.
మందు అమ్మకాల వార్తలకన్నా… కొన్ని ఇతర వార్తలే ఇంట్రస్టింగు అనిపించాయి… 900 కోట్లు తాగేశారు… 500 కౌంట్ ఊదేశారు అని ఒక వార్త…
డిసెంబరు 30, 31 తేదీల్లో సర్కారీ డిపోల నుంచి కొన్న మద్యం విలువను బట్టి… 31 రాత్రి ఇంత తాగేశారు అని రాయడం ఉజ్జాయింపే గానీ ఖచ్చితం కాదు… పాత స్టాక్ కూడా ఉంటుంది, ఆల్రెడీ కస్టమర్లు కొని పెట్టుకున్న మందూ ఉంటుంది…
Ads
సరే, మొత్తానికి అత్యంత భారీ ఎక్కువ డోస్ ఇది… పోలీసులు ఎన్ని అరివీర భీకర ప్రకటనలు ఇచ్చి హెచ్చరికలు చేసినా… అడుగడుగునా ఊదుడు గొట్టాలను మొహరించినా సరే, జనం బేఖాతరు చేశారు… మందు అమ్మకాలు పెరిగాయి, డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరిగాయి… హైదరాబాదులో నాలుగైదు డ్రగ్ కేసులూ దొరికాయి…
అన్నింటికీ మించి… హైదరాబాదులో ఏకంగా 9 మంది 500 కౌంట్ దాటి పట్టుబడ్డారు… మరీ ప్రమాదకరమైన డోస్… ఒకరు 550 కౌంట్‌తో దొరికిన వార్త ఆల్రెడీ చెప్పుకున్నాం… ఎక్సైజ్ పర్మిషన్లు తీసుకుని మరీ రిసార్టుల్లో, ఫంక్షన్ హాళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుని, అక్కడే తాగి, పోలీసు ఆంక్షలతో గోక్కోవడం దేనికని, అక్కడే పడుకుని తెల్లారి ఉతార్ డోస్ వేసుకుని మరీ తిరుగుముఖం పట్టినవారి సంఖ్య ఈసారి చాలా ఎక్కువ…
ఇక మరో కోణం చూద్దాం… పది లక్షల ఓయో రూమ్స్ బుకింగ్స్ అట కొత్త సంవత్సరం సందర్భంగా..! మొత్తం బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్ అనే వార్తలూ చదివాం కదా… సో, ప్రేమికులు ‘పండుగ’ చేసుకున్నారు… ఓయో రూమ్స్‌కు ఉన్న పేరు తెలుసు కదా… ప్రేమికుల శృంగారానికి అడ్డాలు…
ఇంకాస్త ఎక్కువ నాగరికత అంటిన ప్రేమికులు అక్కడికే మందు తెచ్చుకుని, బిర్యానీ ఆర్డర్లు పెట్టుకుని ఎంజాయ్ చేశారు తెల్లార్లూ…! అన్నట్టు మరో వార్త… ఈసారి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి కండోమ్స్ ఆర్డర్లు కూడా విపరీతంగా పెరిగాయట… నేరుగా షాపుల్లో కొన్నవాటికి లెక్కే లేదుగా…
సొంతంగా జాబ్స్ ఉన్న యువతలో అఫర్డబులిటీ పెరిగింది… ఆనందానికి ఏ సందర్భంగా దొరికినా ఖర్చుకు వెనుకాడకుండా… ఉన్నప్పుడే అనుభవిద్దాం అనే ధోరణి పెరిగింది… అసలే లేటు వయస్సు పెళ్లిళ్లు… ‘కోర్కెలకు’ ఎన్నేళ్లు కళ్లేలు అనే ధోరణి… అవున్నిజమే… ప్రేమికులు స్వేచ్ఛగా కలుసుకోవడానికి, ఏకం కావడానికి ఓయో రూమ్స్ తప్ప వేరే మార్గమేముంది..? అవే ఇప్పుడు గడ్డివాములు..!!
చదువుతుంటే, ఓ పాట గుర్తొస్తున్నదా… ఓకే అని అంటిమా ఓయోకు రమ్మంటడు అని ఓ హిట్ పాట… ఆ ఇద్దరూ ఓకే అనుకుంటే… ఛలో ఓయో… అంతే…! నిన్న గుళ్లన్నీ భక్తులతో కిటకిట… ఈ గుళ్లు కూడా..! అన్నట్టు ఓయో ఫుల్ ఫామ్ ఎందరికి తెలుసు..? On Your Own…!!
Share this Article