నిజానికి ఒక చిరంజీవినో, ఒక రాంచరణ్‌నో చూసి జాలిపడాల్సిన అంశమేమీ కాదు ఇది… ఇది ఇప్పుడు జనరల్ ట్రెండ్ అయిపోయింది… మనం గతంలో పలుసార్లు చెప్పుకున్నాం… ప్రేక్షకులు టీవీల ఎదుట కూర్చుని, గంటల తరబడీ యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే కాలం పోయింది అని..! అదే నిజం, మళ్లీ అదే నిరూపితం అయ్యింది… ఆచార్య సినిమాకు మరీ దారుణంగా 6.3 రేటింగ్స్ వచ్చినయ్…
వాస్తవానికి ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే… ఎందుకంటే..? రెండు కారణాలు… ఒకటి సినిమా సంబంధితం… రెండు జనరల్ ట్రెండ్… సినిమా బోర్… బిల్డప్పులు ఎక్కువై పోయి జనం ఛీత్కరించేశారు… మరీ ఘోరంగా చిరంజీవి తన సినిమాకు సంబంధించి డబ్బులు వాపస్ ఇవ్వడం ఇదే తొలిసారి కావచ్చు… అదీ తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించిన సినిమా… సరే, అందరూ కలిసి ఫాఫం, దర్శకుడిని బకరాను చేసి, నీదేరా తప్పు అని ముద్ర వేశారు… అదంతా వేరే కథ…
థియేటర్లలో ఆ సినిమా ఫెయిల్ కావడం, మౌత్ టాక్ కూడా దారుణంగా ఉండటం, ఎలాగూ ఓటీటీలోకి వస్తుండటం… అక్కడక్కడా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూడొచ్చులే అనుకున్నవాళ్లు టీవీల్లో ఆ సినిమా వీక్షణాన్ని లైట్ తీసుకున్నారు… అసలు ఈ సినిమా అనే కాదు, పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకూ ఇదే గతి… రాబోయే రోజుల్లో ‘‘వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్’’ అనే ప్రసారాలు ఇక ఉండకపోవచ్చు… అంతేకాదు, ఇప్పుడంటే శాటిలైట్ టీవీలు సినిమాలను కొంటూ చేతులు మూతులు కాల్చుకుంటున్నయ్… ఇకపై టీవీ రైట్స్ కొనుగోళ్లు ఉండకపోవచ్చు…
Ads
ఇప్పటికే టీవీ రైట్స్ రేట్లు దారుణంగా తగ్గుముఖం పట్టాయి… జెమిని వాడికి కాస్త బుర్ర తక్కువ కదా… ఆచార్యను కాస్త ఎక్కువ రేటుకే కొన్నట్టున్నాడు… హైదరాబాద్ కేటగిరీ బార్క్ రేటింగ్స్‌లో మరీ 5.52 రేటింగ్స్ వచ్చినయ్… దారుణమైన రేటింగ్స్… చిన్నాచితకా పాత సినిమాలు ఓటీటీలో దొరకవు కాబట్టి, అవి టీవీల్లో వస్తుంటే కొందరు చూస్తుంటారు… అదుగో, వాటికి వస్తాయి ఇలాంటి రేటింగ్స్…
ఓటీటీలు వచ్చాయి కాబట్టి ఇక టీవీల్లో సినిమాలు చూడటం మానేస్తున్నారనే ట్రెండ్ నిజమే అయినా… ఆచార్య వంటి సినిమాలకు వాటి మైనస్ పాయింట్లు కూడా కొంత దెబ్బే… ఆ మైనసులేమిటో మళ్లీ ఇక్కడ చర్చ వేస్ట్… చిరంజీవి వాటినేమీ పట్టించుకోడు, తనేమీ మారడు… మారాలని కూడా అనుకోవడం లేదు… కానీ ఆచార్య, గాడ్ ఫాదర్ వరుస ఫెయిల్యూర్లతో చిరంజీవి తదుపరి సినిమాకు బిజినెస్ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది… అబ్బే, బయ్యర్లకు ఇవ్వలేదు అని గాడ్ ఫాదర్ నిర్మాతను తెర మీదకు తీసుకొచ్చి ఏదో చెప్పించారు, ఆ సినిమా బిజినెస్ ఏమిటో ఎవరికీ అర్థం కాని చిక్కుముడిలా మార్చేశారు… అంత అవసరమా..?
అసలు ముక్కుతూ మూలుగుతూ కుంటుతున్న గాడ్‌ఫాదర్ సినిమాపై కాంతార సినిమా పిడుగులా పడింది… గాడ్ ఫాదర్ తీసేసి, ఆ థియేటర్లలో కాంతారను వేశారు… దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది అల్లు అరవింద్… ఈమధ్య ఇద్దరికీ బాగా లేదు… అందుకేనేమో రజినీకాంత్ వంటి సూపర్ స్టార్లు కూడా రిషబ్ శెట్టిని ఇంటికి పిలిచి, ఆలింగనం చేసుకుని, అభినందిస్తుంటే… చిరంజీవి నుంచి ఉలుకూ పలుకూ లేదు… లేదు…!! సర్లెండి, ఆచార్య రేటింగులకూ ఈ సోదికి సంబంధం లేదు, కానీ ప్రస్తావన వచ్చింది కదాని చెప్పుకోవడం… అంతే…!!
Share this Article