.
మన సినిమా సెలబ్రిటీలకు ఒరిజినల్‌గానే దిమాక్‌లో చటాక్ తక్కువై మాట్లాడతారో… బహిరంగ వేదికల మీదకు కాస్త కిక్కుతోనే వస్తారో తెలియదు గానీ… పిచ్చి కూతలు కూస్తూనే ఉంటారు…
ఈమధ్యే బోలెడు ఉదాహరణలు చూశాం కదా… ఆ వ్యాఖ్యలతో సినిమాలకు నష్టం జరుగుతున్నా సరే, నాలుకలు కంట్రోల్‌లోకి రావు, తాజా ఉదాహరణ ఎస్‌కేఎన్… ఆమధ్య బేబీ సినిమా తీశాడు కదా, ఆయనే… అది కాస్త హిట్టయి నాలుగు డబ్బులు వచ్చాయి కదా, సారులో యాటిట్యూడ్ బాగా పెరిగిపోయినట్టుంది…
Ads
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే ఓ సినిమా తాలూకు ఫంక్షన్… అందులో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ ఫిమేల్ లీడ్… సెకండ్ హీరోయిన్ లేదా మరో కీలకపాత్రకు గాను కయదు లోహర్ అనే అమ్మాయిని తీసుకున్నారు…
ఆ ఫంక్షన్‌లో మాట్లాడుతూ శ్రీమాన్ ఎస్‌కేఎన్‌కు కయదు అనే పేరు కూడా పలకడం చేతకాలేదు, కాయల్ అంటాడు, వెంటనే ఏమండీ మీ పేరు కాయలా పళ్లా అని ఓ పిచ్చి కూతతో కవరింగు… (ఈమధ్యే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న అన్షు అంబానీ మీద ఇలాంటి పిచ్చి కూతలే కూశాడు కదా ఓ తోపు మేధావి ఏదో ఫంక్షన్‌లో…)
సరే, ఏ జోష్‌లో ఉన్నాడో గానీ ‘‘మేం తెలుగురాని అమ్మాయిల్నే ఎక్కువ ఇష్టపడతాం, తెలుగు వచ్చిన వాళ్లను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు, అందుకని నేను, నా దర్శకుడు సాయిరాజేష్ నిర్ణయించుకున్నాం… ఈరోజు యూత్ అప్పు చేసైనా సినిమాలు చూస్తారు, అవసరమైతే లోన్ యాప్స్ నుంచి కూడా లోన్ తీసుకుని మరీ చూస్తారు…’’ అంటూ ఏదేదో వాగాడు… వాగాడు అనే పదం వాడాడు కరెక్టే అనుకుంటా…
సినిమాల్ని లోన్లు తీసుకుని మరీ చూడాలట… పైగా లోన్ యాప్స్ నుంచి కూడా… ఆహా, ఏం తెలివి..? సినిమాలో ఓ నటి పేరే సరిగ్గా పలకలేడు, పైగా తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసిందట… ఏం తెలిసింది..? అదేదో చెప్పి ఏడవచ్చుగా…!! తను నేరుగానే వైష్ణవి చైతన్యను ఉద్దేశించి విమర్శ చేస్తున్నాడు…
బేబీ సినిమాలో తనే కదా హీరోయిన్… నిజానికి ఆమె నటన కారణంగానే ఆ సినిమాకు నాలుగు డబ్బులొచ్చాయి… ఐనా ఈ ఏడుపు దేనికి..? (కమిట్మెంట్ల గొడవలా..?) దిక్కుమాలిన వ్యాఖ్యలు… ఈ సెకండ్ హీరోయిన్ కయదు లోహర్ హిందీ తెల్లతోలు బాపతు కూడా కాదు, ఓ అస్సామీ…
తెలుగులో గతంలో అల్లూరి అని ఏదో సినిమా చేసినట్టు గుర్తు… అసలు ఆమె చేసినవే నాలుగైదు సినిమాలు… నానా తిప్పలూ పడుతోంది అవకాశాల కోసం… మంచి మోడల్… సరే, ఏదో కూశాడు, తెలుగు నటులు వద్దు సరే..,
ఎవరో పరభాష తారల్ని తెచ్చుకున్నావు, నీ ఇష్టం, జనానికి నచ్చితే వోకే, లేదంటే తిప్పికొడతారు, లైలా సినిమాను కొట్టినట్టు… కానీ తెలుగు తారల్ని తీసుకుంటే మటుకు నాశనమైపోతార్రోయ్ అనే తలతిక్క సూత్రీకరణలు దేనికి…?! ఆ సినిమా ఫంక్షన్‌లో ఆ సినిమాకు సంబంధం ఏమాత్రం లేని ఆ వైష్ణవి ప్రస్తావన పరోక్షంగా తీసుకొచ్చి, ఎవరూ బుక్ చేసుకోకండి దెబ్బతింటారు అనే ఇన్‌డైరెక్టు పిలుపు దేనికి..?! ఆమె మీద ఇదేం కక్షసాధింపు..!?
https://www.facebook.com/share/v/19FBVMGTuM/?mibextid=D5vuiz
Share this Article