.
రాత్రి ఆపరేషన్ సిందూర్ హోరెత్తిపోయింది… ధ్రువీకరించినవి, ధ్రువీకరించబడనివి బోలెడు వార్తలు… నిజంగానే రాత్రి పాకిస్థాన్‌కు కాళరాత్రి… కొన్ని చెప్పుకోవాలి… నిజాలో అబద్ధాలో ఉదయం 9, 10 గంటలకు రక్షణ శాఖ, ఆర్మీ మీడియా బ్రీఫింగులో క్లారిటీ వస్తుంది… ఆ రెండు సివంగులే మళ్ళీ బ్రీఫింగ్…
అసలు రాత్రి ఏం జరిగింది..? సోషల్ మీడియా, కొన్ని మీడియా చానెళ్ల వార్తలను బట్టి చూస్తే…
Ads
- ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధరంగంలోకి ప్రవేశించింది… కరాచీ పోర్టు మీద దాడి చేసింది… పాకిస్థాన్ ఆర్థిక వెన్నెముకగా పేర్కొనే సదరు పోర్టు ధ్వంసం అయిపోయింది…
- ఇండియాలోని దాదాపు 16 నగరాలను, కీలక సైనిక క్యాంపుల్ని టార్గెట్ చేస్తూ పాకిస్థాన్ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది… కానీ రష్యా మనకు సమకూర్చిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ మధ్యలోనే పేల్చేసింది…
.
- ఎప్పుడైతే పాకిస్థాన్ భారతీయ నగరాలపై దాడులు మొదలుపెట్టిందో ఇక ఇండియా కూడా పూర్తి యుద్ధానికి రెడీ అయిపోయింది… ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాలూ రంగప్రవేశం… ఇస్లామాబాద్, లాహోర్ తదితర కీలక నగరాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు షురూ…
- మరోవైపు కీలక పాకిస్థాన్ సైనికాధికారులు, ధనికులు బహ్రెయిన్ వైపు పారిపోతున్నట్టుగా వార్తలు… అంతెందుకు…? సాక్షాత్తూ పాక్ సైన్యాధ్యక్షుడు పత్తా లేడు…
- తన దరిద్రపు వ్యూహాలతో పరిస్థితిని ఇంతదాకా తీసుకొచ్చినందుకు తనను పదవి నుంచి తొలగించి కొత్తగా మరో సైన్యాధ్యక్షుడిని రంగంలోకి తీసుకొచ్చింది పాకిస్థాన్…
.
- పాకిస్థాన్ ప్రధాని నివాసానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇండియన్ మిసైళ్ల పేలుళ్లు… బంకర్‌ను తనను తరలించిన పాకిస్థాన్ సైన్యం… పాకిస్థాన్ దేశవ్యాప్తంగా బ్లాకవుట్…
- అన్నింటికీ మించి తమ యుద్ధవిమానాలను ఇండియా కూల్చేసిందనే వార్తలు నిజమేనని అంగీకరించిన పాకిస్థాన్ సైన్యం … తాము యుద్ధానికి వ్యతిరేకమనే ప్రకటన జారీ…
- మరోవైపు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటిస్తూ పలు ప్రాంతాల నుంచి ఆర్మీ తరిమివేత.., పాకిస్థాన్ జెండాల్సి తీసేసి, తమ జెండాల్ని ఎగరేసిన బెలూచ్ ఆర్మీ…
.
- మరోవైపు తాలిబన్లు కూడా పాకిస్థాన్ మీద దాడికి సంసిద్ధం అయ్యారని వార్తలు… పాకిస్థాన్ నాలుగు ముక్కలయితే ఒక ముక్కను విలీనం చేసుకుందామనే ఎత్తుగడ…
- బెలూచిస్థాన్ ఏరియాలో ఉండే గ్యాస్ కేంద్రాలపై బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు… క్వెట్టా స్వాధీనం… మరోవైపు వాస్తవాధీన రేఖ దాటి పీవోకే, పాకిస్థాన్ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్న ఇండియన్ ఆర్మీ…
- 8 వేల పాకిస్థానీ ట్విట్టర్ ఖాతాలపై ఇండియా నిషేధం… పాకిస్థాన్ ఆధారిత ఓటీటీ, ఇతర నెట్ కంటెంటు మీద కూడా నిషేధం…
…… ఇంకా చాలా వార్తలు కనిపించాయి… గానీ ఇవీ ముఖ్యమైనవి… వీటిల్లో ఎన్ని నిజం..? అసలు యుద్ధం పరిస్థితి ప్రస్తుతం ఏమిటి తెలియాలంటే 10 గంటల బ్రీఫింగ్ వరకూ ఆగాలి… రక్షణ శాఖ చెప్పిందే ఫైనల్… జయహో భారత్…
Share this Article