖచ్చితంగా ఈటీవీలో ఏదో జరుగుతోంది… దాంతోపాటు మల్లెమాల కంపెనీలోనూ ఏదో నడుస్తోంది… ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు ఉంటున్నారో ఎవరికీ అర్థమయ్యే పరిస్థితి లేదు… వారం వారం ఏదో మార్పు… ఎవరికీ స్థిరత్వం లేదు అక్కడ… నాణ్యత మటాష్… అందరిలోనూ ఏదో అస్థిర భావన… కమెడియన్లు, యాంకర్లు, జడ్జిలు… అందరిదీ ఇదే స్థితి… తాజాగా ఢీలో మార్పులు ఇంట్రస్టింగుగా ఉన్నాయి…
ఒకవైపు బిగ్‌బాస్ హౌజులో అఖిల్ సార్థక్ అంటే, ఇక్కడ ఢీషోలో మెంటార్‌గా కనిపించేవాడు… సరే, పాత షూటింగ్ ఎపిసోడ్స్ కావచ్చులే అనుకుందాం… ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా మాయం… రష్మిని, దీపిక పిల్లిని తీసిపారేసి… నవ్యను, సుస్మిత అనలను పట్టుకొచ్చారు కదా… ఇప్పుడు సుస్మిత మాయం… ఆమె ప్లేసులో ఓ కొరియోగ్రాఫర్ పాపీని తీసుకొచ్చారు…
తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో కొరియోగ్రఫీ చేస్తుంటుంది… పాపీ మాస్టర్… అప్పుడే ఆమె మీద హైపర్ ఆది మార్క్ పంచులు స్టార్టయ్యాయి… శేఖర్ మాస్టర్ వెళ్లిపోయాక గణేష్ మాస్టర్ చాన్నాళ్లు జడ్జిగా చేశాడు… కానీ ఇప్పుడు ఆయన కూడా మాయం… జానీ మాస్టర్ వచ్చి కూర్చున్నాడు… పూర్ణను ఎప్పుడో తరిమేసి నందిత శ్వేతను తెచ్చారు కదా… ఆమె ప్రస్తుతానికి కొనసాగుతోంది… ఎన్నాళ్లో తెలియదు…
Ads
అసలు రష్మి, పూర్ణ, సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాక ఢీ షో కళ తప్పిందనేది నిజం… ఏదో ప్రదీప్, ఆది తిప్పలు పడుతున్నారు గానీ… ఆ పాత కామెడీ స్కిట్స్ రేంజ్ రావడం లేదు… శేఖర్ మాస్టర్, రష్మి, సుధీర్, ప్రదీప్, ప్రియమణి సరిపోయేవారు… ఏవేవో పిచ్చి మార్పులన్నీ చేసి, చేజేతులా షోను చెడగొట్టేశారు…
అసలు ఈ షో ఒక్కటే కాదు… అన్నీ అంతేగా… జబర్దస్త్ నుంచి ఆది, సుధీర్, గెటప్ శ్రీను, అదిరె అభి వెళ్లిపోయారు… ఒక్కసారిగా జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలు డౌన్ అయిపోయాయి… రోజా వెళ్లిపోయాక రెగ్యులర్ జడ్జి ఎవరూ లేరు… ఇంకోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి సుధీర్‌ను వెళ్లగొట్టి, తన ప్లేసులో రష్మిని తీసుకొచ్చారు… పూర్ణ ఒక్క షోలో కనిపించింది గానీ బహుశా గెస్టుగా వచ్చి ఉంటుంది… పైగా ఇప్పుడు పెళ్లి చేసుకుంటోంది కాబట్టి రెగ్యులర్ టీవీ, సినిమా కెరీర్ కంటిన్యూ చేస్తుందో లేదో డౌటే…
ఇంతగా మార్పులు చేయడం వల్ల… కన్సిస్టెన్సీ పోతుంది… ఆర్టిస్టుల్లో కూడా ఓ అభద్రత భావన ఉంటుంది… అది నాణ్యతను దెబ్బతీస్తుంది… అఫ్ కోర్స్, ఈటీవీ ఎలాగూ నాణ్యతను పెద్దగా పట్టించుకోవడం లేదు… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, డ్రామా కంపెనీ, ఢీల పరిస్థితి ఇలా ఉంటే… చివరకు వావ్, క్యాష్, ఆలీతో సరదాగా షోలు కూడా పెద్దగా రక్తికట్టడం లేదు… రేటింగ్స్ లోనూ అంతంత మాత్రమే… సో, ఈటీవీకి ఏదో అయ్యింది..!! ఈటీవీ బలమే ఇలాంటి నాన్-ఫిక్షన్ షోలు… చివరకు వాటినీ చెడగొట్టుకుంటున్నారు… ఏమో, ప్రక్షాళన చేస్తున్నారు అంటారా..? చూడబోతే అలా లేదు..!!!
Share this Article