Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే వన్ ప్లస్ టూ..! అదే త్యాగం..! అప్పట్లో ఇదే సగటు ఫార్ములా…!!

November 17, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. 1980 లో మహిళలకు నచ్చిన చిత్రం . వారు మెచ్చిన 1+2 సినిమా . తమిళంలో హిట్టయిన Ninaive Oru Sangeetham అనే సినిమాకు రీమేక్ 1988 ఫిబ్రవరిలో వచ్చిన ఈ దొంగపెళ్ళి సినిమా . తమిళంలో విజయకాంత్ , రాధ నటించారు …

ఆనం గోపాలకృష్ణారెడ్డి నిర్మాతగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ దొంగపెళ్ళి సినిమా కధ ఏంటంటే… ఓ గ్రామంలో శోభనాద్రిలాంటి సోగ్గాడు ఉంటాడు . అతనికి ఓ మంచి అక్క , ఓ బేవార్స్ బావ , ఓ అందమైన మేనకోడలు ఉంటారు . మేనకోడలు మేనమామ మీద మనసు పారేసుకుంటూ ఉంటుంది .

Ads

ధనాలున పట్టణం నుంచి టీకాలు వేయటానికి ఓ డాక్టరమ్మ వస్తుంది . ఆమెకు మన సోగ్గాడికి ముందు ఘర్షణలు అయినా సరే, తర్వాత ప్రేమ చిగురించి, పెళ్లి చేసుకోవటానికి సిధ్ధపడతారు . మేనకోడలు మోసం చేసి తాళి కట్టించుకుంటుంది . మేనమామకు కోపం వచ్చి దూరంగా ఉంటాడు .

డాక్టరమ్మ సోగ్గాడికి నచ్చచెప్పి పెళ్ళయిన జంటను దగ్గరకు చేరుస్తుంది . కానీ ఆమెకు బ్రైన్ ట్యూమర్ కావటంతో ఆమె పాత్ర ముగియవలసి వస్తుంది . చనిపోతూ డాక్టరమ్మను సోగ్గాడిని కలిపి నిష్క్రమిస్తుంది . ఇలాంటి సోగ్గాడి పాత్రలు శోభన్ బాబుకు కొట్టిన పిండేగా . బాగా నటించారు .

మేనకోడలుగా విజయశాంతి , డాక్టరమ్మగా సుమలత చాలా అందంగా , చాలా బాగా , పోటాపోటీగా నటించారు . అక్కాబావలుగా అన్నపూర్ణ , గొల్లపూడి మారుతీరావు బాగా నటించారు . ఇతర ముఖ్య పాత్రల్లో గిరిబాబు , సుత్తి వేలు , ఆలీ , వై విజయ , నర్రా , ఈశ్వరరావు , ప్రభృతులు నటించారు … (వై విజయ ఉండాల్సిందే కదా ప్రతి సినిమాలో అప్పట్లో…)

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగుంటాయి . వేటూరి , సి నారాయణరెడ్డిలు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . శోభన్ బాబు , సుమలత మీద చిత్రీకరించబడిన మనసెవరో అడిగారు పాటను బాలసుబ్రమణ్యం , జానకమ్మ చాలా శ్రావ్యంగా పాడారు .

ప్రేమ కన్ను కుట్టి పోయిందమ్మా , వెన్నెల్లో పక్కనుంటే చందమామ , చిన్నట్టు పెద్దట్టు డ్యూయెట్లు శోభన్ బాబు , విజయశాంతి మీద హుషారుగా ఉంటాయి . వెన్నెల్లో పక్కనుంటే చందమామ చివర్లో విషాద గీతంగా కూడా వస్తుంది . రవిరాజా పినిశెట్టి పాటలను బాగా చిత్రీకరించారు .

సినిమాలో అన్నపూర్ణ పాత్ర , ఆమె నటన రెండూ గొప్పగా ఉంటాయి . బేవార్స్ మొగుడికి విధవగా దుస్తులు మార్చుకుని వచ్చే సీనులో గొప్పగా నటించింది . సత్యానంద్ డైలాగులను బాగా వ్రాసారు . సినిమా యూట్యూబులో ఉంది . పూర్తి సంసారపక్ష సెంటిమెంటల్ 1+2 సినిమా . ఇంతకుముందు చూడనట్లయితే చూడవచ్చు . చూడబులే .

నేను పరిచయం చేస్తున్న 1168 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు #సినిమా_స్కూల్ ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదే వన్ ప్లస్ టూ..! అదే త్యాగం..! అప్పట్లో ఇదే సగటు ఫార్ములా…!!
  • ఏమంటవ్ గంభీర్..? మనం పన్నిన ‘పిచ్చు’పై మనమే బోల్తా అన్నమాట..!!
  • అగ్నితుఫాన్లన్నీ చల్లగా, చప్పగా ‘ఇల్లు’ వదిలి నిష్క్రమించాయి..!!
  • మరో పొలిటికల్ బిడ్డ కుటుంబానికి దూరం… ఎవరు ఈ బీహారీ కవిత..?!
  • జై వారణాసి శ్రీరామ్..! ఉన్నారో లేదో తెలియని దేవుళ్లూ దిగిరావల్సిందే..!!
  • నేరాలు చేసేవాడు పెళ్లాంతో బాగుండాలి… లేకపోతే కొంప ఖల్లాసే…
  • సాలు మరద తిమ్మక్క… 114 ఏళ్ల బతుకంతా పచ్చటి చెట్ల వరుసలే…
  • ఓహ్…! జుబ్లీ హిల్స్‌లో ఓడింది జగన్ రెడ్డి… గెలిచింది చంద్రబాబా..?!
  • అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?
  • సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions