.
“ఆపరేషన్ సిందూర్‌ను పొడగించకపోవడమే మంచిదైందట… కానీ ఎందుకు?” ఓ సమర్థన… అబ్బే, ఫూలిష్ సమర్థన అంటారా..? పోనీ, ఓ కథలాగా చదువుకొండి… నిజమే అంటారా..? ఎంజాయ్…
ఇది కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇది భారత్ వర్సెస్ పాకిస్తాన్ + చైనా + టర్కీ + అమెరికా డీప్ స్టేట్ + దేశంలో ఉన్న అంతర్గత శత్రువులు… ప్లస్ బంగ్లాదేశ్ కూడా ఈ కుట్రదారులకు సహాయ పాత్రధారి…
Ads
ఈ దుష్టకూటమికి ప్రేరణ కలిగించినది ఉక్రెయిన్ వర్సెస్ రష్యా తరహా యుద్దతంత్రం ఆట… ఉక్రెయిన్ తన స్వంత డ్రోన్లు, అమెరికా- టర్కీ మద్దతుతో, రష్యా నేవీ శక్తిని 40% దెబ్బతీసింది తెలుసు కదా…. ఇప్పటికి 6 లక్షల రష్యన్లు చనిపోయారు… అమెరికా, బ్రిటన్, నాటో, టర్కీ – అందరూ రష్యాను దెబ్బతీస్తూనే ఉన్నారు…
ఇదే ప్లాన్ ఇండియాపైనా ప్రయోగించాలనుకున్నారు… భారతాన్ని దీర్ఘకాలికంగా ముంచేసే కుట్ర… ఒక సింహం వందల మంది అడవి కుక్కలను చంపగలదు, కానీ చివరికి అది కూడా గాయపడుతుంది… మన శత్రువులకు ప్రాణనష్టాలంటే లెక్కలేదు… కానీ మనం..?
ఇలా దేశాన్ని అయోమయంలో ఉంచి అభివృద్ధిని అడ్డుకోవాలన్నది చైనా, అమెరికా డీప్ స్టేట్, అంతర్గత శత్రువుల లక్ష్యం… మన తూర్పు భాగాలను కలుపుకుని కొత్త సమస్యల్ని సృష్టించాలన్నది బంగ్లాదేశ్ వ్యూహం… మన సైన్యం వ్యూహం కారణంగా మూడే రోజుల్లో పాకిస్తాన్ వెన్ను విరిచాం.,. తరువాత నిశ్శబ్దం…
శ్రీకృష్ణుడు అశ్వత్థామను చంపలేదు – అతని మణిని తీసేశాడు… మన లక్ష్యం అదే: పాకిస్తాన్ అనే దేశాన్ని ఓడించాల్సిన అవసరం లేదు. అది తన చేతిలో తనే ఓడిపోతుంది… కాకపోతే దాని బలాల్ని చంపాలి, మనం చేస్తున్నది అదే… ఇప్పుడు దానికి ఎయిర్ బేస్ అంటూ లేదు… అణ్వస్త్రాల సంగతి అయోమయం…
ఇప్పుడిక మన చూపు తూర్పు వైపు ఉండాలి. మణిపూర్ నుంచి మయన్మార్ వరకూ, అమెరికా- బ్రిటన్ మద్దతుతో నక్సలైట్, ఐసిస్ మద్దతుదారులు గొడవలు సృష్టిస్తున్న క్షేత్రాలు ఉన్నాయి. “చికెన్ నెక్” ప్రాంతం చాలా కీలకమైనది. ఇప్పుడు మన విజయాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మొదలవుతాయి…
పాకిస్తాన్ ఇప్పుడు ఓ ఒక జీవచ్ఛవం. ఆ పెంటను మనం తవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడేం చేయాలో తెలుసుకోవాలంటే – చాణక్యుడిని చదవాలి. పగవాళ్లను ఎలా ఎత్తిపడేయాలో – శ్రీకృష్ణుడిని గమనించాలి…
భారతదేశ భవిష్యత్తు – మన తదుపరి తరం సురక్షితంగా బతకాలంటే, పాకిస్తాన్ అనే చీకటి ఉగ్ర దేశం కూలిపోవాల్సిందే. అది సైనికంగా కాదు – ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా… అది మన విజయానికి మార్గం… అది చిన్న కురుపులా స్టార్టయి కేన్సర్ పుండుగా మారాలి…
బెలూచిస్తాన్ త్వరలో విముక్తం అవుతుంది… పీవోకేలో జనం తిరగబడతారు… పాకిస్థాన్ ముక్కలవుతుంది… అబీ పిక్చర్ బాకీ హై… అబీ అబీ పిక్చర్ షురూ హువా…
Share this Article