.
శ్రీకాంత్ అయ్యంగార్… ఆమధ్య పిచ్చి కూతలు కూసి, రివ్యూయర్లు, ఫిలిమ్ జర్నలిస్టులను పెంట మీద పురుగుల్లా, కాదు, ఆ పురుగుల విసర్జకాలకన్నా హీనంగా తీసిపారేసిన తిక్క కేరక్టర్ తెలుసు కదా… నథింగ్, ఇలాంటోళ్లను ఎవరూ కంట్రోల్ చేయలేరు… తాజాగా మళ్లీ వచ్చాడురా బాబోయ్…
తొక్కలో లోకం… ఎవడేమనుకుంటే నాకేంటి..? నాకు చాన్సులు ఇచ్చేవాడి ఖర్మ… వాడి దరిద్రం… బొచ్చు, మనది పోయేదేముంది అన్నట్టుగా ఉంటున్నాయి తన మాటలు…
Ads
ఈ సారు గాడు… మైక్ దొరికితే చాలు, ఫాఫం, మైకే వణికిపోతుంది గజగజా… ఏం మాట్లాడతాడో ఎవడికీ తెలియదు, వినేవాడి ఖర్మ… అఫ్ కోర్స్, తనకు కూడా తెలిస్తే కదా ఫాఫం,.. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు… ఈ వివరాల్లోకి వెళితే…
అసలు వర్మ స్కూల్ బాపతు కేరక్టర్లు అంతేనేమో… ప్రేక్షకుడు లోకువ… రివ్యూయర్లు పరమ లోకువ… జర్నలిస్టులంటే తనే గతంలో చెప్పాడు కదా… పెంట పురుగుల విసర్జకాలకన్నా హీనం అని… అన్నట్టు ఈయన తన గురువు మెంటల్ వర్మను మించిన కేరక్టర్ నటుడే కాదు, దర్శకుడు కూడా ఉన్నాడట తనలో,.. ఇన్నాళ్లూ తెలియనేలేదు సుమీ…
స్టేల్‌మెట్.,ఇట్స్ యువర్ మూవ్, ఏప్రిల్ ఫూల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడట… ఆ సినిమాలకు మనకు తెలియకపోతేనేమి..? వచ్చే ఉంటాయి… ఇవన్నీ సరే…
పొట్టేల్ సినిమా సక్సెస్ మీట్ (?)లో భాగంగా శ్రీకాంత్ ఆమధ్య మాట్లాడుతూ.. సినిమా రివ్యూయర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు… షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా ** లు అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు…
తాజాగా కులం, క్యాస్ట్ ఫీలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిండు శ్రీకాంత్… వీడియో వదిలిండు… ‘‘చాలా మంది మీ కులమేంటీ? మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అని అడుగుతున్నారు… నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.. కులం ఫీలింగ్ ఉంది, నా కులం సింగిల్స్ కులం, సింగిల్స్‌గా ఉన్న అందరూ నా బ్రదర్సే. జై సింగిల్, సింగిల్స్ రాక్స్…’’ అంటూ 90 ఎంఎల్ కొట్టివచ్చినట్టున్నాడు… ఏదో కూశాడు…
మరీ శ్రీకాంత్ వంటి కేరక్టర్ల మాటలకూ వార్తలేమిటి..? అందరూ ఆ గురువు శిష్యులే కదా అంటారా..? పాపం, ఆ యాక్ట్రెస్ జ్యోతి ఎంత ఫీలై ఉంటుంది… సింగిల్ అంటాడా..? పైగా సింగిల్స్ అంటే ఓ కులమా..? హవ్వ… కానీ ఏమాటకామాట… తను తాగే బ్రాండ్ ఏమిటో గానీ… చాలా పవర్ ఫుల్ ఉన్నట్టుంది… కిక్కు మామూలుగా లేదు…!!
Share this Article