Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సచ్చింది గొర్రె… కేజ్రీవాల్‌కు మరో షాక్… మీడియా సంస్థలకూ తలపోటు…

July 5, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి …… ఢిల్లీ – మీరట్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (Delhi-Meerut Regional Rapid Transit System (RRTS) project)పేరుతో ఢిల్లీని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ,మీరట్ లని కలుపుతూ రైలు మార్గం నిర్మిస్తున్నాము అంటూ కేజ్రీవాల్ అట్టహాసంగా ప్రకటించాడు మూడేళ్ళ క్రితం. ఇక ప్రకటనలతో హోరెత్తించాడు. అట్టహాసంగా ప్రకటించాడు కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి అంటే వేల ఎకరాలు భూమిని ప్రజల దగ్గర నుండి సేకరించాలి. దీనికోసం హీనపక్షం లక్ష కోట్లు అవసరం ఉంటుంది. కానీ ఉచిత పథకాలతో ఢీల్లీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. గత పదేళ్ళలో కేజ్రీవాల్ ప్రభుత్వ హాస్పిటల్ కానీ, కొత్త స్కూల్ కానీ, కనీసం కొత్త ఫ్లయ్ ఓవర్ కానీ కట్టలేదు కానీ రాపిడ్ రైల్ ప్రాజెక్టు ప్రకటిoచాడు…

***********************

అసలు విషయం ఏమిటంటే… ఢీల్లీ నుండి ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో RRTS ప్రాజెక్టు అమలు చేయడం కోసం National Capital Region Transport Corporation (NCRTC) తో కలిసి కేంద్ర ప్రభుత్వం, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి నిర్మిస్తాయి. ఢిల్లీ^ మీరట్ కారిడార్ ఇప్పటికే నిర్మాణంలో ఉంది. ఈ కారిడార్ కోసం ఢిల్లీ ప్రభుత్వం 1180 కోట్లు ఇస్తాను అని అగ్రిమెంట్ చేసుకున్నది కానీ ఇంకో రెండు కారిడార్లు అయిన ఢిల్లీ – ఆళ్వార్- పానిపట్ లకి నిధులు ఇవ్వలేనని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి తెలిపింది. దీని కోసం 5000 కోట్లు ఢిల్లీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఆ ఖర్చుని కేంద్ర ప్రభుత్వాన్ని భరించాల్సిందిగా అభ్యర్ధించాడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.

Ads

సుప్రీం కోర్టు ఇద్దరు సభ్యుల బెంచ్ ఈ కేసుని విచారిస్తున్నది. ఈ మొత్తం ప్రాజెక్టుని సుప్రీం కోర్టు పర్యవేక్షణలో National Capital Region Transport Corporation (NCRTC) నిర్మిస్తున్నది. MC మెహతా అనే వ్యక్తి ఢిల్లీ కాలుష్యం మీద ప్రజా ప్రయోజన వాజ్యం వేసాడు సుప్రీం కోర్టులో. రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు ఢీల్లీకి వచ్చి వెళుతుంటారు కాబట్టి వేలాది వాహనాలు ఢిల్లీ వచ్చి వెళుతుండడం వలన ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో రాపిడ్ రైల్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది.

********************

అయితే ప్రజా ప్రయోజనం కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుల కోసం ఢిల్లీ తప్ప మిగిలిన రాష్ట్రాలు తమ వాటా నిధులని ఇస్తున్నాయి. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉండడానికి కారణాలు ఇలా ఉన్నాయి:

1. ఈ ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వడానికి కేజ్రీవాల్ ఎదో ఒక పేచీ పెడుతూనే వచ్చాడు.

2.ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం అంటూ ఎన్విరానమెంటల్ కాంపన్సేషన్ చార్జెస్ పేరుతో (ECC) ప్రత్యేక పన్ను వసూలు చేస్తున్నాడు కేజ్రీవాల్. గూడ్స్ వాహనాలు, ఇతర కమర్షియల్ వాహనాల నుండి ECC వసూలు చేస్తున్నారు.

3. ECC ద్వారా వసూలు చేస్తున్న పన్ను మొత్తం నుండి మొదటి విడత RRTS కి నిధుల కింద 265 కోట్లు ఇచ్చాడు కేజ్రీవాల్… దీనికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

4. మా దగ్గర నిధులు లేవు అంటూ మరో 500 కోట్లు ECC నిధుల నుంచి చెల్లించడానికి గత ఏప్రిల్ నెలలో మళ్లీ అభ్యర్ధించాడు కేజ్రీవాల్… దానికీ కూడా అంగీకరించింది కోర్టు.

5. మిగతా ఇన్‌స్టాల్‌మెంట్ కూడ ECC నిధుల నుండి ఇవ్వడానికి కోర్టు అనుమతి కోరడంతో… కోర్టు ఆగ్రహంతో తిరస్కరిస్తూ అసలు RRTS తో పాటు ఇతర పథకాల ప్రకటనల కోసం ఎంత ఖర్చు పెట్టారో రెండు వారాలలోపు అఫిడవిట్ ఇవ్వమని కేజ్రీవాల్ ని ఆదేశించింది.

6. మొత్తం మూడు సంవత్సరాల్లో ప్రకటనలకి ఎంత ఖర్చు చేసాడో కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది.

7. కోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది: ప్రకటనల కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సిందిగా సదరు మీడియా సంస్థలకి ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది సుప్రీం కోర్టు.

8. గత మూడేళ్ళలో ప్రజాధనాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనల రూపంలో మీడియా సంస్థలకి పందేరం చేశాడో మరో రెండు వారాలలోపు తెలిసి పోతుంది.

9. ఒకవేళ కేజ్రీవాల్ కనుక లెక్కలు తక్కువ చేసి చూపిస్తే, అసలు లెక్కలు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉన్నాయి కాబట్టి అది కోర్టు ధిక్కారం అవుతుంది.

10. ఎలా చూసినా కేజ్రీవాల్ ప్రమాదంలో ఉన్నట్లే! సుప్రీం కోర్ట్ కనుక ప్రకటనల కోసం మీడియా సంస్థలకి చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయమని ఆదేశాలు జారీ చేస్తే కనుక ముందు ముందు మీడియా సంస్థలు AAP ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను తీసుకోవు.

***********************

కాలుష్య నియంత్రణ కోసం అంటూ ECC రూపంలో వసూలు చేస్తున్న ప్రత్యేక సెస్ ని కాలుష్య నివారణ కోసం వాడకుండా, వాటిని దారి మళ్లించి మీడియా సంస్థలకి తన ప్రచారం కోసం వాడాడు అనే ఆరోపణలు ఉన్నాయి కేజ్రీ మీద. లిక్కర్ స్కామ్ కంటే ఈ కేసులో కోర్టు నుండి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాడు కేజ్రీవాల్!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions