Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజేంద్రప్రసాద్- జారుడుబండ ! మరోసారి నవ్వులపాలు !!

August 10, 2026 by M S R

.

Mohammed Rafee …. నవ్వుల హీరో డా. రాజేంద్రప్రసాద్ నవ్వించాలని ప్రయత్నిస్తూ నవ్వుల పాలవుతుంటారు! హూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు వచ్చిన ఆయన మళ్ళీ నోరు జారారు!

ఇంత దూరభారాలకు వచ్చి వివిధ సంఘాల పేరుతో కొట్టుకోవడం తనకు బాధ కల్గిస్తున్నదని అంటూ ఒక కట్టు కథ అల్లి అభాసుపాలయ్యారు. పైగా మినిమమ్ చప్పట్లు కొట్టొచ్చు అంటూ అదేదో నవ్విస్తూనే జ్ఞానబోధ చేసినట్లు తనకు తాను నవ్వుకుంటూ “బ్రహ్మాండం అని ఆయనకు ఆయన చెప్పుకున్నారు.

Ads

ఆయన కూర్చున్న టేబుల్ దగ్గర ముగ్గురు వ్యక్తులు కూర్చుని “నేను తానా, నేను అటా, నేను బాటా అని కొట్టుకుంటూ ఈయన్ని అడిగారట! ఓహో ఇక్కడ బాటా చెప్పు కూడా వుందా? అని నవ్వొచ్చిందట! నేను తంతా అని ఈయన అన్నారట!

తంతా TANTA అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నాన్ ఆఫీలియేటెడ్ తానా లేదా అటా అని విడమరచి చెప్పి చప్పట్లు కొట్టండి అనడం! అక్కడ కొందరు ప్రేక్షకులు ఈలలు వేశారు. వేదిక పై వున్న వారు, ప్రేక్షకులు చాలామంది విస్తుపోయారు!

తన స్పీచ్ లో తాను ఎన్టీఆర్ ఇంట పుట్టిన దగ్గర నుంచి కామెడీని హీరోగా మలుచుకున్న వరకు వివరించారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావు మొదలుకుని ప్రతి ఒక్కరూ బోర్ కొట్టినప్పుడు తన సినిమా చూసుకుని నవ్వుకుంటారనేది పచ్చి నిజం అని చెప్పుకున్నారు. పద్యం కూడా పాడి అలరించే ప్రయత్నం చేశారు.

నిజానికి ఇక్కడ అమెరికాలో తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి. కులాల కుంపట్లు ఉన్నాయి! ఎన్ని సంస్థలు వున్నా అందరూ కలిసే ఉంటారు! తెలుగు కమ్యూనిటీపరంగా ఎంతో కొంత సేవ చేస్తూనే ఉంటారు. కానీ, ఎక్కువ మందికి సినిమా పిచ్చి! సినిమా నటులు అంటే విపరీతమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. హాజరయ్యే సినిమా నటులను బట్టే ఇక్కడ డొనేషన్లు కూడా ఎక్కువ వస్తుంటాయి! అందుకే ఒక్క సిలికానాంధ్ర సంస్థ తప్ప మిగిలిన సంస్థలు అన్నీ సినిమా వాళ్లనే అతిధులుగా పిలుచుకుంటూ ఉంటారు!

పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా డా. రాజేంద్ర ప్రసాద్ ను హూస్టన్ తెలుగు సంఘం ఆహ్వానించింది. ఆయనతో పాటు అలీ కూడా హాజరయ్యారు. ఇటీవల కాలంలో మైక్ దొరికితే మునుపటి కామెడీ పండించాలనే ప్రయత్నం చేస్తూ తప్పులో కాలు వేసేస్తున్నారు డా. రాజేంద్ర ప్రసాద్.

స్వతహాగా ఆయన చాలా మంచి వ్యక్తిత్వం గలవారు! మనసులో ఏదీ దాచుకోలేని భోళాతత్వం! ఏదో ఒక విధంగా నలుగురికి సాయం చేయాలనే తత్వం! కానీ స్టార్ డమ్ ఒకటుంది కదా! అది మనిషిని ఆడిస్తుంటుంది!

మునుపటి వైభవంలో ఎప్పటికీ అలాగే ఉండాలని ఆశ పడే తత్వంతోనే ఇబ్బందులు! ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు పాపం! నవ్విస్తూనే హిత బోధ కూడా చేయాలని చూశారు! కానీ అన్ని వేదికలపై పప్పులు ఉడకవు అంతే! అయినా ఆయన నోరు ఈమధ్య జారుడు బండలా మారిపోయింది!

జారుడు బండ….
పిల్లలు ఎక్కి జారతారు.
వృద్దాప్యం మరో బాల్యం…
ఈయన ఎక్కింది వేదిక కాదు జారుడు బండ అనుకుంటున్నారు!. ఎక్కిన ప్రతిసారీ జారుతూనే వున్నారు!
– డా మహ్మద్ రఫీ
(అమెరికా నుంచి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజేంద్రప్రసాద్- జారుడుబండ ! మరోసారి నవ్వులపాలు !!
  • ‘‘ముందు అతడిని పంపించేయండి – లేదంటే నేను షూటింగ్‌కే రాను’’
  • … అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్… నిజమేనా !!
  • రిటైరయ్యాక ఆయుష్షు ఎనిమిదేళ్లేనట ! ఆంధ్రజ్యోతిలో ఓ పిచ్చి సర్వే !!
  • ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!
  • కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?
  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions