.
నందమూరి, అక్కినేని కుటుంబాల నుంచే కాదు… సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా వారసులు వస్తూనే ఉన్నారు… తాజాగా వినిపిస్తున్న పేరు జాన్వి స్వరూప్… ఈమె కృష్ణ బిడ్డ మంజుల కూతురు…
మంజుల మొదట్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపితే ఫ్యాన్స్ ఒప్పుకోలేదు… ఈ చెత్తా హీరోయిన్ల సంస్కృతిలో మా అభిమాన హీరో బిడ్డను చూడలేం అనే ప్రేమతో వ్యతిరేకించారు… ఫలితంగా ఆమె వెనుకంజ.,..
Ads
సరే, తరువాత కొన్ని సినిమాల్లో సగటు హీరోయిన్ పాత్రలు గాకుండా వేరే పాత్రలు చేసింది… అది వేరే సంగతి… ఇప్పుడు ఆమె బిడ్డ జాన్వి స్వరూప్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందట… గుడ్, ఆల్ ది బెస్ట్… ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు…
స్టార్ల కూతుళ్లు కూడా (అన్ని భాషల్లోనూ) ఫ్యాన్స్ బంధనాలు తెంచుకుని ఫీల్డులో అడుగుపెడుతున్నారు… సరే, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచే బోలెడు మంది వారస నటులు వచ్చేశారు… కృష్ణ కొడుకు రమేష్, కృష్ణ ఎంత ప్రయత్నించినా సరే హీరోగా నిలదొక్కుకోలేదు…
తరువాత మహేశ్ బాబు… స్టార్ హీరో… రాజమౌళితో సినిమా చేస్తున్నాడు కదా, కాబోయే పాన్ ఇండియా హీరో… తన భార్య నమ్రత గతంలో హీరోయిన్… బిడ్డ సితార చిన్న వయస్సులోనే యాడ్స్ చేస్తూ పాపులర్ అయిపోయింది… కాబోయే సినిమా స్టార్,, డౌట్ లేదు…
మంజుల… నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది… ఈమె బిడ్డే కాబోయే లేటెస్ట్ ఎంట్రీ జాన్వి స్వరూప్…
సుధీర్ బాబు….: కృష్ణ చిన్న అల్లుడు (కుమార్తె ప్రియదర్శిని భర్త). ఈయన కూడా తెలుగులో ప్రముఖ హీరోగా స్థిరపడ్డాడు…
అశోక్ గల్లా…: కృష్ణ పెద్ద కుమార్తె (పద్మావతి) కుమారుడు, అంటే కృష్ణ గారి మనవడు…. ఈయన ఇటీవలే హీరోగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు…
గౌతమ్ ఘట్టమనేని…: మహేష్ బాబు కుమారుడు, అంటే కృష్ణ మనవడు… ఈయన బాల నటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించాడు, కొన్నాళ్లయ్యాక ఎంట్రీ ఉంటుంది, గ్యారంటీ…
భారతి… ఈమె దివంగత రమేష్ బాబు బిడ్డ… ఈమె కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోంది… ఆల్రెడీ ఆమె ఫోటోలు, సోషల్ మీడియా వీడియోలు వైరల్ అయ్యాయి కూడా…
మహేశ్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కూడా గతంలో హీరోయిన్… కొన్నాళ్లు సినిమాలు మానేసి, మళ్లీ ఇప్పుడు తెర మీద కనిపిస్తోంది… బిగ్‌బాస్ హిందీలో కూడా పాల్గొంది… ఈరకంగా, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడు తరాలు చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాలలో చురుకుగా కొనసాగుతున్నారు…
Share this Article