.
పహల్గాం దుశ్చర్య… నాన్ ముస్లిం అని ఖరారు చేసుకుని మరీ కాల్చిచంపిన ముష్కరసేన… దేశమంతా కోపంతో రగిలిపోతోంది… ఒక్క రాబర్ట్ వాద్రా వంటి సూడో సెక్యులరిస్టులు తప్ప…
దేశంపై, హిందూ మతంపై దాడిని కూడా బీజేపీ వ్యతిరేక కళ్లతో చూస్తూ, ప్రకోపించిన మెదళ్లతో ఏదోరకంగా ఉగ్రవాదానికి చప్పట్లు కొట్టే వెధవలు బోలెడు మంది…
Ads
ఆ సంఘటన జరిగాక పాకిస్థాన్‌లో సంబరాలు… ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో సంబరాలు… సింపుల్, వాడు తేల్చేశాడు మళ్లీ మళ్లీ… మతం పేరిట నీ దేశాన్ని కాల్చేస్తాను… ఈ స్థితిలో భావోద్వేగాలు అదుపు తప్పుతాయి ఖచ్చితంగా… పాత సంయమనాలు ఇక కనిపించవు…
అందుకే సింధు జలఒప్పందం రద్దు, దౌత్యసంబంధాలు రద్దు, వీసాలు రద్దు… ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడే చెప్పనివి… ఆ టెర్రరిస్టులు మోడీ కోసమే వచ్చారట, కానీ వర్కవుట్ కాలేదు, ఆ కసి మొత్తం హిందూ పర్యాటకుల మీద చూపించారట…
గతంలో బాల్ ఠాక్రే ఉన్నప్పుడు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటేనే పిచ్ తవ్విపోసి, అడుగు పెడితే తగులబెడతా అన్నది మహారాష్ట్ర… ఆ ఠాక్రే కొడుకు ఇప్పుడు ‘‘కాంగ్రెస్ ఆత్మబంధువు’’ అయ్యాడు గానీ… నవ నిర్మాణ సేన అని ఒకటుందిగా…
పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఓ హిందీ సినిమా గనుక మహారాష్ట్రలో రిలీజ్ చేస్తే తగులబెడతాం అంటోంది… ఒకవైపు వాళ్లు మన దేశాన్ని, మన లోకల్స్ సాయంతోనే తగులబెడుతుంటే వాళ్ల సినిమాల్ని చూసి ఆనందించాలా అంటోంది… ఆ సినిమా పేరు అబిల్ గులాల్…
గతంలో హిందీ సినిమాల్ని పాకిస్థానీయులు ఎంజాయ్ చేయలేదా..? పాకిస్థాన్, బంగ్లాదేశ్ నటులు బాలీవుడ్ సినిమాలు చేయలేదా..? చేశారు… కానీ ఇప్పుడు ఇండియన్స్ భావోద్వేగ తీవ్రత వేరు… మన సాయం తీసుకుని, ఇప్పుడు మనల్నే కాటేయాలని చూస్తున్నది బంగ్లాదేశ్… హిందువులపై ఊచకోత, చైనాతో చెలిమి చేసి… ఏ పాకిస్థానీ వాడు వాళ్లను చీదరగా చూస్తూ అణిచివేశాడో ఆ పాకిస్థాన్‌తో ఇప్పుడు బంగ్లాదేశ్ దోస్తీ…
ఇప్పుడు ఈ సెగ తెలుగు హీరో ప్రభాస్‌కు తగులుతోంది… అసలే అనారోగ్యం, సినిమాలన్నీ పెండింగ్, అవెప్పుడు రిలీజవుతాయో ఎవరికీ తెలియడం లేదు,.. ఈ స్థితిలో ఫౌజీ అని తను నటించే సినిమాకు తాజాగా పహల్గాం సెగ… ఎందుకు..?
అందులో ఇమాన్వి అనే నటి… తనెవరు..? పాకిస్థానీ… ఆ దేశ మిలిటరీ ఆఫీసర్ బిడ్డ… ఉండేది అమెరికాలోనే అయినా ఆమె జాతీయత ఇప్పుడు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది… ప్రభాస్ ఆమెను తీసేయించాల్సిందే అని సోషల్ మీడియాలో పోస్టులు… అది తెలుగు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాయే…
నీళ్లు, రక్తం ఒకేచోట సమాంతరంగా ప్రవహించలేవు… ఇదేకదా సింధు జల ఒప్పందం రద్దు వెనుక కేంద్ర ప్రభుత్వ సమర్థన… అదే కదా ఉద్వేగం… అది క్రికెట్‌కూ, అదే సినిమాలకూ వర్తిస్తుంది కదా అంటారు నెటిజనం..!! ప్రభాస్ రాబోయే రోజుల్లో ఇంకా సఫర్ అవుతాడని కదా వేణుస్వామి చెప్పింది..!!
నేను పాకిస్థానీ కాదు …. తనది కరాచీ అనీ, తను ఓ పాకిస్థానీ మిలిటరీ ఆఫీసర్ బిడ్డ అని కదా ఇన్నాళ్లూ వార్తల్లో ప్రచారం… ఆమె ఎప్పుడూ దీన్ని ఖండించలేదు, నేను ఫలానా అని చెప్పలేదు… ఇప్పుడిక అర్జెంటుగా పహల్గాం పైశాచికాన్ని ఖండించింది… నాది ఇండియన్- అమెరికన్ కుటుంబం అంటోంది…
నా తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లాకే, అమెరికాలోనే నేను పుట్టానని చెబుతోంది… కానీ నేటివ్, రూట్స్ మాత్రం తన తాజా ట్వీట్‌లో వెల్లడించలేదు… ఆర్టిస్టుగా పాజిటివిటీని, ప్రేమను వ్యాప్తి చేస్తాను తప్ప ద్వేషాన్ని కాదు అని అంటోంది… మరిన్నాళ్లూ ఈ క్లారిటీ మైత్రీ మూవీస్ నుంచి కూడా ఎందుకు రాలేదబ్బా…!!
డ్యామేజీ జరగకుండా మైత్రీ మూవీస్ వాళ్లే ఈ ట్వీట్ పెట్టించారనేది ప్రచారం… ఏమో మరి… వికీయే చెబుతోంది ఆమె జాతీయత ఏమిటో… ఇలా…
అమెరికాలో పుట్టలేదట, ఎనిమిదేళ్ల వయస్సులో కాలిఫోర్నియాకు వెళ్లిందట కుటుంబంతోపాటు… నేటివ్ కరాచీయేనట… ప్చ్, మైత్రీ మూవీస్ ఏవో ట్వీట్లతో ఏదో కంట్రోల్ చేద్దామనుకుంటున్నారు గానీ… ఫాఫం… ఇంకానయం, వాళ్లది నిజానికి భీమవరం పక్క ఊరేననీ, రొయ్యల చెరువుల్లో నష్టపోయి కాలిఫోర్నియా వలస వెళ్లారనీ చెప్పడం లేదు…
పాకిస్థానీ నటుడు నటించిన అబిర్ గులాల్ రిలీజును అనుమతించబోమని కేంద్ర ఐఅండ్‌బి మినిస్ట్రీ చెబుతున్నట్టు తాజా వార్త… మరి ప్రభాస్ సినిమా..?!
Share this Article