నిజానికి ఆహా ఓటీటీలో కంటెంటు క్వాలిటీ మీద ఎప్పుడూ ఓరకమైన అసంతృప్తి ఉంటుంది ప్రేక్షకులకు… ప్రత్యేకించి వాళ్ల సొంత ప్రోగ్రాములు అప్‌టుమార్క్ ఉండవనేది ఓ ఫీలింగ్… కాకపోతే తెలుగులో ఉన్న ఏకైక ఓటీటీ అది,.. అయితే పలు మైనస్ పాయింట్లను కూడా దాటేసి ‘తెలుగు ఇండియన్ ఐడల్’ బాగున్నట్టనిపిస్తోంది… కారణం..?
చాలా పరిమితమైన ఆర్కెస్ట్రా, ఆకర్షణీయంగా లేని సెట్, ప్రజెంటేషన్ కోణంలో కాస్త దిగదుడుపే అనిపించినా… కొన్ని ప్లస్ పాయింట్లు షోను ఆసక్తికరంగా మార్చేస్తున్నయ్.., అందులో ప్రధానమైంది కంటెస్టెంట్ల ఎంపిక… మాంచి మెరికల్ని, అనగా మెరిటల్ని సెలెక్ట్ చేశారు… జడ్జిగా థమన్ సరదాగా పార్టిసిపేట్ చేయడం, నిత్య, కార్తిక్ కూడా సరిగ్గా జతకలవడం, వీళ్లకుతోడు శ్రీరాంచంద్ర హుషారైన యాంకరింగు, పాటల నడుమలో ఫన్నీ చిట్‌చాట్ బాగుంటున్నయ్…
ఇది మెయిన్ స్ట్రీమ్ టీవీ చానెళ్లు జీతెలుగు, ఈటీవీకి ఎందుకు చేతకావడం లేదు..? ఈ షో గురించి చెప్పాల్సి వస్తే… లేడీ సింగర్సే బాగా పాడుతున్నారు… కంపేరిటివ్‌గా… ప్రణతి, వాగ్దేవి, మాన్య, వైష్ణవి, లాలస, అదితి, శ్రావణి… అందరూ…! ఉగాది స్పెషల్ ఎపిసోడ్‌లో నచ్చింది ఏమిటీ అంటే… వైష్ణవి పర్‌ఫామెన్స్… ఈ ఇండియన్ ఐడల్‌లో ఓ షణ్ముఖప్రియలాగే అనిపిస్తోంది… ఎందుకంటే..?
Ads
షణ్ముఖ కూడా కేవలం ఒరిజినల్ పాట పాడటానికి గాకుండా… సొంతంగా కొంత వాల్యూ యాడిషన్ చేసేది… ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లిపోయేది… మెప్పించేది… ప్రయోగాన్ని ఇష్టపడుతుంది… సేమ్, వైష్ణవి కూడా… చెన్నైకి చెందిన ఈమె వయస్సు కూడా షణ్ముఖ వయస్సే… అయితే వైష్ణవికి పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే… కల్పన రాఘవేందర్ తనకు గురువు… కల్పన గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది..? జెమ్… రాక్షసి… వైష్ణవికి ఈ షో మొదటిదేమీ కాదు, గతంలోనూ పలు కంటెస్టుల్లో పాల్గొంది… ‘‘పాడతా తీయగా’’లో సైతం…
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ‘అధరమదోలా అదిరినదేలా’ అనే పాట ఉంది… శ్రేయా ఘోషల్, బాలు పాడారు… కాస్త స్వరాలు, సంగతులు, తాళం, శృతి గట్రా ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి… దానికి కల్పన సహకారంతో కొత్త ఆలాపనను యాడ్ చేసి వైష్ణవి పాడిన తీరు మెప్పించింది… ఈ సినిమాలో హీరో బాలయ్య కదా… ఈ ఉగాది ఎపిసోడ్ ఎందుకో బాలయ్య చుట్టూ తిరిగింది… అనూహ్యంగా…
ఎందుకో మరి, కంటెస్టెంట్లకు స్వీట్ బాక్సులు పంపించాడు బాలయ్య… పైసా వసూల్ అనే బాలయ్య పాటను పాడాడు మరో సింగర్… విరిసినదీ వసంతగానం పాడింది మరో సింగర్… ఇది భైరవద్వీపంలోనిది… అనుకోకుండా సాగిన ఎంపిక చేసుకోబడిన సాంగ్సే ఇవి… ఈ పాట విని థమన్ తన పాతరోజుల్లోకి వెళ్లిపోయాడు… ‘‘9 ఏళ్ల వయస్సులో నేను భైరవద్వీపం పాటకు డ్రమ్స్ వాయించాను, 30 రూపాయల పారితోషికం ఇచ్చారు… మా ఫాదర్ పలు వాయిద్య పరికరాలను వాయించేవాడు…
శివమణి మా ఫాదర్ శిష్యుడు… ఆ పాట దగ్గర మొదలైన నా ప్రయాణం ఇక్కడి దాకా వచ్చింది… నాటి భైరవద్వీపం నుంచి ఏదో ఎమోషనల్ బాండ్ బాలయ్యతో ఏర్పడిపోయింది… అఖండ బీజీఎం ఆ రేంజులో రావడానికి కూడా ఏదో తెలియని ఓ ఎమోషనల్ కనెక్షనే కారణం అనిపిస్తుంది నాకు… భైరవద్వీపం పాట తరువాత కొన్నాళ్లకే మా ఫాదర్ చనిపోయాడు… అందుకే ఈ పాటతో నాకు ఏదో చెప్పలేని బంధం…’’
నచ్చిన మరోవిషయం ఏమిటంటే… జస్‌కరణ్ అనే నార్త్ ఇండియన్ సింగర్… పంజాబీ… తనకు తెలుగు అస్సలు రాదు… పలకడమే కాదు, తెలుగు ఎవరైనా మాట్లాడుతుంటే అర్థం కూడా కాదు… అలాంటిది తెలుగు పాటల్ని సాధన చేసి, తెలుగు వచ్చిన గాయకులకు దీటుగా పాడి, టాప్ 12 లోకి రావడం ఓ విశేషం… అఫ్‌కోర్స్, ఫస్ట్ ఎలిమినేషన్ తనదే… అయితేనేం… అదొక ఆట… గెలుపో ఓటమో… బరిలోకి దిగే చాన్స్ రావడమే ఓ గెలుపు కదా…!!
Share this Article