Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అస్సోం మహిళ… గుజరాత్ వరుడు… కొన్నాళ్లకు ఆమె గురించి తెలిసి నిర్ఘాంతపోయాడు…

February 20, 2023 by M S R

గుజరాత్‌లోని పోర్‌బందర్… ఆయన పేరు విమల్ కరియా… పెళ్లి కాలేదు అప్పటికి… రకరకాల మేట్రిమోనీ సైట్లను చూస్తున్నాడు కానీ ఎవరూ మ్యాచ్ కావడం లేదు… ఇక ఇతర రాష్ట్రాల మ్యాచులు చూడసాగాడు… ఒక అమ్మాయి పాజిటివ్‌గా రియాక్టయింది… ఆమె పేరు రీటా దాస్… ఉండేది అస్సోం రాజధాని గౌహతి… ఇంటరాక్షన్ పెరిగింది…

ఆమె తన ప్రొఫైల్‌లో డైవోర్సీ అని రాసుకుంది… ఆ డైవర్స్ సర్టిఫికెట్ నాకు చూపించాల్సిందిగా విమల్ కోరాడు ఆమెను… ఎహె, నా మొదటి పెళ్లి ఓ మారుమూల పంచాయతీలో జరిగింది… పెళ్లి రిజిస్ట్రేషన్ లేదు, విడాకుల కోసం దరఖాస్తూ లేదు, జస్ట్ విడిపోయాం, అంతే అన్నదామె… తను నమ్మాడు… ఇద్దరూ అహ్మదాబాద్‌లో పెళ్లికి రెడీ అయిపోయారు…

తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని చెప్పిందామె మొదట… నా అన్న, నా చెల్లి ఊళ్లో కూలీ పని చేస్తుంటారనీ చెప్పింది… ‘‘మా అమ్మకు ఆరోగ్యం బాగుండదు, వాళ్లు పెళ్లి చేయలేరు, నేనే అహ్మదాబాద్ వస్తాను, అక్కడ పెళ్లి చేసుకుందాం’’ అన్నదామె… వినయ్ రెడీ అన్నాడు… పెళ్లయిపోయింది… తరువాత ఆమె జీవనశైలి చూస్తుంటే కొన్నిసార్లు వినయ్‌కు నోటమాట వచ్చేది కాదు… పేద కుటుంబం నుంచి వచ్చాను అనేది కదా, వేల రూపాయల సౌందర్య లేపనాలు, పౌడర్లు, సబ్బులను, ఇంకా ఏవేవో సాధనాలను వాడేది… పలుసార్లు మేకప్ వేసుకునేది… ఒక్కోసారి రెండుమూడు వేల రూపాయల చెప్పులు కొనేది… ఎటు వెళ్లాలన్నా ఏసీ రైలు లేదా క్యాబ్ తప్పనిసరి…

పేరుకు వాళ్లది వెజ్ ఫ్యామిలీ, కానీ రోజూ ఆమెకు తప్పనిసరిగా నాన్ వెజ్ కావాలి, చాలాసార్లు బీర్లు తెప్పించుకుని తాగేది… వేరే వ్యక్తితో మంచి శృంగారభరితమైన ఫోజులో దిగిన ఫోటోను కూడా చూశాడు… వినయ్‌కు పిచ్చి లేస్తోంది… ఒకరోజు నేను అస్సోం వెళ్తాను, ఓ కేసు వాయిదా ఉందని చెప్పింది… తన భర్త ఏటీఎం కార్డు, 5 వేల నగదు తీసుకుని పోయింది… కొన్నిరోజులు టచ్‌లోనే ఉంది… తరువాత కాల్స్ అటెండ్ కావడమే మానేసింది… అనుకోకుండా ఆమె కోర్టు కేసు తాలూకు నకళ్లు అతనికి దొరికాయి… ఇక తనే ఆమె అసలు వివరాలు తెలుసుకోవడానికి రంగంలోకి దిగాడు…

నిజాలు తెలిసి నిర్ఘాంతపోయాడు… ఆమె అసలు పేరు రీటా చౌహాన్… ఆమె గతంలో పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు అనిల్ చౌహాన్… కొన్ని వేల కార్లను దొంగిలించిన క్రిమినల్… తనతోపాటు పాటు ఆయన భార్య రీటా కూడా అస్సోంలో వాంటెడ్ క్రిమినల్… గత కొన్నేళ్లలో వాళ్లు చోరీ చేసిన కార్ల సంఖ్య కనీసం 6 వేలు అట… గత ఏడాది సెప్టెంబరులో అనిల్ ఢిల్లీలో అరెస్టయ్యాడు… ఇప్పుడు జైలులో ఉన్నాడు…

ఒకరోజు తాను క్రమబద్ధీకరించాల్సిన చట్టపరమైన కేసు కోసం అస్సాం వెళ్లాలనుకుంటున్నట్లు విమల్‌కు తెలియజేసింది. అస్సాం వెళ్లినప్పుడు ఆమె తన భర్త ఏటీఎం కార్డు, రూ. 5,000 నగదు, ఫోన్ కూడా తీసుకుంది. కానీ ఆమె అతని కాల్స్ తీసుకోవడం మానేసింది. తదుపరి విచారణలో ఆమెకు అప్పటికే వేరే వ్యక్తితో వివాహమైనట్లు తేలింది. ఆమెకు గతంలో సీరియల్ ఆటో దొంగ అనిల్ చౌహాన్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం జైలులో ఉన్న అనిల్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని ఆమె దైనిక్ భాస్కర్‌తో చెప్పింది. “నేను అనిల్‌ను 2007లో పెళ్లి చేసుకున్నాను, 2015లో కారు దొంగతనం కేసు నమోదైంది” అని రీటా పేర్కొంది. అప్పటి నుంచి అనిల్‌తో మాట్లాడలేదు. అనిల్ చౌహాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

రీటా మీద ఫ్రాడ్, చోరీ, మర్డర్ కేసులున్నాయి… అస్సోం వెళ్లగానే ఆమెను అరెస్టు చేశారు… ఈసారి ఆమెకు కాల్ చేస్తే ఆమె లాయర్ రియాక్టయ్యాడు… ఆమె జైలులో ఉందనీ, లక్ష రూపాయలు తీసుకొస్తే బెయిల్ తీసుకుందామనీ అన్నాడు… కేసు పెద్ద సీరియస్‌గా ఏమీ పెట్టలేదనీ బెయిల్ దొరుకుతుందనీ చెప్పాడు… 2015లో ఓ మాజీ ఎమ్మెల్యే రుమీనాథ్ పాన్ ఇండియా కార్ థెప్ట్ స్కాంలో అరెస్టయింది… పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది… తనతో టచ్‌లోకి వెళ్లింది ఈ రీటా చౌహాన్… సేమ్, ప్రొఫెషన్ కదా…

ఇంత కథ ఉంది ఆమె వెనుక… అన్నీ తెలిశాక వినయ్ మతిపోయింది… ఆమెతో వివాహబంధం ఎప్పటికైనా డేంజరే అని తెలుసుకున్నాడు… తమ పెళ్లిని రద్దు చేయాలంటూ పలు ఆధారాలతో మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు… ఇంతకీ ఆమె అస్సోం నుంచి గుజరాత్‌కు ఎందుకొచ్చింది..? వినయ్‌ను ఎందుకు పెళ్లి చేసుకుంది..? ఓ సేఫ్ అడ్డా కోసమా..? తన కేసుల నుంచి దూరంగా వెళ్లి అజ్ఞాతంగా కొత్త జీవితం గడపడానికేనా..? పోలీసులు ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబుల కోసం ప్రయత్నిస్తున్నారు..!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…
  • మిస్టర్ రానా… ఇదేం పరేషాన్‌ర భయ్… ఇది తెలంగాణ బ్రాండ్ మూవీయా..?
  • ఉత్సవాల్లో నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions