ఆమధ్య చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న తరువాత త్రిష ఓ పదం వాడింది… పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ పోలేదు… ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేసింది…
అది ఓ బ్రహ్మ పదార్థం వంటి, భ్రమ పదార్థం వంటి పదం… సరిగ్గా ఇదీ దాని నిర్వచనం అని ఎవరూ చెప్పలేరు… కాకపోతే సినిమాల్లో ఎవరైనా ఆ పదం వాడితే… తప్పుకుంటున్నాను అని మర్యాదగా ఎక్స్‌ప్రెస్ చేసినట్టు లెక్క… మరి చిరంజీవి సినిమాను కాదంటే ఇండస్ట్రీలో మర్యాద దక్కదు కదా, కానీ ఆమె దక్కించుకుంది… సాయిపల్లవి అయితే ఆ మాట కూడా వాడలేదు… సింపుల్‌గా నేను నటించను అనేసింది అదేదో సినిమాకు అడిగితే…
బాలయ్యకు హీరోయిన్‌గా చేయమని అడిగినా సరే, పాపులర్ హీరోయిన్లు మొహాలు చాటేస్తున్నారని అప్పట్లో చాలా వార్తలొచ్చాయి… అచ్చు అన్‌స్టాపబుల్ చాట్ షోకు పెద్ద నటులు మొహాలు చాటేసినట్టు… ప్రస్తుతం ఆ షో పూర్తిగా ఆగిపోయింది… ఆహా మేనేజ్‌మెంట్ ఆ షో మస్తు హిట్ అని చెప్పుకున్నా సరే మూడో సీజన్ ముచ్చటే లేకుండా పోయింది…
Ads
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఉన్న పాపులారిటీ తెలుసు కదా… తనతో కలిసి పనిచేయడం అంటే భాగ్యంగా భావించేవాళ్లు ఉన్నారు… సేమ్, మహేశ్ బాబు సినిమాలో అవకాశం రావడం అంటేనే అదృష్టంగా భావిస్తారని మనం అనుకుంటాం కదా… కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతోంది…
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్‌తో రాబోయే గుంటూరు కారం సినిమాకు బాగా హైప్ ఇప్పటికే ఏర్పడి ఉంది… కానీ ఇందులో హీరోయిన్‌గా మొదట తీసుకున్న పూజా హెగ్డే ప్రాజెక్టు నుంచి తప్పుకుంది… కాదు, కాదు, సినిమా టీమే ఆమెను తీసేశారు అని ప్రచారం చేయబడింది… ఏదయితేనేం, ఈ సినిమాలో ఆమె లేదు… ఫైట్ మాస్టర్స్ తప్పుకున్నారు…
అప్పటికే సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ కాబడి ఉన్న శ్రీలీలను పూజా హెగ్డే పాత్రలోకి మార్చుకుని, శ్రీలీల పోషించాల్సిన పాత్రలోకి మీనాక్షి చౌదరిని తీసుకొచ్చారు… ఒకరకంగా మహేశ్ బాబు కోణంలో పర్లేదు… పూజా హెగ్డే ఇప్పుడు ఐరన్ లెగ్, రాంగ్ సెంటిమెంట్… శ్రీలీల ప్రస్తుతం టాప్ హీరోయిన్… గోల్డెన్ లెగ్ సెంటిమెంట్… పూజా హెగ్డే నెగెటివ్ గా ఏమీ రియాక్ట్ కాలేదు… ఎందుకో ఈ సినిమా విషయంలో సంగీత దర్శకుడు థమన్ కూడా అన్ హేపీగా ఉన్నాడుట… తను కూడా బయటికి వచ్చేసినట్టే అంటున్నారు…
ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం కదా… తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న వినోద్ కూడా ఎగ్జిటైపోయాడు… అదేమంటే ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అంటున్నాడట… అంటే సినిమా టీంతో నాకు పొసగదు, బయటికి వచ్చేశాను అని చెబుతున్నట్టు లెక్క… హీరోయిన్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ కంపోజర్… కీలకమైన వాళ్లే ఇలా మొహాలు చాటేస్తుంటే… అసలెక్కడ తేడా కొడుతుందో అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో ఒకటే గుసగుస… మహేశ్ బాబుతో ప్రాబ్లం ఏమీ ఉండదనీ, త్రివిక్రమ్ ధోరణితోనే సమస్య వస్తోందని అంటున్నారు… ఇదే వినోద్ చాన్నాళ్లుగా త్రివిక్రమ్‌తో పనిచేస్తున్నవాడే… మరి అకస్మాత్తుగా త్రివిక్రమ్‌కు ఏమైంది..?! నెక్స్ట్ ప్రాజెక్టు నుంచి తప్పుకునేది ఎవరు..? అదేనండీ, క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో…!!
Share this Article