అడ్డగోలు లెక్కలు ఏవో చెప్పి… చరిత్రకు పిచ్చి బాష్యాలు చెప్పి… ఇద్దరు పోరాటవీరుల కథల్ని తప్పుదోవ పట్టించి… 1200 కోట్లు పిండుకున్నా సరే రాజమౌళికి దాహం తీరలేదు… దూప ఇంకా పెరిగిపోయింది… ప్రేక్షకుల్ని ఇంకా పిండాలని అనుకున్నాడు… ఓటీటీలో రిలీజ్ చేసినా సరే, వంద కడితేనే చూస్తారు, లేకపోతే లేదు అని ఆంక్ష పెట్టాడు… టికెట్ పెట్టాడు… గుర్తుంది కదా… ఈ ‘పిండుడు స్కీం’ కోసం ప్రత్యేకంగా ట్రెయిలర్ కూడా రిలీజ్ చేశాడు…
ఒక్కసారిగా రాజమౌళి మీద నెటిజన్లలో ఆగ్రహం భగ్గుమంది… పెద్ద ఎత్తున ట్రోలింగ్ స్టార్టయింది… ‘‘ఇంకా సరిపోలేదా..? ఇంకెంత డబ్బు కావాలి..? కంటెంట్ ఫ్రీగా చూడటానికే కదా ఓటీటీ సబ్‌స్క్రయిబ్ చేసుకున్నది, వాళ్లు కూడా నీ సినిమాకు డబ్బు ఎందుకు కట్టాలి..? థూ’’ అన్నట్టుగా ఛీత్కరించారు… ఈ ఆగ్రహాన్ని, ఈ నెెగెటివ్ క్యాంపెయిన్‌తో రాజమౌళి టీంకు దిమ్మతిరిగిపోయింది… తల వాచిపోయింది… తను పాలు పిండుకునే పొదుగును కోసుకుంటున్నట్టు అర్థమైంది… చివరకు చెంపలేసుకున్నాడు… వెనక్కి తగ్గాడు…
Ads
తమ ఓటీటీ చందాదారులు ఉచితంగానే ఆర్ఆర్ఆర్ చూడవచ్చునని జీ5 ప్రకటించింది… ఎవరైతే ఇప్పటికే అదనంగా డబ్బులు చెల్లించారో వాళ్ల ఓటీటీ వేలిడిటీని మూడు నెలలపాటు పొడగిస్తామని చెప్పింది… సో, అలా ప్రేక్షకుల నుంచి ఎదురైన తిరస్కారం, కోపంతో రాజమౌళి తలవంచుకున్నాడు… ఏదీ అతి చేయకూడదు… ఇదుగో ఇలా చేస్తే మొదటికే మోసం వచ్చే సిట్యుయేషన్ ఉంటుంది… ఎప్పుడైతే ఓటీటీ టికెట్ అన్నాడో పెద్ద ఎత్తున పైరేటెడ్ కాపీలు వెబ్‌సైట్లలో దర్శనమిచ్చాయి… డౌన్ లోడ్ చేసుకుని, విరివిగా అందరూ షేర్ చేసుకున్నారు… దెబ్బకు ఓటీటీ టికెట్ ప్రయోగం ఎలా వికటించిందో అర్థమైంది వాళ్లకు…
ఇదేకాదు… సినిమాలకు టికెట్ల ధరలు ఎడాపెడా విపరీతంగా పెంచేయడం కూడా ఇండస్ట్రీకి నష్టం తీసుకురాబోతోంది… ఆచార్య డిజాస్టర్ కారణాల్లో అది కూడా ఒకటి… సినిమా ఎలా ఉన్నా సరే చిరంజీవిని చూడటానికి వెళ్లే అభిమానులు సైతం మొహాలు చాటేశారు… సేమ్, సర్కారువారి పాటకూ ఆ ప్రభావం తగిలింది… కిందామీదా పడుతోంది అది బాక్సఫీసు వద్ద… దాంతో దిల్ రాజు తమ కొత్త సినిమా ఎఫ్-3 కు టికెట్ల ధరలు పెంచడం లేదనీ, పాత రేట్లతోనే ప్రదర్శిస్తామని ప్రకటించాడు… తత్వం బోధపడింది…
ఇక ఇప్పుడు మిగిలింది కేజీఎఫ్-2… ఇది మరీ అరాచకం… తిప్పితిప్పికొడితే వాళ్లు ఖర్చుపెట్టింది 100 కోట్ల లోపు… అదీ అందరి పారితోషికాలు కలిపి… అనూహ్యంగా మంచి టాక్ వచ్చి, అదీ 1200 కోట్లను కుమ్మేసింది థియేటర్లలో… ఐనా దానికి దూప తీరలేదు… రాజమౌళి తరహాలోనే అది కూడా ఇంకా ప్రేక్షకుల జేబుల్ని పిండేద్దాం అనుకుంది… ఇంకా ఎక్కువ ధనదాహంతో… 200 ఇస్తేనే ఓటీటీలో చూసే పద్ధతి ప్రకటించింది… ప్రైమ్ ఓటీటీలో 200 పే చేస్తేనే నెలరోజుల వేలిడిటీ ఉండేలా టెక్నికల్‌గా ఏర్పాట్లు చేశారు, సినిమా చూడటం స్టార్ట్ చేశాక 48 గంటలే ఉంటుంది… దీన్ని కూడా జనం ఛీకొడుతున్నారు… మరి ప్రైమ్ కూడా తప్పు తెలుసుకుంటుందా..? తలదించుకుంటుందా..? చూడాలిక..!
Share this Article