క్రిమినల్ కేసులు పెడుతూ… భావప్రకటన స్వేచ్ఛను హరించకండిరా బాబూ అంటూ సుప్రీంకోర్టు ఓ మహిళా జర్నలిస్టుపై పెట్టిన కేసుల్ని శుక్రవారం కొట్టిపారేసింది… భావవ్యక్తీకరణ హక్కు దిశలో మరో ఇంట్రస్టింగ్ కేసు ఇది… ఎందుకంటే..? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక జర్నలిస్టుపై పెట్టిన కేసును హైకోర్టు సమర్థించగా, సుప్రీం మాత్రం ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేసింది… నిజానికి ఆమెపై పెట్టిన కేసు జర్నలిజానికి సంబంధం లేదు… సోషల్ మీడియా పోస్టు… అంటే ఈ కేసును సోషల్ మీడియా ప్లస్ జర్నలిజం బాపతు భావవ్యక్తీకరణ కోణంలో చూడాలన్నమాట… అసలు కేసు వివరాల్లోకి వెళ్దాం… ఆమె పేరు పత్రీసియా ముఖిమ్… పద్మశ్రీ పురస్కార గ్రహీత… ది షిల్లాంగ్ టైమ్స్‌కు ఎడిటర్… మొన్నటి జూలైలో, మేఘాలయలో ఓ సంఘటన గురించి ఆమె ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది… ఒక ట్రైబల్ డామినేటెడ్ ఏరియాలో ఆడుకుంటుంటే నాన్-ట్రైబల్స్‌పై ఐరన్ రాడ్లతో దాడి చేశారు… అక్కడి సామాజిక పెద్దల కమిటీ (Dorbar Shnong)ని దీనిపై ప్రశ్నిస్తూ… ఈ పోస్టుకు ముఖ్యమంత్రి సంగ్మాను కూడా ట్యాగ్ చేసింది… దీని మీద ఆ కమిటీ నిర్ణయం మేరకు కేసు నమోదైంది… సామాజిక అశాంతి రేపటానికి ప్రయత్నిస్తున్నదనేది ఆమెపై పెట్టబడిన కేసులో ఆరోపణ…
హైకోర్టు కూడా ఆమెను తప్పుపట్టింది… ఆ కేసు కొట్టేయాలని ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను మేఘాలయ కోర్టు కొట్టేసింది… ఈమె తరువాత ఏం చేసిందంటే… జర్నలిస్టు సమాజం మద్దతు కోరింది… సదరు కోర్టు ఆర్డర్ కాపీని ఎడిటర్స్ గిల్డ్‌కు పంపించి, తనకు అండగా నిలవాలని కోరింది… కానీ పెద్దగా స్పందన రాలేదు… అసలు ఎడిటర్స్ గిల్డ్ అనేది ఎప్పుడో తన విలువను కోల్పోయింది… అదీ ఓ ట్రేడ్ యూనియన్ తరహాలోకి మారిపోయింది… అది కోర్టు ఆదేశం… అది కరెక్టు కాదని భావిస్తే ఆమె ఇంకా పైకోర్టుకు వెళ్లాలి… అంతేతప్ప దీన్ని పాత్రికేయం మీద దాడిగానో, భావప్రకటన స్వేచ్ఛకు ప్రతిబంధకమనో భావించలేం కదా… ఇది సోషల్ మీడియా ఇష్యూ కదా… ఎడిటర్‌ను కదా, నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాను అంటే కుదరదు కదా… అన్నట్టుగా సైలెంటుగా ఉండిపోయింది…
Ads
దీంతో ఆమెకు బాగా కోపమొచ్చేసింది… ‘‘గిల్డ్ సభ్యురాలిని, నాకు ఇబ్బంది వస్తే అండగా ఉండరా..?’’ అంటూ వెంటనే రాజీనామా చేసేసింది… ఇదేమిటమ్మా అంటే… ‘‘ఇదో డొల్ల గిల్డ్… వీళ్లకు ఎంతసేపూ సెలబ్రిటీ ఎడిటర్లు, యాంకర్లు మాత్రమే కావాలి… నాలాంటి ఎడిటర్లకు వీళ్లు చేసే సాయం ఏమీ ఉండదు… అంతెందుకు, ఆ ఆర్నబ్ గోస్వామి అసలు గిల్డ్ సభ్యుడే కాదు కదా, పైగా ఈ గిల్డ్‌కు వ్యతిరేకి కదా… తనపై మహారాష్ట్ర పోలీసులు వేధింపులకు దిగితే… అరెస్టు చేస్తే, ఇదే గిల్డ్ తనకు మద్దతుగా లేఖ రాసింది… మరి నా విషయంలో ఎందుకు స్పందించలేదు..?’’ అని ఆరోపించింది… సుప్రీం వెళ్లి కొట్లాడింది… మొత్తానికి సుప్రీంలో ఆమె వాదన నెగ్గింది… మేఘాలయ ప్రభుత్వం పెట్టిన కేసును తప్పుపట్టింది… ‘‘ఒక గ్రూపును కాపాడండి అని అడిగితే అది మరో గ్రూపుపైకి రెచ్చగొట్టడం, సామాజిక అశాంతిని ఎగదోయడం ఎలా అవుతుంద’’ని ప్రశ్నించింది… భావ ప్రకటన స్వేచ్ఛ మరోసారి గెలిచింది… అవునూ… ఆమెకు మద్దతుగా నిలబడకపోవడంలో ఎడిటర్స్ గిల్డ్ తప్పు చేసిందా..? లేక కరెక్టేనా..?!
Share this Article