Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ద బ్యాంకులు దివాలా తీస్తున్నయ్… బహుపరాక్, బహుపరాక్…

March 16, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ………. బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి !

ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది !

ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు!

అయితే కియోసాకి అనే బాంకింగ్, స్టాక్ మార్కెట్ నిపుణుడి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా?

కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక మాంద్యానికి కారణం అయిన ‘లే మాన్ బ్రదర్స్ ‘ [Lehman Brothers’] కుప్పకూలిపోతుంది అంటూ రెండు నెలల ముందే జోస్యం చెప్పాడు. తరువాత అదే నిజం అయ్యింది ! కాబట్టి ఇప్పుడు రాబర్ట్ కియోసాకి జోస్యానికి విలువ ఉంది !

***************************

సిలికాన్ వాలీ బాంక్ మూతపడిన మరుసటి రోజే మరో క్రీప్టో కరెన్సీ డీల్ చేసే సిగ్నేచర్ బ్యాంక్ [Signature Bank ] కుప్ప కూలిపోయిన సంగతి తెలిసిందే ! అయితే ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ లాంటి క్రీప్టో కరెన్సీని రహస్యంగా ఉంటూ మార్కెట్ చేసున్నది ‘జార్జ్ సోరోస్ ‘ అన్నది బహిరంగ రహస్యం కానీ అధికారికంగా జార్జ్ సోరోస్ పేరు బయటికి రాలేదు.

సిగ్నేచర్ బాంక్ మూతపడడం మీద ఎలాంటి వివరాలు అందుబాటులోకి రాలేదు ఎందుకని ? కేవలం సిగ్నేచర్ బాంక్ మూత పడ్డది, అది ప్రధానంగా క్రీప్టో కరెన్సీని డీల్ చేస్తుంది కాబట్టి ప్రాధాన్యత ఇవ్వలేదా ? అయితే సిగ్నేచర్ బాంక్ ని కావాలనే మూతపడేట్లు చేశారన్నది కొంతమంది విశ్లేషకులు చేస్తున్న ఆరోపణ ! సిగ్నేచర్ బాంక్ విషయం లో ఎక్కువ వివరాలు ఎందుకు బయటికి రాలేదు ?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి చెందిన వ్యక్తులు మారు పేర్లతో క్రీప్టో కరెన్సీలో వేల కోట్ల పెట్టుబడి పెట్టి అవసరం అయినప్పుడు వాటిని అమ్మేసి డాలర్ల రూపంలోకి మార్చుకొని, వాటిని రష్యా డిఫెన్స్ పరిశ్రమకి కావాల్సిన విడిభాగాలని కొని, మాస్కో కి చెరవేస్తున్నారు అనే అనుమానం పెంటగాన్ తో పాటు సిఐఏ కి కూడా ఉంది !

లేకపోతే సంవత్సరాలుగా ఎన్ని ఆంక్షలు విధించినా, రష్యా తన డిఫెన్స్ పరిశ్రమని ముందుకు తీసుకెళ్తున్నది తప్పితే అమెరికా యూరోపు దేశాలు ఆశించినట్లుగా కుప్పకూలిపోలేదు ! డాలర్లు ఎలా వస్తున్నాయి రష్యాకి ? గత పదేళ్లుగా పుతిన్ తన నమ్మకస్తుల చేత క్రీప్టో లో పెట్టుబడులు పెట్టిస్తూ, అవసరం అయినప్పుడు వాటిని డాలర్ల రూపంలోకి మార్చుకొ,ని తమకి కావలసినవి డాలర్లు ఇచ్చి, కొని వాటిని రహస్యంగా మాస్కోకి తరలిస్తున్నారు!

కాబట్టి సిగ్నేచర్ బాంక్ ని ఏదో ఒక విధంగా మూసేస్తే సరి ! జార్జ్ సోరోస్ కి బాగా దగ్గరయిన వాళ్ళలో రష్యన్ పారిశ్రామిక వేత్తలు [అమెరికా, యూరోపు దేశాలు వీళ్ళని ఓలిగార్చ్ లు అని పిలుస్తారు ] ఉన్నారు. అయితే వీళ్ళు పుతిన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు సోరోస్ ని నమ్మించారు. బహుశా చివరి నిముషంలో తెలుసుకొని వీళ్లకి డాలర్లని సమకూర్చేది సిగ్నేచర్ బాంక్ కాబట్టి మూసేస్తే వీళ్ళకి డాలర్లు అందవు ! ఈ విషయాలు అన్నీ నిజాలో కాదో తెలీదు కానీ పరోక్షంగా పుతిన్ కి కంటే ఆమెరికాకే కీడు చేశాయి ! ఎందుకంటే వరుసగా రెండు రోజుల వ్యవధిలో రెండు బాంకులు మూత పడడం అనేది అమెరికా లాంటి దేశానికి పరువు నష్టం !

ఒకే పౌండ్ [బ్రిటన్ కరెన్సీ ] తో ఎవరన్నా బాంక్ ని స్వాధీనం చేసుకోగలరా ? చేసుకున్నారు ! సిలికాన్ వాలీ బాంక్ బ్రిటన్ శాఖ ని HSBC కేవలం ఒకే ఒక్క పౌండ్ ఇచ్చి తన అధీనంలోకి తీసుకున్నది ! మరీ ఉచితంగా టెక్ ఓవర్ చేయకూడదు కాబట్టి ఎంతో కొంత చెల్లించాలి కాబట్టి ఒకే ఒక పౌండ్ ని చెల్లించి తన అదీనంలోకి తీసుకుంది HSBC బ్యాంక్ ! అంటే సిలికాన్ వ్యాలీ బాంక్ బ్రిటన్ శాఖని టెక్ ఓవర్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేనంతగా నష్టాలలో ఉంది అనే కదా అర్ధం ?

వరసగా రెండు అమెరికన్ బాంకులు మూతపడడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాంకింగ్ రంగ షేర్లు భారీగా పతనం అయ్యాయి! యూరోపు స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది ! ఆసియా మార్కెట్లు కూడా పతనం అయ్యాయి ! ఇప్పుడు క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] వంతు వచ్చింది !

రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అంచనా ప్రకారం స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా బాంకింగ్ మరియు బ్యాంకింగ్ రంగానికి చెందిన ఇతర సేవలు అందించే క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] పరిస్థితి బాగాలేదని త్వరలో మూత పడుతుంది అంటూ జోస్యం చెప్పిన రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] గణాంకాల తో సహా ఎందుకు మూత పడుతుందో చెప్తున్నాడు!

ఇతర బాంకింగ్ సేవలతో పాటు క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బ్యాంక్ డీల్ చేసేది ఎక్కువగా ‘బాండ్ మార్కెట్ ‘ ని. ప్రపంచవ్యాప్తంగా దేశాల బాండ్ల తో పాటు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు, మల్టీ నేషనల్ కార్పొరేట్ సంస్థలు జారీ చేసే బాండ్ల ని కొని పెట్టుకుంది క్రెడిట్ సూయిస్సే . అయితే గత కొద్ది కాలంగా క్రమంగా బాండ్ మార్కెట్ ఆశించింత ఫలితాలు ఇవ్వడం లేదు. షేర్ మార్కెట్ వేరు బాండ్ మార్కెట్ వేరు వేరు అన్నది గుర్తుపెట్టుకోండి !

రిచ్ డాడ్ కంపనీ [Rich Dad Company] సహ వ్యవస్థాపకుడు అయిన రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] ఘంటాపధంగా చెప్తున్నాడు అమరికా నష్టపోయి కష్టాల పాలు అయ్యేది బాండ్ మార్కెట్ వల్లనే అని ! క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బ్యాంక్ ప్రధానం గా డీల్ చేస్తున్నది బాండ్ మార్కెట్ మీదనే !

బాండ్ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్దది ! అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రెట్లు పెంచి మార్కెట్ ని కాపాడుకోవాలని చూస్తున్నది కానీ అలా జరగట్లేదు ! ఫెడ్ రిజర్వ్ వడ్డీ రెట్లు పెంచడం వల్లనే కదా సిలికాన్ వ్యాలీ బాంక్ నుండి డిపాజిటర్స్ తమ సొమ్ముని వెనక్కి తీసుకొని ఫెడ్ దగ్గర పెట్టుబడి పెట్టాలని చూడడంతో చివరికి సిలికాన్ వాలీ మూతపడడానికి దోహదం చేసింది. కానీ ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు సొ కాల్డ్ ఆర్ధిక వేత్తలు ? కియో సాకి మాత్రం అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఆమెరికాని తగులబెట్టి తీరిగ్గా ఫైర్ ఫైటర్ పాత్ర పోషించాలని చూస్తున్నది అని వ్యాఖ్యానించాడు !

అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బాండ్ మార్కెట్ క్షీణిస్తున్నది అని తెలిసీ ఎలాంటి చర్యా తీసుకోక పోగా బాండ్ మార్కెట్ సర్దుకుంటుంది అనే ఆలోచనలో ఉంది కానీ అలా జరిగే అవకాశమే లేదు అని వ్యాఖ్యానించాడు కియోసాకి !

2008 లో లే మాన్ బ్రదర్స్ సృష్టించిన సంక్షోభం కంటే పెద్దదే జరగబోతున్నది రాబోయే రోజుల్లో ! అసలు వ్యాధికి చికిత్స చేయాల్సింది పోయి ఫెడరల్ రిజర్వ్ మరిన్ని డాలర్లని ప్రింట్ చేస్తూ పోతున్నది . కానీ దీనివల్ల సంక్షోభం మరింత ముదిరి డాలర్ విలువ పడిపోతుంది కాబట్టి ఇన్వెస్టర్లకి సలహా ఇచ్చాడు కియో సాకి : ‘‘స్టాక్ మార్కెట్ కానీ, క్రూడ్ మార్కెట్ కానీ, బాండ్ మార్కెట్ కానీ ఇప్పట్లో కొలుకునే అవకాశం లేదు కాబట్టి బంగారం, వెండి లాంటి మీద పెట్టుబడులు పెట్టడం మంచిది ! ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం తీవ్రత ఎలా ఉండబోతున్నదో ఎవరూ చెప్పలేకున్నారు కాబట్టి ఇప్పట్లో బంగారం, వెండి మీద పెట్టుబడులు పెట్టడమే మంచిది ! డాలర్ విలువ పడిపోయి మళ్ళీ పైకి లేస్తుందా లేదా అనేది జో బిడెన్ యంత్రాంగం తీసుకునే చర్యల మీద ఆధాపడి ఉంది !’’

రాబర్ట్ కియోసాకి మాటలకి విలువ ఉంది ! 2021-2022 గాను తమ పని తీరు వల్ల చాలానే నష్టాలని చవి చూశామని క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బ్యాంక్ అధికారికంగా ప్రకటించడానికి ముందే రాబర్ట్ కియోసాకి క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] గురుంచి హెచ్చరిక చేశాడు కాబట్టి కియోసాకి అంచనాలకి విలువ ఉంది.! క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బ్యాంక్ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ‘మెటీరియల్ వీక్ నెస్ ‘ వల్ల తమ ఆంచానాలు తప్పాయని పేర్కొంది !

క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] కి గత రెండు సంవత్సరాల నుండి తగిలిన ఎదురు దెబ్బల వలన 80% తన షేర్ విలువని కోల్పోయింది. ప్రధానంగా అమెరికన్ అసెట్ మేనేజ్మెంట్ ‘ఆర్కిగోస్’ [Archegos] మరియు బ్రిటన్ కి చెందిన గ్రీన్సీల్ [Greensill] సంస్థలు తీవ్రంగా నష్టపోవడమే క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బాంక్ యొక్క పతనానికి దారి తీసింది ! 2021 లో గ్రీన్ సీల్ దివాళా తీసింది !

ఇప్పటి బాంకింగ్ రంగ సంక్షోభానికి పునాది రాయి 2021 లో నె బ్రిటన్ కి చెందిన గ్రీన్ సీల్ తో మొదలయ్యింది ! ఇదే క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బ్యాంక్ హాంగ్ కాంగ్ శాఖ ఆదానీ గ్రూపు యొక్క విలువని మదింపు చేసి అంతర్జాతీయ లెండర్స్ కి రిపోర్ట్ ఇచ్చింది అప్పు ఇవ్వవచ్చని ! హిండెన్ బర్గ్ రిపోర్ట్ రాగానే తూచ్ ఆదానీ గ్రూపు కి అప్పు ఇవ్వకూడదు అంటూ ప్రకటన చేసింది క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]. మరి ఇందులో పనిచేసేవాళ్ళు ఆర్ధిక నిపుణులా లేక తుక్కు వ్యాపారం చేసేవాళ్ళా ? అంతర్జాతీయ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో గమనించారా ? వీళ్ళు ఆశించినట్లు ఆదానీ గ్రూపు దివాళా తీయలేదు !

ఈ వ్యాసం పూర్తయే సమయానికి మరో వార్త తెలియవచ్చింది ! క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బ్యాంక్ స్విట్జర్లాండ్ దేశానికి చెందినది కదా ! దివాళా తీయకుండా ఉండడానికి గాను స్విస్ నేషనల్ బాంక్ 54 బిలియన్ డాలర్ల ని క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse] బాంక్ లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ! So! చైయిన్ రియాక్షన్ జరగకుండా చూసింది స్విట్జర్లాండ్ !

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions