Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డౌటేముంది..? ఆ కమలహాసన్‌కన్నా మన చంద్రమోహనుడే బాగా చేశాడు..!!

October 24, 2024 by M S R

చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీక 1978 లో వచ్చిన ఈ పదహారేళ్ళ వయసు సినిమా . శ్రీదేవిని స్టార్ హీరోయిన్ని చేసి జయప్రద , జయసుధల సరసన నిలబెట్టిన సినిమా . రాఘవేంద్రరావు ప్రభంజనాన్ని కొనసాగించిన సినిమా . సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో వంద రోజులు అడి సూపర్ డూపర్ హిట్టయిన సినిమా .

తమిళంలో హిట్ సినిమా 16 వాయతినిలెకు రీమేక్ మన పదహారేళ్ళ వయసు సినిమా . తమిళంలో శ్రీదేవి , కమల్ హాసన్ , రజనీకాంతు నటించారు . తమిళ సినిమా కూడా యూట్యూబులో ఉంది . వీలుంటే చూడండి . నాకయితే కమల్ హాసన్ కన్నా చంద్రమోహనే బ్రహ్మాండంగా నటించారని అనిపిస్తుంది . ఎలా ఉంది దెబ్బ అంటూ మోహన్ బాబు తన ప్రత్యేక మేనరిజాన్ని కొనసాగించారు .

ఈ సినిమా ఏమీ సందేశాత్మక సినిమా కాదు . ఓ పదహారేళ్ళ పల్లెటూరి అమ్మాయి సినిమా . ఆ వయసులో సహజంగా ఉండే ఆలోచనలు , ఆకాంక్షలు , వయసు తెచ్చే కష్టాలు వగైరాయే ఈ సినిమా . కధ , స్క్రీన్ ప్లే , చిత్రీకరణ , పాటలు ఈ సినిమాను సూపర్ హిట్ చేసాయి . శ్రీదేవిని ఒక్కసారిగా NTR పక్కన వేటగాడు సినిమాలో హీరోయిన్ని చేసింది .

Ads

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ . పాటలను అన్నీ వేటూరి వారే వ్రాసారు . పాటల్ని బాలసుబ్రమణ్యం , యస్ జానకిలే పాడారు . సుశీలమ్మ ఒక్క పాట కూడా పాడకపోవటం విశేషం . సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . తమిళ ట్యూన్నే ఉంచారు . కట్టుకధలు నేను చెప్పి నవ్విస్తే పాటలో చంద్రమోహన్ నటన సూపర్బ్ . పంటచేలో పాలకంకి నవ్వింది , పువ్వు లాంటి మల్లి పుష్పించేనమ్మా పాటలు శ్రావ్యంగా ఉంటాయి . వయసంతా ముడుపుగట్టి వస్తాలే ఆడుకుందాం గ్రూప్ సాంగులో హలం అందాన్ని అంతా మూటగట్టి చూపించారు రాఘవేంద్రరావు .

శ్రీదేవి మొదటిసారిగా హీరోయినుగా నటించిన అనురాగాలు సినిమాలో హీరో రవికాంత్ ఈ సినిమాలో వెటర్నరీ డాక్టరుగా నటించారు . ఇతర పాత్రల్లో నిర్మలమ్మ , హలం ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో పాత్రలు కూడా ఎక్కువగా ఉండవు .

ఈ సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడా సిరిసిరి మువ్వ సినిమా గుర్తుకొస్తుంది . నేను స్కూల్లో చదువుకునేటప్పుడు చంద్రమోహన్ మొదటి సినిమా రంగులరాట్నం వచ్చింది . ఆ సినిమా చీరాలలో చూసొచ్చిన మా డ్రిల్ మాస్టారు ఓ మాటన్నారు . ఇంకో మూడు అంగుళాలు ఎత్తు ఉంటే తెలుగు సినిమా రంగాన్ని ఏలుతాడు అని . లేకపోయినా ఏలాడు చంద్రమోహన్ . లాంగెస్ట్ కెరీర్ అనుభవించాడు .

తర్వాత కాలంలో తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన భారతీరాజాయే హిందీలో సోల్వా సావన్ టైటిలుతో తీసారు . హిందీలో కూడా శ్రీదేవియే నటించింది . బహుశా హిందీలో ఆమెకు ఇదే మొదటి సినిమాయేనేమో ! అమోల్ పాలేకర్ హీరో . హిందీలో బాగా ఆడలేదు .

పదహారేళ్ళ వయసు సినిమా చూడనివారు బహుశా ఎవరూ ఉండరేమో ! ఎవరయినా ఒకరూ అరా ఉంటే యూట్యూబులో ఉంది ; చూసేయండి . An entertaining , feel good , musical super hit movie . An unmissable one . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . చూసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు       (దోగిపర్లి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరు ఈ ధూల్‌పేట లేడీ గంజాయ్ డాన్ అంగూర్ బాయ్..?
  • లవ్ ఎట్ ఫస్ట్ మూవీ… అరంగేట్రంతోనే ఆమెకు నాగార్జున పడిపోయాడు…
  • మామా ఏక్ పెగ్‌లా… లాటరీలలో చిక్కిన చక్కని కిక్కు చుక్కలు!
  • బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్..! మీలో చేరిన పోక్సో కేరక్టర్ కథేమిటి కేటీయార్..?!
  • రుబాయీకి ఓ పద్ధతి, ఓ సొగసు ఉంటయ్… అవహేళన చేయకండి దాన్ని..!!
  • పగ రాజకీయాలు..! రేవంత్ రెడ్డిని చూసి కవిత నేర్చుకోవాలి కొన్ని..!!
  • యూట్యూబ్ స్టార్ హీరోయిన్ నాగదుర్గ… ఇప్పుడిక తమిళ ఇండస్ట్రీలోకి…
  • ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వదిలేలా లేదు సాడే సాత్ శని..!!
  • విషసర్పాలు, బుడ్డెరఖాన్‌లు… హైదరాబాద్ ప్రెస్ దుర్వాసనలు..!!
  • ఆకుపూజ చేయించారా..? పారేయకండి… ఔషధాహారం చేయొచ్చు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions