.
Pardha Saradhi Upadrasta … 𝗣𝗮𝗸𝗶𝘀𝘁𝗮𝗻’𝘀 𝗗𝗲𝗳𝗲𝗻𝗰𝗲 𝗠𝗶𝗻𝗶𝘀𝘁𝗲𝗿 𝗷𝘂𝘀𝘁 𝘀𝗮𝗶𝗱 𝘁𝗵𝗲 𝗾𝘂𝗶𝗲𝘁 𝗽𝗮𝗿𝘁 𝗼𝘂𝘁 𝗹𝗼𝘂𝗱. లైవ్ టీవీలో. “మమ్మల్ని ఉచ్చులో పడేశారు. మాకు అత్యవసరంగా 5 బిలియన్ డాలర్లు కావాలి. ఇరాన్‌పై దాడి చేయక తప్పదు.” అని…
ఇది పాకిస్తాన్ తీరును బయటపెడుతున్న శత్రువు కాదు. ఇది పాకిస్తాన్ సొంత రక్షణ మంత్రి కెమెరా ముందు తన దేశం ఒక కీలుబొమ్మ అని వాపోతున్న దృశ్యం.
ఆయన ఇప్పుడే ఒప్పుకున్న ఈ సంఘటనలు క్రమం చూద్దాం.
Ads
1 — యూఏఈ పాకిస్తాన్‌కు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. మా అప్పు తీరుస్తారా లేదా అని వత్తిడి పెట్టింది.
2 — సౌదీ, ఖతార్ మీకు మేము రుణాలు అందిస్తాయి అన్నాయి.
3 — దానికి ధర? మా రాజ్యాన్ని రక్షించడానికి మీ సైన్యాన్ని పంపండి. మాతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని పాటించండి లేదా, మా అప్పు కూడా తీర్చండి.
4 — 15,000 మంది పాకిస్తానీ సైనికులు సౌదీ వెళ్ళి ఇప్పుడు సౌదీ అరేబియాకు కాపలాగా ఉన్నారు
5 — ఇరాన్, అమెరికా చర్చలు విఫలమయ్యాయి , పాకిస్తాన్ తాను భరించలేని, గెలవలేని, ఎన్నడూ కోరుకోని యుద్ధంలోకి లాగబడింది . ఇరాన్ సౌదీ మీద దాడి చేసినా, సౌదీ ఇరాన్ మీద దాడి చేసినా ఈ సైనికులు యుద్ధంలో పాల్గొనాలి. అది కూడా తన సోదర దేశం అని నిన్నటి దాకా శాంతి చర్చలకు పిలిచిన ఇరాన్ తో.
𝗣𝗮𝗸𝗶𝘀𝘁𝗮𝗻 𝗱𝗶𝗱𝗻’𝘁 𝘀𝗲𝗻𝗱 𝘀𝗼𝗹𝗱𝗶𝗲𝗿𝘀 𝘁𝗼 𝗦𝗮𝘂𝗱𝗶. 𝗜𝘁 𝘀𝗼𝗹𝗱 𝘁𝗵𝗲𝗺.
అణ్వాయుధాలు కలిగిన దేశం. 22 కోట్ల జనాభా. ప్రపంచంలో 7వ అతిపెద్ద సైన్యం. అయినా, ఆ దేశం అప్పు చేసిన డబ్బుతో, అప్పు చేసిన సమయంతో, అద్దెకు తీసుకున్న విధేయతతో నడుస్తోందని దాని రక్షణ మంత్రి ఇప్పుడే ప్రత్యక్ష ప్రసారంలో ఒప్పుకున్నారు.
𝗧𝗵𝗶𝘀 𝗶𝘀 𝘄𝗵𝗮𝘁 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝘀 𝘄𝗵𝗲𝗻 𝘆𝗼𝘂 𝘀𝗲𝗹𝗹 𝘆𝗼𝘂𝗿 𝘀𝗼𝘃𝗲𝗿𝗲𝗶𝗴𝗻𝘁𝘆 𝗳𝗼𝗿 𝗮 𝗹𝗼𝗮𝗻 𝗰𝗵𝗲𝗾𝘂𝗲.
ఇదే భారత్ లో మీ రక్షణ మంత్రి జాతీయ టీవీలో “మనం చిక్కుకుపోయాం” అని చెప్పిన తరువాత ఏమి జరుగుతుందో ఊహించుకోండి. మీరు దేశాన్ని తగలబెట్టేస్తారు.
𝗣𝗮𝗸𝗶𝘀𝘁𝗮𝗻𝗶𝘀 𝗮𝗿𝗲 𝗰𝗹𝗮𝗽𝗽𝗶𝗻𝗴. ఏదో జరిగిపోయింది అద్భుతం జరిగిపోయింది అని చప్పట్లు కొట్టుకుంటున్నారు.
దేశం అంటే కేవలం సరిహద్దులు కాదు,
ఆత్మగౌరవం, స్వతంత్ర నిర్ణయాలు, , బాధ్యత.
— ఉపద్రష్ట పార్ధసారధి
#Pakistan #Geopolitics #Iran #MiddleEast #GlobalPolitics #IndiaPerspective #Defense #WorldNews #PardhaTalks
Share this Article