కామెడీయే దిక్కు… సినిమాల్లో ఎంతోకొంత ఉండాల్సిందే… లేకపోతే నడవవు… టీవీల్లోనూ అంతే… కామెడీ షోల మీద పడ్డాయి అన్ని టీవీలు… ఈటీవీలో జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మాటీవీలో కామెడీ స్టార్స్… ఇవే కాదు, ప్రతి షోలోనూ కామెడీ పడాల్సిందే… ఢీ డాన్స్ షో అయినా అంతే, సరిగమప మ్యూజిక్ షో అయినా అంతే… వావ్, క్యాష్, ఆలీతో సరదాగా… చివరకు ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో అయినా అంతే… సూపర్ క్వీన్స్, ఇస్మార్ట్ జోడీ… ఏ రియాలిటీ షో అయినా సరే…
ప్రతి టీవీ ఇప్పుడు రేటింగ్స్ పెంచుకోవడానికి కామెడీ కామెడీ అంటోంది… కమెడియన్లకు గిరాకీ పెరిగింది… అవకాశాలు వస్తున్నయ్… మగ కమెడియన్స్, ఆడ కమెడియన్స్, లేడీ గెటప్స్ అందరూ బిజీ… కానీ కొత్తవాళ్లు కావాలి… జబర్దస్త్‌లో నాణ్యత కొడిగట్టింది… చాలా స్కిట్స్ తోకపటాకుల్లా టప్మంటున్నయ్… స్కిట్స్ చూస్తే కాదు, మల్లెమాల కంపెనీ వాళ్లు పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తోంది… కొత్తవాళ్లు కావాలంటే ఎలా అనే ఆలోచన నుంచి తట్టిందే మరో ప్రోగ్రామ్… పేరు స్టాండప్ కామెడీ…
ఇంకెవరు..? మల్లెమాల కంపెనీయే దిక్కు… వాళ్లే స్టాండప్ కామెడీ షోను జాతిరత్నాలు పేరిట తీసుకొస్తున్నారు… శ్రీముఖిని హోస్ట్‌గా తీసుకున్నారు… బేసిక్‌గా తను స్పోర్టివ్, ఎనర్జిటిక్ యాంకరే… కానీ ఓ కామెడీ షోను ఎలా డీల్ చేయగలదో చూడాలి… మొత్తం పదివేల మందితో ఆడిషన్స్ నిర్వహించి, 3 వేల మంది దాకా మొదటి దశలో వడబోసి, చివరకు 60 మందిని ఎంపిక చేశారట… (ఆమధ్య జాతిరత్నాలు అనే కామెడీ సినిమా బాగా హిట్టయ్యింది కదా… అందుకే దీనికి ఆ పేరు పెట్టుకున్నారు… లోగో డిజైన్ కూడా దాదాపు సేమ్…)
Ads
ఆమధ్య రాజ్‌తరుణ్ సినిమా ఒకటి వచ్చింది, స్టాండప్ కామెడీ రాహుల్… ఫట్… అంతకుముందు మాటీవీలో బ్రహ్మానందం, తేజస్విలను పెట్టి లాఫర్ చాలెంజ్ అని ఓ షో చేశారు… అట్టర్ ఫ్లాప్… (నిజానికి బ్రహ్మానందం ఏ కామెడీ సీన్ అయినా అదరగొట్టేస్తాడు, కానీ స్పాంటేనియస్‌గా తను జోకులు చెప్పలేడు, ఎదుటివాళ్ల జోకులకు జోవియల్‌గా రియాక్ట్ కాడు… టీవీషోల హోస్టింగుకు సూట్ కాడు…) తరువాత నాగబాబు తన యూట్యూబ్ చానెల్లో స్టాండప్ కామెడీ కాంపిటీషన్ నిర్వహించాడు… అదీ పెద్దగా ఎవరూ దేకినట్లు లేరు… ఈ ఎగ్జాంపుల్స్ అపశకునం అని కాదు… కానీ తెలుగులో స్టాండప్ కామెడీ ఎందుకో పెద్దగా ప్రేక్షకుల్ని కనెక్ట్ కావడం లేదు…
అంత బలంగా జోక్స్ పండించేవాళ్లు లేకపోవడమా..? ప్రోగ్రాం డిజైనింగులో లోపమా తెలియదు కానీ… హిందీ, ఇంగ్లిషుల్లో బోలెడుమంది పాపులర్ స్టాండప్ కమెడియన్లు ఉన్నారు… టీవీలు, ఓటీటీలే కాదు, ప్రైవేటుగా స్టేజ్ షోలు కూడా చేస్తుంటారు… ఇవన్నీ సరే, ఇక్కడ ఓ ట్విస్టు ఉంది… ఈ కొత్త జాతిరత్నాలు రెగ్యులర్ ఈటీవీలో కనిపించరు… ఈటీవీ ప్లస్‌లో కనిపిస్తారు… ఎందుకు..? ఈ చార్ట్ చూడండి…
అసలు ఈటీవీయే మూడో ప్లేసుకు వెళ్లిపోయింది… మాటీవీతో పోలిస్తే చాలా దూరంలో నిలబడిపోయింది… ఇక ఈటీవీ ప్లస్ అయితే 12వ ప్లేసు… అంటే ఎవరూ దేకడం లేదని లెక్క… గతంలో పటాస్ అనే ఓ కామెడీ షో వచ్చేది… శ్రీముఖి చాన్నాళ్లు యాంకర్ రవితో కలిసి చేసింది ఈ షో… తరువాత బిగ్‌బాస్‌లోకి వెళ్తూ ఆ షో వదిలేసింది… ఏ ప్రోగ్రామూ చూడబుల్‌గా లేక నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది…
సో, దాన్ని కొంతైనా పైకి లేపాలి… దానికీ కామెడీనే నమ్ముకున్నది ఈటీవీ… మల్లెమాలకు ఆర్డర్ పెట్టింది… వాళ్లు ఈ జాతిరత్నాలను సప్లయ్ చేస్తున్నారు… అదీ సంగతి… ష్… కాస్త అభినయంతో, టైమింగుతో జోకులు చెప్పగలిగేవాళ్లు దొరికితే… ఇంకేం… జబర్దస్త్‌కు కమెడియన్ల కొరత కూడా తీరుతుంది… అఫ్కోర్స్, తరువాత అక్కడి నుంచి కామెడీ స్టార్స్‌కే కదా వెళ్లేది…!!
Share this Article