…… ఒవైసీ భలే ఎత్తుగడ ఇది… హైదరాబాద్ పాతబస్తీ దాటి విస్తరించే ప్లాన్… జాతీయ స్థాయిలో ముస్లిం వాయిస్ అనిపించుకునే స్ట్రాటజీ… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు కాస్త విస్తరించి… మొన్న బీహార్‌లో ఏకంగా అయిదు అసెంబ్లీ సీట్లు గెలిచి… ఇప్పుడు బెంగాల్‌పై గురి… అక్కడ చాలా ఆశలున్నయ్… ఎందుకు..?
బంగ్లాదేశ్ సరిహద్దు… లక్షల మంది ముస్లింలు ఆ దేశం నుంచి బెంగాల్ వచ్చి స్థిరపడ్డారు, పడుతున్నారు… వాళ్ల వోట్ల కోసం ఇన్నేళ్లూ సీపీఎం గానీ, టీఎంసీ గానీ నానా తిప్పలూ పడేవి… కొన్ని ప్రాంతాల జనాభా ముఖచిత్రమే మారిపోయింది… హిందువులు మైనారిటీలో పడిపోయి, ముస్లింల సాంద్రత పెరిగిపోయింది… ప్రత్యేకించి మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ దినాజ్‌పూర్, సౌత్ దినాజ్‌పూర్, సౌత్ 24 పరగణా వంటివి… కొన్ని నియోజకవర్గాల్లో 60, 70 శాతం వరకూ ముస్లింలే…
మజ్లిస్ గనుక అక్కడ పాగా వేస్తే… వేయాలని అనుకుంటే… పక్కా ముస్లింల పార్టీ కాబట్టి దానికి అడ్వాంటేజ్ ఉంటుంది… ఆల్రెడీ ఆ ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజ్ చేసుకుంటోంది బలంగా… ఇది సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీలకు కలవరం రేపుతోంది… ప్రధానంగా మమతకు… ముస్లిం వోట్లలో ఇన్నాళ్లూ 60 శాతం దాకా ఆమె పార్టీకే పడేవి… ఇప్పుడవి బాగా చీలిపోయి మమతకే నష్టం… మజ్లిస్ బలపడేకొద్దీ బీజేపీ బలం కూడా పెరుగుతుంది… హిందూ వోట్ల కన్సాలిడేషన్‌కు స్కోప్ ఉంటుంది… అదీ అధికారంలో ఉన్న టీఎంసీకి నష్టమే… కొన్నేళ్లుగా బీజేపీ బలపడుతోంది,.. అది ఇంకా పెరిగితే రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి పోయే అవకాశాల్నీ కొట్టేయలేరు…
Ads
ఇదీ మమత కలవరం… అయితే మజ్లిస్ కేవలం బీజేపీని గెలిపించడానికే శకుని పాత్ర పోషిస్తోందని, ముస్లిం వోట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా బీజేపీకి బీటీంగా పనిచేస్తోందని కాంగ్రెస్ గట్రా ఆరోపిస్తున్నాయి కొన్నిరోజులుగా… నిజానికి మజ్లిస్ బరిలో ఉండటం బీజేపీకి నయమే… అయితే ఈ విమర్శల్ని కౌంటర్ చేయడానికి ఒవైసీ చాకచక్యంగా మమతతో పొత్తు అనే అస్త్రాన్ని బయటికి తీశాడు…
అయిదారు జిల్లాల్లో బలంగా ఉన్నాం అనే వాదనతో ఎక్కువ సీట్లు కోరతాడు… మమత యాటిట్యూడ్ వల్ల ఆమెతో పొత్తు, సీట్ల బేరాలు పెద్దగా సక్సెస్ కావు… బీజేపీ బలపడకుండా ఉండటానికి, యాంటీబీజేపీ పక్షాలన్నీ ఒక్కటి కావాలని నేను పొత్తుకు, అవగాహనకు, కార్యాచరణకు సిద్దపడినా… ఈ పార్టీలే కలిసి రాలేదని రేప్పొద్దున చెప్పుకోవచ్చు… ఎటొచ్చీ ఆ అయిదారు జిల్లాలకు సంబంధించి టీఎంసీ, కాంగ్రెస్, టీఎంసీ ఇరకాటంలో పడినట్టే… సహజంగానే బీజేపీ ఆనందంగా చూస్తోంది ఈ విమర్శల్ని, ఈ ప్రయత్నాల్ని, ఈ ప్రణాళికల్ని… ముస్లిం వోట్ల మీద ఎంత చర్చ జరిగితే దానికి అంత మంచిది… అదీ దాని సంతోషం… అక్కడ సీపీఎం, కాంగ్రెస్ పెద్ద నిర్ణాయక శక్తులేమీ కాదు ఇప్పుడు… సో, మమతక్కా ఏం చేయబోతున్నావ్..? ఒవైసీతో భాయీభాయీ అనడమా..? డిష్యూం డిష్యూంకు రెడీ అయిపోవడమా..?
Share this Article