Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్… మన ఆకాశ్‌కు గిరాకీ…

March 24, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలనుకుంటున్న యూఏఈ..!
అమెరికన్ పేట్రియాట్, థాడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేర్లు ఇవి!
వీటిలో THAAD అబ్రివేషన్ ఇలా ఉంటుంది.. Terminal High Altitude Area Defence.

ఈ పేరు ఎలా ఉంది అంటే తెలుగు నాట పల్లెటూరిలో పుట్టి బాగా చదివి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ పని మీద హైదరాబాద్ కి వచ్చి రెస్టారంట్ కి వెళ్లి ఇడ్లీ సాంబార్ కోసం ఆర్డర్ ఇచ్చాడు ఇలా..
I’ll have the steamed fermented rice cakes with a side of lentil-vegetable stew, but please ensure the lentils were emotionally attached to the vegetables.

Ads

పేరులోనో, మాట్లాడే భాషలోనో నైపుణ్యం ఉంటే అది ఉద్యోగానికో లేక ఒక వస్తువుని అమ్ముకోవడానికో పనికివస్తుంది తప్పితే తీరా ఆచరణ లోకి వచ్చేసరికి అసలు విషయం బయటపడుతుంది!
డేవిడ్ స్లింగ్ అనేది ఇజ్రాయేల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్! డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ ని ఆపలేకపోయిది!

మరి మన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్!?
పేరు చాలా సింపుల్ ఉంది కదా?
UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యా ( Sheikh Mohammed Bin Zayed Al Nahyan) కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు అది
భారత్ నుండి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలని!
అనుభవం అయింది తత్వం బోధపడింది!

కానీ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ నుండి మనకి ముప్పు పొంచి ఉంది!
గత 50 ఏళ్ళ చరిత్రని పరిశీలిస్తే తన తోక అయిన యూరోపు ని ఆయుధపరంగా ఎదగనీయకుండా అడ్డుకుంటూ వచ్చింది. అలాంటిది భారత్ పోటీకి వస్తే చూస్తూ ఊరుకోదుగా!
ఏదో ఒక వంక పెట్టి ఆంక్షలు విధించేలా చూస్తుంది!

ఆపరేషన్ సిందూర్ వల్ల ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసింది!
ఇరాన్ మీద అమెరికా దాడి వల్ల ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత అవసరమో ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి.
ఒక్కోసారి దాడి మంచిదే అవుతుంది, మరక మంచిదే అనే స్లోగన్ లాగా!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెరికా, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్… మన ఆకాశ్‌కు గిరాకీ…
  • తాళి చుట్టే మణిరత్నం సినిమా కథలన్నీ…
  • స్వామియే శరణం అయ్యప్పా… ఎర్రన్నలకు తత్వం బోధపడింది….
  • సీట్ల పెంపు- స్థూలంగా గుడ్… కానీ నాణేనికి మరోవైపు మాటేమిటి..?
  • సంతాన బాధిత ముసలి తల్లిదండ్రులకు పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి..!!
  • అయ్యా… హిందూ సమాజంపై కాస్త దయజూపు మిత్రమా…
  • కోర్టులో ఒక ఎఐ జడ్జి ఉంటే..? రాబోయే రోజుల్లో ఈ సిట్యుయేషన్ తప్పదా..!
  • ‘‘నీకూ మోసం చేయడం తెలిస్తే… చేసి నువ్వూ సంపాదించుకో…’’
  • అమ్మ రాజీనామా చేస్తే… ఇల్లు కల్లోలమే…! మంచి కాన్సెప్టు మూవీ…!
  • ఇది లొట్టపీసు కేసు కాదు… రేవంత్ వర్సెస్ కేటీఆర్ – తిరగబడ్డ కాలచక్రం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions