.
రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో చేసిందంతా కరెక్టే అని ఏపీ సీఎం, సదరు అర్జున్ దగ్గరి బంధువు పవన్ కల్యాణ్ సహా మెజారిటీ సమాజం సమర్థించింది కదా… అల్లు అర్జున్ డెమీ గాడ్ ధోరణికి సరైన శిక్ష అని కూడా అభిప్రాయపడింది కదా…
మరి అదే రేవంత్ రెడ్డి మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎందుకు కఠినంగా ఉండలేకపోతున్నాడు..? ఈ ప్రశ్న కూడా జనంలో చర్చనీయాంశమే… జర్నలిస్టుపై దాడి కేసులో కోర్టు తనకు బెయిల్ ఏమీ ఇవ్వలేదు, ఇద్దరు కొడుకులు కేసులు పెట్టుకుంటే బైండోవర్ చేశారు… కానీ మోహన్‌బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు..?
Ads
తనేమీ ఫోన్ ట్యాపింగ్ సూత్రధారిలాగా అమెరికా వెళ్లి తెలంగాణ పోలీసులకు దొరకని ముద్దాయి ఏమీ కాదు కదా..? పట్టుకోలేకపోతున్నారా..? తెలంగాణ పోలీసులకు చేతకాదా..? లేదా అల్లు అర్జున్ కేసులోలాగే ఏమైనా రాజీ బేరాలు, ప్రయత్నాలు ఆరంభమయ్యాయా..?
మోహన్ బాబు విజయ్ మాల్యాలాగా లండన్ వెళ్ళలేదు, నిత్యానందలాగా వేరే కైలాసం క్రియేట్ చేసుకోలేదు… ఈ చైనాయో రాజకీయ ఆశ్రయమూ ఇవ్వలేదు… మరి..??
ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరో టాస్క్… ఏమిటంటే..? మంచు విష్ణు సిబ్బంది తమ నివాసం జల్‌పల్లి పరిసరాల్లోని చిట్టడవుల్లో అడవి పందుల్ని వేటాడిన వీడియో బిట్ ఇప్పుడు మీడియాలో వైరల్… ఈ వేటకు బాధ్యులు మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రిషియన్ దేవేంద్ర ప్రసాద్ అట… మనోజ్ జనరేటర్‌లో చక్కెర పోసిన గత వివాదంలోనూ ఈ దేవేంద్రుడే పాత్రధారియా..?
అన్నట్టు ఈ చిన్న వీడియో బిట్ రికార్డ్ చేసి, మీడియాకు లీక్ చేసింది మంచు మనోజ్ టీమేనా..? అందుకే సోషల్ మీడియా వైరల్ పోస్టులో మంచు మనోజ్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్లు వినలేదు అనే వాక్యాలు కనిపిస్తున్నాయి…
సరే, దీంట్లో మా తప్పేమీ లేదు, ఈ వేటకు కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం, పోలీసులు కేసు పెట్టినా సహకరిస్తాం అని మోహన్‌బాబు లేదా విష్ణు ప్రకటిస్తారేమో… కానీ అసలే ఈ సినిమా హీరోలు, వాళ్ల బౌన్సర్లు, వాళ్ల స్టాఫ్ అరాచకాలు, మేమేం చేసినా మమ్మల్నెవరూ ఏమీ పీకలేరు అనే ధోరణి కనబరుస్తున్న నేపథ్యంలో ఈ తాజా వీడియో బిట్ మరింత పెట్రోల్ పోసినట్టయింది…
సినిమా హీరోలు నిజానికి రియల్ లైఫులో పెద్ద విలన్లు, వాళ్ల సిబ్బంది అంతకుమించిన రాక్షసగణం అనే విమర్శలకు మరింత సమర్థన ఇది… ఒరేయ్, ఎవర్రా మీరంతా..? మీరేం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాయా..? ధనమదం తమను ఆదుకుంటుందనే ధీమానా..? సెంట్రల్ క్రైమ్ పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి, ఈ ఇద్దరినీ అప్పగిస్తే జలపల్లి అడవుల్లో ఇంకెన్ని అరాచకాలు చేశారో, ఎవరి కోసం ఏమేం చేశారో బయటపడుతుంది…
ఇదుగో ఇక్కడే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి… మోహన్‌బాబు కుటుంబానికి ఈ కేసులో ప్రత్యక్ష సంబంధం ఉండదు కాబట్టి వెంటనే కేసు పెట్టిస్తాడా..? ఒకవేళ మోహన్‌బాబు కుటుంబం విందు కోసమే ఈ వేట చేసినట్టు గనుక ఆ సిబ్బంది కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి వాళ్లనూ బుక్ చేస్తాడా..? జర్నలిస్టు కేసులోనే ఏమీ పట్టించుకోవడం లేదు, దీన్ని పట్టించుకుంటాడా..? ఇవన్నీ ప్రశ్నలు…
రేప్పొద్దున ఇదే ఇండస్ట్రీలోని మోహన్‌బాబు వ్యతిరేకవర్గం ఇదే ప్రశ్నిస్తుంది… పైగా దిల్ రాజుకు పెద్దగా మోహన్‌బాబు బ్యాచుతో ఎప్పుడూ బాగున్నట్టు లేదు… మరోవైపు ఏప్రిల్‌లో విష్ణు అత్యంత భారీ ఖర్చుతో సర్వస్వం పణంగా పెట్టి తీస్తున్న కన్నప్ప సినిమా రిలీజు కానుంది… ఈ నేపథ్యంలోనే ఈ అడవి పందులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి…
ఇవేమీ కృష్ఝ జింకలు కాకపోవచ్చు… సల్మాన్‌ఖాన్‌లాగా మోహన్ బాబో లేక విష్ణో నేరుగా ఈ కేసులో ఇరుక్కోకపోవచ్చు… కానీ జరుగుతున్న పరిణామాలన్నీ విష్ణు వర్సెస్ మనోజ్ కథలో ట్విస్టులు… అంతేకాదు, మనోజ్ టీమ్ నుంచి ఇంకా చాలా రహస్యాలు రానున్నాయట… సీఎం సార్, మీరేమంటారు..? కాపులాగే కమ్మ కదా… రెడ్డి లేడు కదా… మరేమిటి ఈ వివక్ష..!!
Share this Article