సందీప్ కిషన్… పుష్కరకాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు… బోలెడు తమిళ, తెలుగు సినిమాలు చేశాడు… మీడియం బడ్జెట్ నిర్మాతలకు అనువైన హీరో… నటన తెలుసు, ఎనర్జీ ఉంది, ఈజ్ ఉంది, టైమింగ్ ఉంది… కానీ ఏదో వెన్నాడుతోంది… ఈ బ్లాక్ బస్టర్ నాదే అని చెప్పే గొప్ప సినిమా లేదు… నిజానికి…
తను ఎంచుకునేవి భిన్నమైన సబ్జెక్టులు, జానర్లు… గుడ్… మన సోకాల్డ్ స్టార్ హీరోల కథలు, వేషాలు, ఎలివేషన్లు, భజన సినిమాలతో పోలిస్తే ఈ మీడియం హీరో చాలా చాలా బెటర్… ఎక్కడా ఏ వివాదాల్లోకీ రాలేదు కూడా… ప్రయోగాలకు చాలామంది హీరోలు భయపడతారు… సందీప్ కిషన్ సరేనంటాడు… అదే తేడా… కానీ తనలోని స్ట్రెంత్ మొత్తం బయటపెట్టేయగల మంచి డైరెక్టర్ దొరకడం లేదా..? లేక దొరికినా వర్కవుట్ కావడం లేదా..?
ఊరు పేరు భైరవ కోన సినిమా సందీప్ కిషన్ సినిమాల జాబితాలో మరొకటి… అంతే… అంతకుమించి పెద్దగా చెప్పుకునేట్టు లేదు… కాకపోతే ఇదీ ఓ డిఫరెంట్ జానర్… ఫాంటసీ, సస్పెన్స్, థ్రిల్లర్… దానికి కాస్త కామెడీ టచ్, ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఏదో గరుడపురాణం, నాలుగు పేజీలు మిస్సింగ్, ఓ మిస్టీరియస్ ఊరు… పేరు భైరవకోన… ప్లానింగ్ వరకూ బాగానే ఉంది… కానీ ప్రజెంటేషన్‌కు వచ్చేసరికి..?
Ads
దర్శకుడు వీఐ ఆనంద్… 2014 నుంచీ ఇండస్ట్రీలో ఉన్నాడు… సరుకు ఉన్న దర్శకుడే… త్వరలో అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమా చేసే చాన్స్ కొట్టేశాడట, అదే ఓ పెద్ద సర్టిఫికెట్ తనకు… కానీ భైరవకోన సినిమాకు సంబంధించి అక్కడక్కడా తడబడ్డాడు… ఫలితంగా సందీప్ కిషన్ కృషి, తన ప్రయాస ఆశించినంత బాగా వర్కవుట్ కాలేదు…
నిజానికి ఈ సినిమా రిలీజ్ టైమ్ చాలా అనుకూలమైంది… మార్కెట్‌లో పెద్ద పోటీ సినిమాలు లేవు.,. ఈగల్ తన్నేసింది… సో, భైరవకోనకు అనుకూలించాలి… కానీ లేదు… అంత బాగా రిజల్ట్ లేదు… ఒక హీరోయిన్ వర్ష బొల్లమ్మ క్యూట్, ఇచ్చిన పాత్రలో బాగా నటించింది… మరో ప్రధాన పాత్ర పోషించిన కావ్య థాపర్ వోకే… గ్రాఫిక్ వర్క్, సంగీతం వోకే, సినిమాటోగ్రఫీ ఎట్సెట్రా అన్నీ వోకే…
కానీ ప్రచారం జరిగినంత జోష్ లేదు సినిమాలో… ఫాంటసీ అన్నాక ఇక లాజిక్కులతో పనిలేదు అనుకుంటే కుదరదు, అవునేమో అన్నట్టుగా ప్రేక్షకుల బుర్రల్లోకి ఎక్కించాలి… సస్పెన్స్, థ్రిల్లర్, ఫాంటసీ అన్నాక సీన్లు వరుసబెట్టి గ్రిప్ సడలకుండా పరుగు తీయాలి… కానీ సెకండాఫ్ కొంచెం బోర్… దాంతో ఫస్టాఫ్ సరైన ట్రాకులో నడిచిన బండి సెకండాఫ్‌లో పట్టాలు తప్పింది… ఐనా పర్లేదు… ఓసారి సరదాగా చూడొచ్చు… వోకే, ఓటీటీల్లో అయినా సరే..!!
Share this Article