అపజయాన్ని స్వీకరించాలి… కారణాల్ని అన్వేషించాలి… భవిష్యత్తుకు దిద్దుకోవాలి… ఇది ఎవరికైనా వర్తించే సహజ సూత్రం… సినిమాల విషయానికొస్తే భారీ అంచనాలున్న సినిమాల్ని ప్రేక్షకులు తిరస్కరించడం కొత్త కాదు… మామూలు సినిమాలను కూడా కొన్నిసార్లు సూపర్ హిట్ చేయడం కూడా కొత్తేమీ కాదు… ఆచార్య డిజాస్టర్‌కు కారణాలెన్నో, కారకులెందరో… చిరంజీవికి కూడా సూపర్ ఫ్లాపులు కొత్తేమీ కాదు…
అయితే సినిమా ఎలా ఉన్నా సరే, తమ హీరో సినిమా చూడాల్సిందేననే అభిమానం కొందరిలో ఉంటుంది… తెర మీద తమ హీరో కనిపిస్తే చాలు, అదొక ఆనందం… తమిళంలో రజినీకాంత్‌కు, తెలుగులో చిరంజీవికి ఆ పాపులారిటీ ఉంది… కానీ ఆచార్య సినిమాకు వచ్చేసరికి అదీ కనిపించడం లేదు… అంటే ఏదో భారీగా తేడా కొట్టేసింది అని లెక్క…
తాజాగా వినవస్తున్న సమాచారం ఏమిటంటే..? రేపటి నుంచి మెజారిటీ థియేటర్ల నుంచి ఆచార్యను ఎత్తేసి, కేజీఎఫ్-2 ఆడిస్తారట… అంటే ఇంతగా జగన్‌ను బతిమిలాడి టికెట్ల రేట్లు పెంచుకున్నా సరే, ఏమాత్రం ఫలితం లేకుండా పోతోందన్నమాట… ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ కారణంగా ఆచార్యకు పెద్ద సంఖ్యలో థియేటర్లు కూడా దొరకలేదు… సంఖ్య తెలియదు గానీ, ఆ థియేటర్లలో కూడా అధికశాతం ఆచార్య కనిపించబోవడం లేదు…
Ads
చిరంజీవి అంటే క్రేజ్ ఉన్న జిల్లాల్లో కూడా కొన్ని థియేటర్లలో కనీసం బ్యానర్లు కూడా కట్టలేదు అంటే చాలాచోట్ల అభిమానులు కూడా సినిమాను ఓన్ చేసుకోలేదని అర్థం… చిరంజీవి పదే పదే జగన్ దగ్గరకు వెళ్లడం, మరీ ఓ వీడియోలో చేతులు జోడించిన తీరు తన అభిమానులకు కూడా నచ్చలేదనే ఓ విశ్లేషణ వినిపిస్తోంది… పైగా సినిమా కూడా బాగోలేకపోవడం మరో పెద్ద దెబ్బ…
వాస్తవంగా మొత్తం కొరటాల శివనే పాపాల భైరవుడిని చేయడం కరెక్టు కాదు… చిరంజీవి తన సినిమాలకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తాడు… సూచనలు చేస్తాడు… పూర్తిగా దర్శకుడి మీద వదిలేయడు… ప్రత్యేకించి పాటలు, క్లైమాక్స్, తన ఇమేజీకి సంబంధించిన అంశాల్ని చూసుకుంటాడు… సో, కొరటాలది మాత్రమే పూర్తి బాధ్యత కాదు… నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు అనే ఫార్ములా ఇప్పుడు నడవడం లేదని చిరంజీవి గుర్తించలేదు… పైగా సినిమాలో రొమాన్స్ లేదు, కామెడీ లేదు, ఎమోషన్ లేదు, కొత్తదనం లేదు…
సాధారణంగా చిరంజీవి సినిమా అంటే అల్లు అరవింద్ నిర్ణయాధికారాలు ఉంటాయి… ఉండేవి… ఆచార్య సినిమాకు సంబంధించి ఏ అంశంలోనూ అల్లు అరవింద్ కలుగజేసుకోలేదట… సినిమా బిజినెస్ విషయంలో అరవింద్ సిద్ధహస్తుడు.,. ఇప్పుడిక చాలా థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేస్తే ఆశించిన కనీస కలెక్షన్లకు కూడా భారీగానే లోటు తప్పదన్నమాట… ట్రిపుల్ ఆర్ అత్యంత భారీ వసూళ్ల రేంజ్ నుంచి ఒక్కసారిగా రాంచరణ్ ఎక్కడికి దిగిపోయినట్టు..?!
Share this Article