Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీలంక బాటలోనే పాకిస్థాన్ కూడా..! మండిపోతున్న పెట్రో ధరలు..!!

May 28, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …. పాకిస్థాన్ పరిస్థితి కూడా శ్రీలంక లాగానే మారబోతున్నది. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది తప్పితే మిగతా అంతా కూడా అలాగే ఉండబోతున్నది. ప్రస్తుతం పాకిస్థాన్ రూపాయి ఒక డాలరుతో పోలిస్తే 203.5 గా ఉంది.

తాజాగా పాకిస్థాన్ లోని నూతన ప్రభుత్వం ప్రజలకి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ల మీద ఇస్తున్న సబ్సిడీని బాగా తగ్గించింది. దాంతో పెట్రో ఉత్పత్తుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ఒకే రోజు అన్నిపెట్రో ఉత్పత్తుల మీద 30 రూపాయలు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. పాకిస్థాన్ చరిత్రలో ఒకే రోజు పెట్రోల్ మీద 30 రూపాయలు పెంచడం ఇదే ప్రధమం.

పాకిస్థాన్ లో ఒక లీటర్ పెట్రోల్ ధర ఈ రోజు – Rs 179-86

Ads

పాకిస్థాన్ లో ఒక లీటర్ డీజిల్ ధర ఈ రోజు – Rs 174-15

పాకిస్థాన్ లో ఒక లీటర్ కిరోసిన్ ధర ఈ రోజు -Rs 155-56

అడుగంటి పోతున్న విదేశీ మారక నిల్వలు ఒక వైపు, అలాగే పాత బాకీలకి కట్టాల్సిన వడ్డీలు మరో వైపు పాకిస్థాన్ కి తప్పని సరై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ముందు మోకరిల్లే స్థితిని తీసుకొచ్చింది. IMF బెయిల్ అవుట్ పాకేజీ ఇవ్వాలంటే ముందు అన్ని రంగాలలోనూ ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ప్రస్తుత ప్రధాని షానబాజ్ షరీఫ్ ఒకే రోజు 30 రూపాయలు రేటు పెంచాల్సి వచ్చింది.

అయితే ఐఎంఎఫ్ షరతు ప్రకారం మొత్తం సబ్సిడీని ఎత్తి వేయాల్సి ఉంటుంది. ఒకే రోజు 30 రూపాయలు సబ్సిడీని ఎత్తివేసినా ఇంకా పెట్రోల్ మీద Rs 21-83 లు సబ్సిడీ మిగిలే ఉంది. అంటే ఈ 21 రూపాయల సబ్సిడీని కూడా ఎత్తివేయాల్సి ఉంటుంది. అలాగే డీజిల్ మీద 56-71 సబ్సిడీ ఉంది. దీనిని కూడా ఎత్తివేయాల్సి ఉంటుంది. కిరోసిన్ మీద ఇంకా 17-02 సబ్సిడీ ఉంది. ఇంకా దీనిని కూడా తీసివేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర 200/- డీజిల్ ధర 225/-,కిరోసిన్ ధర 175 రూపాయలు అవ్యవచ్చు.

ఇప్పటికే రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ కి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరల పెంపు వల్ల రవాణా వ్యయం పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరిగిపోతాయి. ఇప్పటికే కిలో గోధుమలు 170 రూపాయలు ఉండగా అది అంతర్జాతీయంగా ఏర్పడిన కొరత వలన 200 అయ్యింది. ఇప్పుడు పెట్రోల్, డీజీల ధరలు పెరగడం వలన అది కాస్తా 220 అయినా ఆశ్చర్యపోవక్కరలేదు. వంట గ్యాస్, పాలు ఇలా అన్నిటి ధరలూ గత సంవత్సరం నుండే ఆకాశంలో ఉన్నాయి.

మరో వైపు చైనా అప్పు, దాని తాలూకు వడ్డీల ఉచ్చు బిగుస్తున్నది. 2015 లో మన దేశ ప్రతిపక్షాలు చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ CPEC లో భారత్ భాగస్వామి కాకపోవడం మీద పెద్ద రచ్చ చేశాయి. అదేదో చారిత్రాత్మక తప్పిదం అంటూ మన దేశ పత్రికలూ వాకృచ్చాయి కానీ ఇప్పుడు ఆ నోళ్ళు ఎందుకో మూగపోయాయి. అప్పట్లో ప్రధాని మోడీ CPEC లో చేరకపోవడం మన దేశానికి పెద్ద నష్టం అంటూ వాపోయింది చైనా అనుకూల లెఫ్ట్ మీడియా.

ప్రధానిగా ఇమ్రాన్ లేకపోయినా పాకిస్థాన్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే అన్ని తప్పులూ ఇమ్రాన్ మీదకి నెట్టివేయడానికి కొత్త తోలు బొమ్మని ప్రతిష్టించింది పాకి సైన్యం. మరో వైపు ప్రస్తుత పార్లమెంట్ ని రద్దు చేసి ఎన్నికలు జరపాలి అంటూ ఇమ్రాన్ మద్దతు దారులు వీధి పోరాటాలకి దిగుతున్నారు. ఇది అక్కడి ఆర్ధిక వ్యవస్థని మరింత దెబ్బ తీసే చర్య. పాకిస్థాన్ లో ఆర్ధిక సంక్షోభం ముదిరితే సైన్యం ప్రజల దృష్టి మరల్చడానికి ఇంకో కార్గిల్ దుస్సాహసానికి పాల్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బహుశా రాబోయే శీతాకాలం దీనికి వేదిక కావొచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions